
ప్రతీకాత్మక చిత్రం
కోల్‌కత్తా: తృణమాల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడుని దుండగులు కాల్చి చంపారు. ఇటీవల టీఎంసీ ఎమ్మెల్యేను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చిన ఘటన మరవకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన టీఎంసీ నాయకుడు కార్తీక్ నస్కర్‌ను దుండగులు అతి దగ్గర నుంచి కాల్చిచంపారు. కార్తీక్ భార్య స్వప్న నస్కర్ దారియా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఉన్నారు.
కార్తీక్ టాంగ్రఖలి నుంచి బైక్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తొలుత అతన్ని అడ్డగించిన కొందరు వ్యక్తులు పదుననైన ఆయుధాలతో తీవ్రంగా గాయపరిచారు. ఆ తర్వాత అతన్ని కాల్చివేశారు. అక్కడున్నవారు ఆస్పత్రి తరలించేలోపే కార్తీక్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఆదివారం సాయంత్రం కుల్తూలికి చెందిన అధికార పార్టీకి చెందిన ఓ కార్యకర్తను కూడా గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు.
Comments
Please login to add a commentAdd a comment