అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద‌! | Indian to lose US citizenship | Sakshi
Sakshi News home page

అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద‌!

Published Thu, Jul 13 2017 3:01 PM | Last Updated on Fri, Aug 24 2018 4:46 PM

అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద‌! - Sakshi

అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద‌!

న్యూయార్క్‌: తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరాన్ని తమకు చెప్పకుండా దాచడమే కాకుండా తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించిన ఓ భారతీయ అమెరికన్‌ పౌరుడు అమెరికా పౌరసత్వాన్ని కోల్పోనున్నాడు. ప్రస్తుతం కేసు విచారణ తుది దశలో ఉన్నప్పటికీ అతడు అధికారులకు సహకరించని కారణంతో అతడిని పౌరసత్వాన్ని రద్దు చేసి బహిష్కరించనున్నారు. వివరాల్లోకి వెళితే.. గురుప్రీత్‌ సింగ్‌ అనే వ్యక్తి వాటర్‌టౌన్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఈ మధ్యే ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.

దానికి సంబంధించి అతడిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా సిరాకస్‌లోని ఫెడరల్‌ కోర్టు మూడు నెలల శిక్ష కూడా విధించింది. అదే సమయంలో అతడు తన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పౌరసత్వాన్ని ధ్రువీకరించే క్రమంలో భాగంగా యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజెన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ (యూఎస్‌సీఐఎస్‌) అధికారుల ముందు హాజరైన అతడు తాను చేసిన నేరాన్ని వారికి చెప్పలేదు. ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చినా తనపై ఏ కేసు లేదని, ఏ తప్పు చేయలేదని, అరెస్టు కాలేదని అబద్ధం చెప్పాడు. కానీ, అతడు నేరం చేసినట్లు, అరెస్టయినట్లు ఆధారాలు తెప్పించుకున్న ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతడి తప్పును గుర్తించి పౌరసత్వాన్ని త్వరలో రద్దు చేయనున్నారు. అమెరికా పౌరసత్వం ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నేరానికి పాల్పడినా అది ఆమోదం పొందదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement