
లాహోర్: పాకిస్థాన్‌లో మరో గ్యాంగ్‌స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్‌వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్‌లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్‌తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.
కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్‌వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment