అర్వాల్: బీహార్‌లోని అర్వాల్ జిల్లాలో సీపీఐ(ఎంఎల్) నేత సునీల్ చంద్రవంశీపై దుండగులు కాల్పులు జరిపారు. ఆయన మార్కెట్ నుండి తన ఇంటికి వెళుతుండగా, బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అతన్ని అడ్డుకుని, తుపాకీతో కాల్చిచంపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సునీల్ చంద్రవంశీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన అర్వాల్ జిల్లాలోని కింజర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కన్ బిఘా గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్పీ రాజేంద్ర కుమార్ భిల్ మాట్లాడుతూ ఈ ఘటనకు పాతకక్షలే కారణమై ఉంటాయని అన్నారు. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసు బృందం గాలింపు చర్యలు చేపట్టిందన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment