
రాంపూర్ : శివసేన రాంపూర్ జిల్లా మాజీ అధ్యక్షుడు అనురాగ్ శర్మ(40)ను ఇద్దరు గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్‌లోని జ్వాలానగర్‌లో రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే శర్మను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. శర్మ నిన్న రాత్రి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో ఇద్దరు దుండగులు కాల్చిచంపారు. కాగా శర్మను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లిన సమయంలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఆస్పత్రిపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ గౌతమ్ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
(పక్కింట్లో ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య)