mim leader
-
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
నా కొడుకు తప్పు చేయలేదు.. బక్రీద్ వేళ బోధన్ ఎంఐఎం నేత తండ్రి రోదన
-
హైదరాబాద్: MIM నేత కషఫ్‌పై పీడీయాక్ట్
-
హైదరాబాద్‌లో మరో నేతపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్:సోషల్‌మీడియాలో తన వీడియోల ద్వారా రెండు వర్గాల మధ్య విద్వేషాలు రగిలిస్తున్న ఓల్డ్ మలక్‌పేటకు చెందిన యువకుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. చాదర్‌ఘాట్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ఓల్డ్‌మలక్‌పేటకు చెందిన అబ్దాహు ఖాద్రీ అలియాస్ కసఫ్ తన ట్విట్టర్ ఖాతాలో తరచూ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్ట్‌లు పెట్టేవాడు. ఈనెల 22, 23న బషీర్‌బాగ్‌లోని నగర పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న అతను రెచ్చగొట్టేలా నినాదాలు చేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సైతం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అతడి చర్యల వల్ల నగరంలో పలు ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. పోలీసు వాహనాలపై, వేటు వ్యక్తుల వాహనాలపై పలువురు దాడులు జరిగాయి. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కసఫ్‌పై గతంలోనూ నగరంలోని మీర్‌చౌక్, చాదరఘాట్, సీసీఎస్‌లో కేసులు ఉన్నట్లు తెలిపారు. అతడి విద్వేష పూరిత, రెచ్చగొట్టే వీడియోలు, నినాదాలు ప్రజల భద్రతపై ప్రభావాన్ని చూపిస్తాయని పోలీసులు తెలిపారు. ఇదీ చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి! ఈ నేపథ్యంలో నగర కమిషనర్ ఆదేశాల మేరకు అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంగళవారం చాదర్‌ఘాట్ పోలీసులు భారీ బందోబస్తు మధ్య అతడిని అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. కసఫ్ గతంలో ఎంఐఎం సోషల్‌మీడియా కన్వీనర్‌గా పని చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సోషల్‌మీడియాలో రెచ్చగొట్టే వీడియోలు పెడుతున్న కారణంగా పార్టీ అతడిని దూరంగా పెట్టినట్లు తెలిసిందని ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు. -
కరోనాతో MIM నేత గొరేమియా దంపతులు మృతి
-
చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ శుక్రవారం వీరంగం సృష్టించాడు. కొందరిపై తుపాకీతో కాల్పులు జరపడంతోపాటు తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిలో బుల్లెట్ గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. మరొకరు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. అదుపులోకి తీసుకున్నాం: ఓఎస్డీ ఈ ఘటనపై జిల్లా ఓఎస్డీ రాజేశ్చంద్ర విలేకరులతో మాట్లాడుతూ ఫారూఖ్ అహ్మద్ 0.32 ఎంఎం పిస్టల్‌తో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడని, జమీర్‌కు రెండు బుల్లెట్లు, మోతిషీమ్‌కు ఒక బుల్లెట్ తగిలిందన్నారు. నిందితుడు ఫారూఖ్ అహ్మద్‌పై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కస్టడీలోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కాగా, రిమ్స్ ఆస్పత్రిలో బాధితులను ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పరామర్శించారు. చిచ్చురేపిన క్రికెట్.. జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడిన వారిని తొలుత రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. -
ఎంఐఎం నేతను ఉరి తీయాలి
సాక్షి, ఆసిఫాబాద్ : హైదరాబాద్ పాత బస్తీలోని చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఎంఐఎం నాయకుడు షకీల్‌ను ఉరి తీయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు మొండయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని అంకుసాపూర్‌లో ఆయన మాట్లాడారు. మలక్‌పేట ఎమ్మెల్యే హైమద్ అనుచరుడు షకీల్ పథకం ప్రకారమే అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించారు. బాలిక కుటుంబానికి ప్రాణ భయం ఉందన్నారు. బాధితురాలికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. పోలీసులు అతడిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు నా గోశ శంకర్, రేగుంట సాగర్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు. -
‘మావో’ల సమస్య పెరుగుతోంది.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మావోయిస్టుల సమస్య పెరుగుతోందని, దీని కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. మావోయిస్టుల చర్యల మీద దృష్టి సారించాలన్నారు. సోమవారం శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. మావోయిస్టులు విస్తరిస్తే కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు ప్రమాదం ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ఇటీవల తాము ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన సందర్భంలో మావోయిస్టుల ప్రాబల్యం దృష్ట్యా తమ వాహనాలను మళ్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారని గుర్తుచేశారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌కు ఆర్థిక సాయం పెంచడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఎంఐఎం నేత
హైదరాబాద్: శనివారం తెల్లవారుజామున నగరంలోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఎంఐఎం నేత పట్టుబడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తరఫున రాజేంద్రనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన జావీద్ మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులకు చిక్కారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జావీద్ అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. -
ముస్లిమ్‌లకూ రిజర్వేషన్లు అమలు చేయాలి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు అమలు చేయాలని, మైనారిటీలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. మరాఠాలకు కల్పిస్తున్న రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అయితే తమ పిల్లలు కూడా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని కోరుకుంటున్నామని చెప్పారు. ముస్లిమ్ ఆరక్షణ్ పరిషత్ బుధవారం సాయంత్రం కోండ్వాలోని కౌసర్‌బాగ్‌లో ఏర్పాటు చేసిన సభలో అసదుద్దీన్ ప్రసంగించారు. దేశంలో ముస్లిమ్‌ల జనాభా 11 శాతం ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉన్నతాధికారులుగా తమ మతానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరని అన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో ముస్లిమ్‌లకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదన్నారు. మరోవైపు తప్పుడు కేసుల్లో ఇరుక్కుని అనేక మంది ముస్లిమ్ యువకులు కొన్నేళ్లుగా మహారాష్ట్రలోని జైళ్లలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ జైలులో ఉంటూ శరీర దారుఢ్యాన్ని (సిక్స్ ప్యాక్) పెంచుకుంటున్నాడని, తమ పిల్లలు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. ఏళ్ల తరబడి తాము కూడా బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడామని, ఈ దేశాన్ని ప్రేమిస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా, మజ్లిస్ నేత బహిరంగసభపై పోలీసులు పలు నిషేధాజ్ఞలు విధించారు. అంతకుముందు పుణేలో అసదుద్దీన్ విలేకరులతో మాట్లాడుతుండగా, పోలీసులు ఒక నోటీసును అందచేశారు. వనవాడీ డివిజన్ ఏసీపీ రాజన్ భొగాలే సంతకం చేసిన ఆ నోటీసులో సభకు సంబంధించిన ఆంక్షలను వివరించారు. మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే విధంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని కోరారు. బహిరంగసభను లైవ్ టెలికాస్ట్ చేయకుండా పోలీసులు మీడియాపై కూడా ఆంక్షలు విధించారు. ఈ షరతులకు అంగీకరిస్తూ ఒవైసీ ఆ నోటీసుపై సంతకం చేసినట్టు తెలిసింది. ఈ నోటీసులు, ఇలాంటి నిషేధాజ్ఞలు తనకు అలవాటేనని ఒవైసీ పేర్కొన్నారు. అయితే ఇది అనారోగ్యకరమైన ప్రజాస్వామ్య ప్రక్రియ అని విమర్శించారు. పోలీసులు తన సభకు అనుమతినివ్వకపోతే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానని చెప్పారు. ఇతర మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఒవైసీ సభ జరిగిన కౌసర్‌బాగ్ హాల్ వెలుపల శివసేన కార్యకర్తలు కొద్దిసేపు నినాదాలు చేశారు. -
అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో
-
అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో
శాసన సభ్యుడంటే ఎలా ఉండాలో తెలుసా.. ఎలా ప్రిపేర్ కావాలో తెలుసా.. తెలుసుకోవాలంటే సోమవారం నాటి శాసన సభ సమావేశాలను ఒక్కసారి చూడాల్సిందే. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని, తాను చేసిన అభివృద్ధిని ఎవరైనా కాదనగలరా అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న ఒక్క మాటకు, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. తిరుగులేని లెక్కలతో, ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలతో సభ మొత్తాన్ని గుండుసూది పడినా వినిపించేంత నిశ్శబ్దంలో ముంచెత్తారు. దేశంలోని మొట్టమొదటి విద్యుత్ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా.. హైదరాబాద్‌లో!! భారత కోకిల సరోజినీ నాయుడు లండన్‌లో చదువుకోడానికి స్కాలర్షిప్ ఇచ్చింది ఎవరో తెలుసా.. నిజాం! మీరందరూ కూర్చున్న ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. నిజాం!! హైదరాబాద్ జాగీర్ స్కూల్.. అదే ఇప్పటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలును కట్టించింది కూడా ఆ నిజామే. అదే స్కూల్లో సభా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, నేను, మా అన్న, జగన్ మోహన్ రెడ్డి, పల్లంరాజు.. అందరం చదువుకున్నాం. హైదరాబాద్‌లో ఎప్పుడెప్పుడు ఏయే ఫ్యాక్టరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు వచ్చాయో తెలుసా.. అంటూ మొత్తం సంవత్సరాల వారీగా లెక్కలు, పేర్లు ఏకబిగిన అరగంటపాటు చదివిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం నాడు అసెంబ్లీలో వన్ మ్యాన్ షో నడిపించారు. ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే, లెక్కలన్నీ దగ్గర పెట్టుకుంటే, దానికి తోడు తగిన వాగ్ధాటి ఉంటే సభను ఎలా తన అదుపులోకి తెచ్చుకోవచ్చన్న దానికి అక్బరుద్దీన్ ఒవైసీ చక్కటి ఉదాహరణగా నిలిచారు. నిజాం కాలం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, చెరువులు.. ఇలా మొత్తం వేటివేటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటుచేశారో సంవత్సరాలతో సహా లెక్కలు మొత్తం చదివి వినిపించారు. ఈ చారిత్రక సత్యాలను ఎవరైనా కాదనగలరా అంటూ నిలదీశారు. ఒక్కరు సమాధానం చెబితే ఒట్టు!! హైదరబాద్ నగర అభివృద్ధి మొత్తం తనహయాంలోనే జరిగిందని చెప్పుకొన్న విపక్షనేత చంద్రబాబు నాయుడుకు ఈ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. సభ సజావుగా నడవకుండా ఉండేందుకు తన ఎమ్మెల్యేలతో గొడవ చేయించారు తప్ప, అక్బర్ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆయన గానీ, ఆయన సహచరులుగానీ సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ నగరంలో అప్పటికే అభివృద్ధి ఉంది కాబట్టే దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ చెప్పిన మాటలను ఎవరూ కాదనలేకపోయారు.