లూధియానా: పంజాబ్ వ్యతిరేకత అనే రుగ్మతతో బాధపడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శిక్షించాలని ఆప్ అగ్రనేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీకి విజయం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గణతంత్ర వేడుకల సందర్భంగా పంజాబ్ శకటాన్ని కేంద్రం నిరాకరించడం పంజాబీలను అవమానించడమేనన్నారు.
దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసిన పంజాబ్ అమరులకు కేంద్రం నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో కేంద్రం మితిమీరి జోక్యం చేసుకుంటూ పాలన సజావుగా సాగకుండా ఆటంకాలు కలిగిస్తోందని విమర్శించారు. ఆదివారం ఆయన లూధియానాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో తనను ఇబ్బందులు పెడుతున్న కేంద్రాన్ని అడ్డుకోగలిగానన్నారు. ఇక్కడ సీఎం మాన్ కేంద్రం, బీజేపీ, గవర్నర్‌ల వైఖరితో పోరాటం సాగిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment