ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ సర్కార్‌ను ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే, పంజాబ్‌లోని ఆప్ సర్కార్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్ కావడం పెను దుమారం లేపింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిపై తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏది ఏమైనా తాము ఇండియా కూటమితోనే ముందుకు సాగుతామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కాగా, సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తాము ఇండియా కూటమి విషయంలో పూర్తి నిబద్దతతో ఉన్నామన్నారు. ఇండియా కూటమితోనే ముందుకు సాగుతామన్నారు. కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. డ్రగ్స్ కేసులో నిన్న పంజాబ్ పోలీసులు ఒక నేతను అరెస్టు చేశారని విన్నాను. దానికి సంబంధించిన వివరాలు నా దగ్గర లేవు. దీనిపై మీరు పంజాబ్ పోలీసులతో మాట్లాడుకోండి. భగవంత్ సింగ్ మాన్ ప్రభుత్వం మాత్రం నిబద్ధత కలిగినది. ఆప్ ప్రభుత్వం డ్రగ్స్ సమస్యను ముగించే లక్ష్యంతో ఉంది. ఈ పోరాటంలో ఎవరినీ విడిచిపెట్టదు అంటూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
Delhi CM Arvind Kejriwal says, ‘AAP is committed to the INDIA Alliance. AAP will not separate ways from the INDIA Alliance. Yesterday, I heard that the Punjab Police arrested a particular leader (Sukhpal Singh Khaira) in connection with drugs. I don’t have the details; you will… pic.twitter.com/CJ5mWh302b
— Gagandeep Singh (@Gagan4344) September 29, 2023
ఇదిలా ఉండగా.. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్, ఆప్ మధ్య ఎక్కడో ఒకచోట విభేదాలు బహిర్గమవుతూనే ఉన్నాయి. అయితే, పంజాబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసు (2015)లో సుఖ్‌పాల్ సింగ్ ఖైరాను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వివరణ ఇచ్చారు. అనంతరం.. సుఖ్‌పాల్‌ను ఫజిల్కాలోని జలాలాబాద్ కోర్టులో హాజరుపరచడంతో రెండు రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ పరిణామాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా ప్రతిపక్ష కాంగ్రెస్ అభివర్ణించింది. దీంతో, పంజాబ్‌లో కాంగ్రెస్, ఆప్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. దీంతో, బీజేపీ నేతలు ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఉజ్జయిని ఘోరం.. బాధితురాలి దత్తతకు ముందుకు వచ్చిన పోలీసాయన
Comments
Please login to add a commentAdd a comment