![Smriti Irani Close Aide Shot At In Amethi - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/26/-irani-sundendra.jpg.webp?itok=4wWBdQS4)
సాక్షి, న్యూఢిల్లీ : అమేథిలో బీజేపీ నేత స్మృతి ఇరానీ సహచరుడు సురేంద్ర సింగ్‌ను బరూలియ గ్రామంలో శనివారం రాత్రి దుండగలు కాల్చిచంపారు. అమేథి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. బరూలియా గ్రామ మాజీ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పాతకక్షలు, రాజకీయ వివాదాలే హత్యకు కారణంగా భావిస్తున్నామని అమేథి ఎస్పీ తెలిపారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా సురేంద్ర సింగ్ స్మృతి ఇరానీకి సన్నిహితులని గ్రామస్తులు చెప్పారు. కాగా స్మృతి ఇరానీ ఆదేశాల మేరకు ఆమె తరపున స్ధానికులకు సింగ్ చెప్పులు పంపిణీ చేశారని చెబుతున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై 55,120 ఓట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment