లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రోడ్డు దాటేందుకు సమయాత్తమవుతున్న ఓ పాపర్టీ డీలర్‌పై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో బాధితుడు హరీష్ పచౌరీ (50) తీవ్ర గాయాలపాలయ్యారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాహనాలు, జనం రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పచౌరీ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరీనీ అరెస్టు చేయలేదని ఆగ్రా ఎస్పీ బబ్లూ కుమార్ మీడియాకు తెలిపారు. మృతుని కుటుంబంతో ఎవరికైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణం విచారిస్తున్నామని అన్నారు.
(చదవండి: నాలుగేళ్ల బాలుడిపై దారుణం..)
A property dealer’s murder on a busy Agra intersection , caught on cctv . Amazing impunity . 24 hours after the incident ,still awaiting word from @agrapolice on arrests ... pic.twitter.com/k9ah4ChKMv
— Alok Pandey (@alok_pandey) December 20, 2020
Comments
Please login to add a commentAdd a comment