కాబోయే భర్తతో రెస్టారెంట్‌కు.. టెకీ దారుణ హత్య | Woman Shot Dead By Men In Gurgaon After Failing To Looting Couple | Sakshi
Sakshi News home page

దొంగతనం విఫలం.. యువతిపై కాల్పులు

Published Sat, Nov 7 2020 4:14 PM | Last Updated on Sat, Nov 7 2020 8:45 PM

Woman Shot Dead By Men In Gurgaon After Failing To Looting Couple - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని పరిసరాల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తతో సరదాగా బయటకు వెళ్లిన యువతి ఓ దొంగ చేతిలో తుపాకీ కాల్పులకు బలైన ఘటన గురుగ్రామ్‌‌లో జరిగింది. గత గురువారం జరిగిన ఈ ఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం... చత్తీస్‌‌గడ్‌‌‌కు చెందిన పూజ శర్మ అనే యువతి ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో గతవారం నవంబర్‌ 3న తన కాబోయే భర్తతో కలిసి సాయంత్రం కారులో బయటకు వెళ్లింది. రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఆనంతరం సరదాగా లాంగ్‌డ్రైవ్‌కు వెళ్లారు. (చదవండి: నకిలీ కార్డులు; లగ్జరీ షాపింగ్‌లు.. చివరికి)

ఈ క్రమంలో గుర్తుతెలియని దుండగులు మోటారు సైకిల్‌పై వెంబడించి లూటీ చేసే ప్రయత్నం చేశారు. అయితే వారి ప్రయత్నం విఫలం కావడంతో తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పూజ శర్మ తలకు బులెట్‌ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దీంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో బాధితురాలు మరణించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను అరెస్టు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement