
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కార్యకర్త, బరూలియా గ్రామ మాజీ సర్పంచ్ సరేంద్రసింగ్ అంతిమయాత్రలో అమేథీ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికైన బీజేపీ నేత స్మృతి ఇరానీ పాల్గొన్నారు. సురేంద్ర సింగ్ భౌతికకాయాన్ని స్మృతి ఇరానీ స్వయంగా తన భుజాలపై మోశారు. భారత్ మాతా కీ జై..సురేంద్రసింగ్ అమర్ రహే అంటూ గ్రామస్థులు, బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
(చదవండి : స్మృతి ఇరానీ అనుచరుడి కాల్చివేత)
బరూలియా గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి ఆయన నివాసంలోనే గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సరేంద్ర సింగ్ మరణించారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment