వచ్చే నెలలో కైరోలో జరిగే ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. హైదరాబాద్ యువ షూటర్ ఇషా సింగ్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగాలలో... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయ చాంపియన్ షిప్ కనబరిచిన ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశారు. ఒలింపియన్స్ మనూ భాకర్, అపూర్వీ చండేలా, అంజుమ్ మౌద్గిల్, అభిషేక్ వర్మ, దీపక్ కుమార్, యశస్వినిలకు జట్టులో చోటు లభించలేదు.
Comments
Please login to add a commentAdd a comment