
ప్రతీకాత్మకచిత్రం
పట్నా : బిహార్‌కు చెందిన కాంగ్రెస్ నేత రాకేశ్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. వైశాలి జిల్లాలోని సినిమా రోడ్డు ప్రాంతంలో ఉదయం 6.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మీనాపూర్ గ్రామంలోని రాకేశ్ యాదవ్ ప్రతి రోజు తన ఇంటి నుంచి సినిమా రోడ్డులోని జిమ్‌కు వెళ్తారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం జిమ్‌కు వెళ్లిన రాకేష్ తిరిగి వస్తుండగా జిమ్ సమీపంలో దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి రాకేశ్‌పై వరుసగా అయిదు రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగులు జరిపిన కాల్పుల్లో తీవ్ర గాయాలైన యాదవ్‌ను సఫ్దర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు దృవీకరించారు. రాకేశ్ యాదవ్ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణల్లో దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. సంఘటన ప్రాంతంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment