భారత్ కు మరో రెండు పతకాలు
న్యూఢిల్లీ: ఏషియన్ ఎయిర్ గన్ చాంపియన్ షిప్ లో భాగంగా మూడు రోజూ కూడా భారత షూటర్లు రాణించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ రజత పతకం సాధించగా, జితూ రాయ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు.
వ్యక్తిగత విభాగంలో గుర్ ప్రీత్ సింగ్, జితూ రాయ్ లు ఫైనల్ కు చేరుకోగా.. గుర్ ప్రీత్ సింగ్ 197.6 పాయింట్లతో రజతాన్ని, జితూ రాయ్ 177.6 పాయింట్లతో కాంస్యాన్ని సాధించాడు. కాగా, ఇరాన్ కు చెందిన బోరౌజెనీ సఫారీ 198.7 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు.