కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి | Several People injured As Gunmen Open Fire in California | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కాల్పులు.. నలుగురు మృతి

Published Mon, Nov 18 2019 1:14 PM | Last Updated on Mon, Nov 18 2019 1:22 PM

Several People injured As Gunmen Open Fire in California - Sakshi

కాలిఫోర్నియా : కాలిఫోర్నియాలోని ఓ ఇంట్లో పార్టీ చేసుకుంటున్న బృందంపై గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా అనేకమంది గాయాలపాలయ్యారు. లాస్‌ ఏంజిల్స్‌కు ఉత్తరాన 320 కి.మీ దూరంలో ఉన్న ఫ్రెస్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాలిఫొర్నియాలోని ఓ స్నేహితుల బృందం తమ బంధువులతో కలిసి గెట్‌ టు గెదర్‌ పార్టీని జరుపుకొంటున్న సమయంలో దుండగులు ఈ కాల్పులు జరిపారు.  ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఇంట్లో మొత్తం 35 మంది సభ్యులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ముగ్గురు ఘటనాస్థలిలోనే మరణించిగా.. మరొకరు ఆస్పత్రిలో మృతిచెందినట్లు వెల్లడించారు. ఇక మిగిలిన క్షతగాత్రులను  స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. దాడికి తెడబడ్డ నిందితులు తమకు పరిచయం లేని వ్యక్తులని బాధితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితుల ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement