పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్‌లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు.
Comments
Please login to add a commentAdd a comment