property dealer
-
ఒక్క ఫ్లాట్.. రిజిస్ట్రేషన్ ఖర్చులే రూ.5 కోట్లు! ఎవరీ బిజినెస్ లేడీ?
Gurugram Property Deal : దేశ రియల్ ఎస్టేట్‌లో ఖరీదైన డీల్స్‌లో ఒకటి తాజాగా జరిగింది. ఇటీవల గురుగ్రామ్‌లోని అపార్ట్మెంట్ రూ.95 కోట్లకు అమ్ముడుపోయింది. దీనికి రిజిస్టేషన్ ఖర్చులే రూ.5 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తోంది. ఈ ఖరీదైన ఫ్లాట్‌ను ఓ బిజినెస్ లేడీ కొనుగోలు చేశారు. ఇంతకీ ఎవరీమె.. ఆ డీల్ విశేషాల్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. వెస్బాక్ లైఫ్‌స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, వీ బజార్ సీఎండీ హేమంత్ అగర్వాల్ సతీమణి స్మితి అగర్వాల్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్‌లో అపార్ట్‌మెంట్‌ను 95 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ అయిన సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంపాదించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. స్మితి అగర్వాల్ పేరు మీద సేల్ డీడ్ 2024 జనవరి 18న ఖరారైంది. లావాదేవీలో భాగంగా ఆమె రూ. 4.75 కోట్ల స్టాంప్ డ్యూటీని, రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 50,003 చెల్లించారు. పత్రాల ప్రకారం.. 10,813 చదరపు అడుగుల అపార్ట్మెంట్ డీఎల్ఎఫ్ ది కామెలియాస్‌లో ఉంది. ఇది గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్, డీఎల్ఎఫ్ ఫేజ్ 5లో ఉన్న ఒక ఉన్నత స్థాయి లగ్జరీ కండోమినియం. అదనంగా అపార్ట్మెంట్లో ఐదు పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రాపర్టీని చదరపు అడుగు రూ.87,857.20 చొప్పున విక్రయించారు. గురుగ్రామ్ ఉన్న ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో అనేక ఖరీదైన, లగ్జరీ ఆస్తి లావాదేవీలు జరిగాయి. ఇటీవలి డీల్స్ గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ వద్ద 2023 అక్టోబరు3లో 11,000 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రీసేల్ చేయడం ద్వారా రూ. 100 కోట్లకుపైగా లభించింది. అదే నెలలో మేక్మైట్రిప్ గ్రూప్ సీఈవో రాజేష్ మాగో గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ మాగ్నోలియాస్‌లోని 6,428 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను రూ. 33 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే జెన్పాక్ట్ మానవ వనరుల అధిపతి పీయూష్ మెహతా అదే కాంప్లెక్స్‌లో 6,462 చదరపు అడుగుల ఫ్లాట్‌ను రూ. 32.60 కోట్లకు కొనుగోలు చేశారు. 2023 ఫిబ్రవరిలో భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సతీమణి వసుధ రోహత్గీ ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో 2,100 చదరపు గజాల బంగ్లాను రూ. 160 కోట్లకు కొనుగోలు చేశారు. -
ప్రాపర్టీ డీల్: హీరో షారుఖ్ భార్య, గౌరీ ఖాన్‌కు షాక్!
సాక్షి, ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ భార్య, ఇంటీరియర్ డిజైనర్ గౌరీ ఖాన్‌పై లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు.ముంబైకి చెందిన వ్యక్తి మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ దాఖలైంది. గౌరీబ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న కంపెనీ డబ్బలు తీసుకుని కూడా ఫ్లాట్ అప్పగించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ముంబైకి చెందిన జస్వంత్ షా ఫిర్యాదు చేశారు. లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీ ప్రాంతంలోని తులసియాని గోల్ఫ్ వ్యూలో ఉన్న ఫ్లాట్ నిమిత్తం రూ. 86 లక్షలు చెల్లించినప్పటికీ తనను కాదని ఆ ఫ్లాట్‌ను వేరొకరికి ఇచ్చారని ఫిర్యాదుదారు ఆరోపించారు. బ్రాండ్ అంబాసిడర్ గౌరీ ఖాన్ ప్రభావంతో తాను సదరు ఫ్లాట్ కొన్నానని ఫిర్యాదుదారు తెలిపారు. దీంతో గౌరీతో పాటు తులసియాని కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ లిమిటెడ్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ తులసియాని, డైరెక్టర్ మహేష్ తులసియానిపై కూడా ఫిర్యాదు నమోదైంది. -
విలన్ రేంజ్లో రెచ్చిపోయిన వ్యాపారి..మహిళను కాలితో తన్ని...
పెద్ద ప్రమాదం కాకపోయినా... నానాబీభత్సం సృష్టించాడు ఒక వ్యక్తి. వృద్ధ దంపతులన్న కనికరం లేకుండా ఘోరంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పోలీసులు పెద్ద ప్రమాదం కాదని తేల్చారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రోడ్డుపై అనుకోకుండా చిన్నప్రమాదం జరిగింది. వాస్తవానికి అది పెద్ద ప్రమాదం కాదు. ఒక వృద్ధ దంపుతులు ప్రయాణిస్తున్న కారు, వ్యాపారీ కారు ఒక దానికొకటి జస్ట్ రెప్పపాటులో రాసుకున్నాయి. అంతే సదరు వ్యాపారి రోడ్డుపై కారు ఆపేసి ఆ వృద్ధ దంపతులపై గొడవకు దిగాడు. ఆ దంపతుల్లో భర్త పిడీయాట్రిక్ వైద్యుడు కాగా, అతడి భార్య ఉపాధ్యాయురాలు. సదరు వ్యక్తి వ్యాపారి దంపతులపై దాడి చేయడం, మహిళను తన్నిడం వంటివి చేశాడు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ధర్మేంద్ర కుష్వాపై కేసు నమోదు చేశారు. సదరు వృద్ధ దంపతులు కూడా ఈ ఘటనపై ఫిర్యాదు చేసినట్లు వాపోయారు. తమకు సాయం చేయడానికి ఎవరు రాలేదని ఆ దంపతులు వాపోయినట్లు పోలీసులు తెలిపారు. వాస్తవానికి అది ఏవిధంగానూ పెద్ద ప్రమాదం కాదని, అతడు కావాలనే వారిపై దాడికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. INDORE ROAD RAGE Viral | मिनी मुंबई Indore में Road Rage, मामूली टक्कर के बाद डॉक्टर और शिक्षिका को पीटा | Indore |MP Oh My God Oh My God Part 1.1 pic.twitter.com/3MQQm8KoTk — Adil INC ( Being Human) (@Adil_INC_) December 6, 2022 (చదవండి: శిక్ష పడుతుందన్న భయంతో.. విచారణ ఖైదీ ఆత్మహత్య) -
దారుణం: చూస్తుండగానే దడేల్, దడేల్!
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు రోడ్డు దాటేందుకు సమయాత్తమవుతున్న ఓ పాపర్టీ డీలర్‌పై కాల్పులు జరిపారు. పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరపడంతో బాధితుడు హరీష్ పచౌరీ (50) తీవ్ర గాయాలపాలయ్యారు. అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాహనాలు, జనం రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. పచౌరీ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరీనీ అరెస్టు చేయలేదని ఆగ్రా ఎస్పీ బబ్లూ కుమార్ మీడియాకు తెలిపారు. మృతుని కుటుంబంతో ఎవరికైనా పాత కక్షలు ఉన్నాయా అనే కోణం విచారిస్తున్నామని అన్నారు. (చదవండి: నాలుగేళ్ల బాలుడిపై దారుణం..) A property dealer’s murder on a busy Agra intersection , caught on cctv . Amazing impunity . 24 hours after the incident ,still awaiting word from @agrapolice on arrests ... pic.twitter.com/k9ah4ChKMv — Alok Pandey (@alok_pandey) December 20, 2020 -
పండగపూట భార్య కళ్లెదుటే భర్త కాల్చివేత
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. భార్యలు తమ భర్త దీర్ఘాయుష్షు కోరుకుంటూ చేసే కడ్వా చౌత్ వ్రతం రోజునే.. భార్య కళ్లెదుటే భర్తను కాల్చిచంపారు. ఆశారామ్ (42) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే దారుణహత్యకు గురయ్యాడు. కడ్వా చౌత్ వ్రతం సందర్భంగా ఉదయం నుంచి ఉపవాసం ఉన్న ఆయన భార్య.. ఆశారామ్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఉన్నారు. పసుపుపచ్చ రంగు షర్టు వేసుకొచ్చిన పాతికేళ్ల యువకుడు తన భర్తను కాల్చిచంపాడని ఆమె తెలిపారు. అతడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ అతడు మరణించినట్లు ప్రకటించారు. ఆశారాంకు ఎవరితోనూ శత్రుత్వం లేదని.. అయితే గత దీపావళి రోజున జరిగిన కాల్పుల కేసులో మాత్రం ఇతడు కీలక సాక్షి అని బంధువులు చెప్పారు. కానీ ఆ కోణాన్ని పోలీసులు కొట్టిపారేశారు. ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏవీ లేవని, అందువల్ల పోలీసులు ప్రత్యక్ష సాక్షులు చెప్పినదాన్ని బట్టి ఆధారాలు సేకరిస్తున్నారని అన్నారు. ఆశారామ్ బీజేపీ కార్యకర్త అని, స్థానిక బీజేపీ ఎంపీతో సన్నిహితంగా వ్యవహరిస్తుంటారని కొందరు చెబుతున్నారు.