United States Citizenship and Immigration Services (USCIS)
-
హెచ్1బీ వీసా సమస్యలు పరిష్కరిస్తాం
వాషింగ్టన్: అమెరికాలో భారతీయ టెక్కీలు అత్యధికంగా వినియోగించే హెచ్–1బీ తదితర వీసాలపై గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో తీసుకువచ్చిన త్రీ పాలసీ మెమొస్ విధానం కారణంగా ఏర్పడిన ప్రతికూలతను పరిష్కరిస్తామని జో బైడెన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ విధానాన్ని రద్దు చేసినప్పటికీ దాని వల్ల ఏర్పడిన వ్యతిరేక ప్రభావాల్ని సవరించే అంశాలను పునఃపరిశీలిస్తామని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ శుక్రవారం ప్రకటించింది. జో బైడెన్ ప్రభుత్వ నిర్ణయంతో భారత్ సహా విదేశీ టెక్కీలకు భారీగా ఊరట లభించనుంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో విధిం చిన ఆంక్షలతో భారతీయ వృత్తి నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీసా చెల్లుబాటు కాలం, యాజమాన్యానికి, ఉద్యోగులకి మధ్య ఉన్న సంబంధాలు, విదేశీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. విదేశీయులకు కనీస వేతనం అమలు వాయిదా హెచ్1–బీ వీసా వినియోగదారులకు కూడా అమెరికన్లతో సమానంగా అధిక వేతనాన్ని చెల్లించాలంటూ ట్రంప్ హయాంలో తీసుకున్న నిర్ణయం అమలును బైడెన్ సర్కార్ మే 14వరకు వాయిదా వేసింది. తక్కువ వేతనానికి భారతీయులు సహా ఇతర విదేశీయుల్ని పనిలోకి తీసుకోవడం వల్ల అమెరికన్లకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారతీయులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఏర్పడింది. అయితే బైడెన్ నిర్ణయం అమలును వాయిదా వేయడంతో భారతీయ టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు. -
తొందర్లోనే వెళ్లగొడతాం
వాషింగ్టన్: అమెరికాలో ఉన్న లక్షలాది మంది అక్రమ వలసదారులను త్వరలోనే వెళ్లగొడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వచ్చే వారమే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. వలసదారుల్ని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై సంతకం చేసేందుకు గ్వాటెమాలా అంగీకరించిందన్నారు. ‘అక్రమమార్గాల్లో వచ్చిన వారిని వెళ్లగొట్టేందుకు ఉద్దేశించిన ప్రక్రియను వచ్చే వారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ(ఐసీఈ) ప్రారంభించనుంది. ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంతో వాళ్లు వెళ్లిపోతారు’ అని ట్వీట్‌చేశారు. ‘తమ దేశం మీదుగా అమెరికాలో ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు ఉద్దేశించిన ఒప్పందంపై త్వరలోనే గ్వాటెమాలా సంతకం చేయనుంది. ఆ వలసదారులు ఆశ్రయం కోసం ఇకపై అమెరికాకు బదులు గ్వాటెమాలాలోనే దరఖాస్తు చేసుకుంటారు’ అని ట్రంప్ పేర్కొన్నారు. మధ్య అమెరికాలో దేశాల్లో అశాంతి కారణంగా అక్కడి ప్రజలు గ్వాటెమాలాకు, మెక్సికోకు అక్కడి నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల సాయం నిలిపి వేస్తామంటూ మెక్సికోను భయపెట్టి మరీ అమెరికా ఒప్పందానికి దిగేలా చేసింది. దాని ప్రకారం వలసదారులను నిలువరించేందుకు అమెరికాతో సరిహద్దుల్లో మెక్సికో అదనంగా 6వేల మంది గార్డులను నియమించింది. దీంతోపాటు తమ దేశం గుండా ప్రవేశించిన వారిని వెనక్కి తీసుకునేందుకు కూడా అంగీకరించింది. అమెరికా, గ్వాటెమాలా త్వరలో ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకోనున్నాయి. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 10లక్షల మందిని వెనక్కి పంపించేయాలన్న కోర్టుల ఉత్తర్వుల్ని అమలు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. హెచ్–4 వీసా రద్దు మరింత ఆలస్యం అమెరికాలో ఉండే భారత ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్–4 వీసా విధానం మరి కొంతకాలం కొనసాగనుంది. రద్దు ప్రక్రియకు సంబంధించిన చట్ట రూప కల్పన ఇంకా పూర్తి కాలేదని అధికారులు అంటున్నారు. హెచ్–4 సహా ఉద్యోగ ఆధారిత వీసా విధానాలన్నిటిపై సమీక్ష కొనసాగుతోందని యూఎస్ సిటిజన్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. పశ్చిమాసియాకు అమెరికా సైనికులు ఇరాన్‌తో అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో మరో వెయ్యి మంది సైనిక సిబ్బందిని పశ్చిమాసియా ప్రాంతానికి పంపేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. గగన, సముద్ర, భూతలంలో ఉన్న ప్రమాదాలను ఎదుర్కొనేందుకు పశ్చిమాసియాకు కొత్తగా వెయ్యి మందిని పంపుతున్నట్లు అమెరికా తాత్కాలిక రక్షణ మంత్రి ప్యాట్రిక్ షనాహన్ చెప్పారు. అణు ఒప్పందంలో నిర్దేశించిన దానికన్నా అధికంగా యూరేనియంను తాము వచ్చే పది రోజుల్లోనే నిల్వచేయనున్నామంటూ ఇరాన్ ప్రకటించిన కొద్దిసేపటికే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అణు ఒప్పందం నుంచి అమెరికా ఇప్పటికే బయటకు రావడం తెలిసిందే. -
30 ఏళ్ల పౌరసత్వాలపై అమెరికా తనిఖీ
వాషింగ్టన్ డీసీ, అమెరికా : హెచ్–1తో పాటు అన్ని రకాల వీసాల జారీ నిబంధనలను కఠినతరం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు తన దృష్టిని పౌరసత్వం పొంది స్థిరపడిన విదేశీయులపై పడింది. గత 30 ఏళ్లుగా దేశ పౌరసత్వం పొందిన వారి వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సంకల్పించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాటు అక్రమ మార్గాల్లో పౌరసత్వం పౌందారని అనుమానిస్తున్న అమెరికా లక్షలాది దరఖాస్తులను మరోసారి పరిశీలించడానికి పావులు కదుపుతోంది. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) లాస్ ఏంజిల్స్‌లో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. తప్పుడు సమాచారంతో దేశ పౌరసత్వాన్ని పొందిన వారే లక్ష్యంగా యూఎస్సీఐఎస్ తరఫున కొత్త టాస్క్ ఫోర్స్ పని చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది. టాస్క్ ఫోర్స్ ఏర్పాటుపై యూఎఎస్ సీఐఎస్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ, తాజా ప్రక్రియను పూర్తి చేయడానికి డజన్ల సంఖ్యలో లాయర్లను, ఇమిగ్రేషన్ అధికారులను నియమించనున్నట్టు చెప్పారు. ఈ టాస్క్ ఫోర్స్ అతి త్వరలో రంగంలోకి దిగి పౌరసత్వం కోసం వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు. గడిచిన మూడు దశాబ్దాల కాలంలో దాదాపు రెండు కోట్ల మందికి పౌరసత్వం జారీ చేసినట్టు చెబుతున్నారు. అందులో 1990 నుంచి ఇప్పటివరకూ అంటే దాదాపు కోటి డెబ్బై లక్షల మంది పౌరసత్వాలను, వారి రికార్డులను ఈ టాస్క్‌ఫోర్స్ తనిఖీ చేయాలని నిర్దేశించారు. పౌరసత్వం కోసం సదరు వ్యక్తులు ఇచ్చిన పత్రాలు, ఇంటర్వ్యూల్లో ఏవైనా తప్పుడు సమాచారం ఇచ్చారా? వంటి పలు కోణాల్లో దర్యాప్తు సాగనుంది. అనుమానాస్పద కేసులను న్యాయశాఖ పరిశీలనకు పంపాలని ఇమిగ్రేషన్ విభాగం భావిస్తోంది. సిస్నా అంచనా మేరకు వేల సంఖ్యలో అనుమానిత కేసులు న్యాయశాఖ వద్దకు చేరొచ్చు. 1990 నాటి నుంచి పౌరసత్వం పొందిన వారి రికార్డులను పరిశీలన చేయడం ఆశామాషీ వ్యవహారం కాదు. అయితే, అప్పట్లో తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా వరకూ పేపర్, ఫింగర్ ప్రింట్ వర్క్‌లతో పౌరసత్వాలను ప్రధానం చేశారు. వీటన్నింటిని డిజిటలైజ్ చేస్తే తప్ప అన్ని దరఖాస్తులను పరిశీలించేందుకు అవకాశం కలుగదు. పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా 2008లో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్‌కు చెందిన ఓ అధికారి అక్రమంగా పౌరసత్వం పొందిన 206 మందిని గుర్తించారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ తరచుగా ఫింగర్ ప్రింట్లను అప్డేట్ చేయకపోవడం వల్లే అనర్హులైనప్పటికీ వారికి పౌరసత్వం వచ్చినట్లు ఆతర్వాత విచారణలో తేలింది. అనర్హులైన వారికి దేశ పౌరసత్వం దక్కిందని హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఇన్స్పెక్టర్ జనరల్ 2016 సెప్టెంబర్‌లో విడుదల చేసిన ఒక రిపోర్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. దాదాపు 858 మంది అనర్హులకు పౌరసత్వాన్ని లభించిందని ఆ రిపోర్టు సారాంశం. డిజిటల్ ఫింగర్ ప్రింట్ల లోపం వల్లే ఇలా జరిగిందని అందులో పేర్కొన్నారు. వేల సంఖ్యలో ఇలా ఫింగర్ ప్రింట్స్ ఆచూకీలేకుండా పోయాయని తెలిపారు. సదరు రిపోర్టును పరిశీలించిన డీహెచ్ఎస్ 95 అనుమానిత కేసులను న్యాయశాఖ పరిశీలనకు పంపింది. 2017 జనవరిలో డీహెచ్ఎస్ రిపోర్టుపై యూఎస్ ఇమిగ్రేషన్ జాయింట్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఫలితంగా వందల సంఖ్యలో కేసులు న్యాయశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విచారణలో భాగంగా జనవరిలో ఓ వ్యక్తికి అమెరికా పౌరసత్వాన్ని ఉపసంహరించింది. దరఖాస్తుదారుడి జేబు ఖాళీ.. అక్రమ పౌరసత్వాలను అడ్డుకునేందుకు ఇమిగ్రేషన్ విభాగం ప్రారంభిస్తున్న ఈ కొత్త కార్యాచరణకు అయ్యే ఖర్చు మొత్తం పౌరసత్వ దరఖాస్తు దారులపైనే పడనుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కోరకుండా దరఖాస్తు పత్రం ధరను పెంచి ఈ సొమ్ము రాబట్టాలని యూఎఎస్ సీఐఎస్ భావిస్తోంది. అంతేకాకుండా పౌరసత్వం పొందగోరే వారు ఇంటర్వ్యూలు పూర్తి కావాలంటే దరఖాస్తు చేసిన నాటి నుంచి కనీసం ఏడాది కాలం పడుతోంది. అధిక శ్రమతో కూడుకున్న పని.. ఓ వ్యక్తి పౌరసత్వానికి అర్హుడా? అనర్హుడా? అన్న విషయాన్ని తేల్చేందుకు యూఎస్ సీఐఎస్‌తో పాటు న్యాయశాఖకు భారీ స్థాయిలో వనరులు ఖర్చవుతున్నాయి. అంతచేసినా అధిక కేసుల్లో పౌరసత్వానికి సదరు వ్యక్తి అర్హుడని తేలుతోంది. దీంతో ఇమిగ్రేషన్ విభాగం అనవసర పని భారం పెంచుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అమెరికా వీసా ఆంక్షలపై మరిన్ని వార్తలకు కింద క్లిక్ చూడండి చదువుకు సై.. కొలువుకు నై హెచ్1బీ వీసా వాళ్లిష్టం గడువు ముగిస్తే బహిష్కరణ! హెచ్-1బీ : దడ పుట్టిస్తున్న కొత్త రూల్ -
డ్రీమర్లకు ట్రంప్ ఊరట
వాషింగ్టన్: దాదాపు 7 లక్షల మంది స్వాప్నికుల్ని(డ్రీమర్లు) అమెరికా నుంచి పంపించేందుకు కంకణం కట్టుకున్న అధ్యక్షుడు ట్రంప్ మెత్తపడ్డారు. 10, 12 ఏళ్లలో డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు. చిన్న వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్లిన వీరిని అక్రమ వలసదారులుగా పేర్కొంటూ డ్రీమర్లుగా పిలుస్తున్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో వేలాది మంది భారతీయులకూ లబ్ధి చేకూరనుంది. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలో నివసిస్తున్న వీరి కోసం 2001లో పరస్పర అంగీకారంతో రిపబ్లికన్లు, డెమొక్రాట్లు ‘డ్రీమ్’ బిల్లును రూపొందించారు. కొన్ని నిబంధనలకు కట్టుబడి డ్రీమర్లకు పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం. ఆ బిల్లు ఇంతవరకూ అమెరికన్ కాంగ్రెస్ ఆమోదం పొందలేదు. ఆందోళన అవసరం లేదు: ట్రంప్ ‘డ్రీమర్ల అంశంలో మార్పులకు సిద్ధంగా ఉన్నాం. 10, 12 ఏళ్లలో ఇది జరగవచ్చు’ అని ట్రంప్ చెప్పారు. వలసదారుల శ్రమకు ఇది ప్రోత్సాహకంగా ఆయన అభివర్ణించారు. ‘ఎలాంటి ఆందోళన అవసరం లేదని వారికి చెప్పండి’ అని డ్రీమర్లను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ అంశంపై వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ఇంతవరకూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా మెక్సికో సరిహద్దు వెంట గోడ నిర్మించాలనే పట్టుదలతో ఉన్న ట్రంప్.. దాని నిర్మాణానికి డెమొక్రాట్లు మద్దతివ్వకపోతే డ్రీమర్ల అంశంలో తాము మద్దతివ్వమని హెచ్చరించారు. ఆ గోడ పూర్తయితే అమెరికా పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. సోమవారంలోగా వలసదారుల విధివిధానాలు ఖరారు డ్రీమర్స్ భవితవ్యంపై ద్రవ్య వినిమయ బిల్లులో ఎలాంటి హామీ ఇవ్వకపోడంతో.. అమెరికా మూడు రోజుల పాటు స్తంభించిన సంగతి తెలిసిందే. ఆ అంశంపై చట్టం తెచ్చేందుకు డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య ఒప్పందం కుదరడంతో షట్డౌన్కు తెరపడింది. అయితే ఫిబ్రవరి 8 వరకే నిధుల ఖర్చుకు కాంగ్రెస్ అనుమతించిన నేపథ్యంలో.. ఆ లోగా ట్రంప్ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే మళ్లీ షట్డౌన్కు సిద్ధమని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రకటన ప్రాధాన్యం సంతకరించుకుంది. స్వాప్నికులంటే.. బాల్యంలో తల్లిదండ్రులతోపాటు అమెరికాలో చట్టవ్యతిరేకంగా ప్రవేశించిన వారినే స్వాప్నికులంటారు. వారిని దేశం నుంచి బలవంతంగా బయటకు పంపకుండా ప్రతి రెండేళ్లకు పనిచేయడానికి వర్క్ పర్మిట్‌తోపాటు నివసించేందుకు ‘డాకా’(డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) సౌకర్యాన్ని కల్పించారు. స్వాప్నికుల్లో అత్యధికశాతం దక్షిణ, మధ్య అమెరికా దేశాల నుంచి వచ్చినవారే.. డాకా కింద 5,500 మంది భారతీయులు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమం కింద లబ్ధిపొందే భారతీయ సంతతి ప్రజలు 17 వేల మంది ఉన్నారని అంచనా. -
మొత్తం 34 లక్షలు.. భారత్ నుంచి 21 లక్షలు
వాషింగ్టన్: గత పదకొండేళ్లలో హెచ్ 1 బీ వీసాకు 21 లక్షలమందికి పైగానే భారతీ యులు దరఖాస్తు చేసుకున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ సిటిజ న్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించిన ఈ నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2007 నుంచి ఈ ఏడాది జూన్ వరకు వివిధ దేశాల నుంచి 34 లక్షలమంది హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు అందగా అందులో 21 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. ఇదే సమయంలో అమెరికా 26 లక్షల హెచ్1 బీ వీసాలను మంజూరు చేసింది. అయితే ఏ దేశానికి ఎన్ని వీసాలు మంజూరు చేసిం దన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. 2007–17 మధ్య 21లక్షల హెచ్1 బీ వీసా దరఖాస్తులతో భారత్ తొలిస్థానంలో నిలవగా, చైనా (2,96,313 దరఖాస్తులు) రెండో స్థానం, ఫిలిప్పీన్స్ (85,918) మూడో స్థానంలోనూ, దక్షిణ కొరియా (77,359) నాల్గో స్థానంలోనూ, కెనడా (68, 228) ఐదో స్థానంలోనూ ఉన్నాయి. -
అబద్ధం చెప్పాడు.. అమెరికా పౌరసత్వం గోవింద!
న్యూయార్క్: తొమ్మిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నేరాన్ని తమకు చెప్పకుండా దాచడమే కాకుండా తప్పుడు మార్గంలో అమెరికా శాశ్వత పౌరసత్వం కోసం ప్రయత్నించిన ఓ భారతీయ అమెరికన్ పౌరుడు అమెరికా పౌరసత్వాన్ని కోల్పోనున్నాడు. ప్రస్తుతం కేసు విచారణ తుది దశలో ఉన్నప్పటికీ అతడు అధికారులకు సహకరించని కారణంతో అతడిని పౌరసత్వాన్ని రద్దు చేసి బహిష్కరించనున్నారు. వివరాల్లోకి వెళితే.. గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తి వాటర్‌టౌన్‌లో నివాసం ఉంటున్నాడు. అతడు ఈ మధ్యే ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించి అతడిని పోలీసులు అరెస్టు చేయడమే కాకుండా సిరాకస్‌లోని ఫెడరల్ కోర్టు మూడు నెలల శిక్ష కూడా విధించింది. అదే సమయంలో అతడు తన పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పౌరసత్వాన్ని ధ్రువీకరించే క్రమంలో భాగంగా యునైటెడ్ స్టేట్స్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ (యూఎస్సీఐఎస్) అధికారుల ముందు హాజరైన అతడు తాను చేసిన నేరాన్ని వారికి చెప్పలేదు. ఆయనకు పలుమార్లు అవకాశం ఇచ్చినా తనపై ఏ కేసు లేదని, ఏ తప్పు చేయలేదని, అరెస్టు కాలేదని అబద్ధం చెప్పాడు. కానీ, అతడు నేరం చేసినట్లు, అరెస్టయినట్లు ఆధారాలు తెప్పించుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు అతడి తప్పును గుర్తించి పౌరసత్వాన్ని త్వరలో రద్దు చేయనున్నారు. అమెరికా పౌరసత్వం ఖరారు చేసే సమయంలో ఆ వ్యక్తి ఎలాంటి నేరానికి పాల్పడినా అది ఆమోదం పొందదు. -
గాళ్‌ఫ్రెండ్ చేసిన మోసానికి.. ఊహించని షాకిచ్చాడు
లండన్: సాధారణంగా ఎవరైనా తన గాళ్‌ఫ్రెండ్ కానీ బాయ్‌ఫ్రెండ్ కానీ మరొకరితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపిస్తే వెంటనే గొడవ పెట్టుకుని పోట్లాడుతారు. అమెరికాకు చెందిన డస్టన్ హోలోవే (23) మాత్రం విభిన్న పద్ధతిలో గాళ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు. డస్టన్ తన ఇంట్లో గాళ్‌ఫ్రెండ్ మరో వ్యక్తితో కలసి నిద్రపోతున్న దృశ్యాన్ని చూశాడు. అతను ఆమెతో గొడవ పెట్టుకోకుండా తాను చేసిన మోసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలని భావించాడు. డస్టన్ తన జేబులోంచి మెల్లగా మొబైల్ ఫోన్ బయటకు తీసి, గాళ్‌ఫ్రెండ్, ఆమె ప్రియుడితో కలసి సెల్ఫీలు తీసుకున్నాడు. వీటిని ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. 'ఇంటికి వచ్చినపుడు బెడ్‌పై ప్రేయసి మరో వ్యక్తితో ఉంది!' అంటూ ఫొటోలకు కింద క్యాప్షన్ రాశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గాళ్‌ఫ్రెండ్ చేసిన మోసానికి డస్టన్ తగిన బుద్ధి చెప్పాడని నెటిజెన్లు ప్రశంసించారు. తనకు మద్దతు ఇచ్చిన అతను డస్టన్ కృతజ్ఞతలు చెప్పాడు. -
స్కాం చేసి గర్ల్‌ఫ్రెండ్‌కు ఆడికారు: షాగీ అరెస్టు!!
అమెరికాలోని పన్ను ఎగవేతదారుల నుంచి రూ. 500 కోట్లు (300 మిలియన్ డాలర్లు) కొల్లగొట్టిన మహారాష్ట్ర థానె యువకుడు సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయాడు. గత ఏడాది ఈ స్కాం వెలుగుచూసిన నాటినుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన షాగీని శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. దుబాయ్‌లో తలదాచుకున్న అతన్ని జాడ గుర్తించి..డిపోర్టేషన్ ముంబై ఎయిర్‌పోర్టుకు తరలించగా.. అక్కడికి వచ్చిన వెంటనే థానె కమిషనరేట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని థానె తరలించి విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు. 2013లో థానెకు చెందిన కనీసం డజను కాల్ సెంటర్లు.. అమెరికాలోని 15వేలమంది పన్ను చెల్లింపుదారులను లక్ష్యంగా చేసుకొని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కాల్ సెంటర్ కుంభకోణానికి తెరలేపాయి. ఈ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. ఈ కుంభకోణం ద్వారా ఆర్జించిన డబ్బులో రూ. రెండుకోట్లు పెట్టి షాగీ తన గర్ల్‌ఫ్రెండుకు ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చాడు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
కాల్ సెంటర్ స్కామ్: మాస్టర్ మైండ్ జాడ తెలిసింది!
దుబాయి: మహారాష్ట్రలోని థానెలో ఉండి అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి దాదాపు రూ.500 కోట్లు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ వివరాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అతడు ప్రస్తుతం దుబాయిలో ఉన్నట్లు థానె అధికారులు వెల్లడించారు. కాల్ సెంటర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. గతేడాది తన గర్ల్‌ఫ్రెండుకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన విషయాన్ని గతంలోనే తెలిపారు. దుబాయి పోలీసులు ఠక్కర్‌ను గుర్తించి అడ్డుకున్నారని థానే పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడినా.. పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు. గత నెలలో సాగర్ ఠక్కర్ యూఏఈకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా దుబాయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పుణే పోలీసులకు స్థానిక సిబ్బంది సమాచారం అందించారు. అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్సీఎన్) వ్యవహారం తేలిన తర్వాతే విదేశాలకు అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దుబాయి అధికారులు వారి ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తమ కస్డడీకి ఠక్కర్‌ను అప్పగించాలని కోరనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాల్ సెంటర్ స్కామ్‌కు సంబంధించి గత అక్టోబర్‌లో 9 బోగస్ కాల్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు దాదాపు 70 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. -
చత్తీస్‌గఢ్‌లో అమెరికా వాసి అదృశ్యం
హైదరాబాద్: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో అమెరికా పౌరుడు కనిపించకుండాపోయాడు. ఇమిగ్రేషన్ రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్, కెనడా(ఐఆర్సీసీ)కు చెందిన అమెరికా పౌరుడు జాన్ ఈ నెల 14వ తేదీన ముంబై నుంచి బైక్‌పై చత్తీస్‌గఢ్‌కు ప్రయాణం ప్రారంభించాడు. సాయంత్రానికి సుక్మా జిల్లా సింగమడుగు గ్రామ సమీపంలో వద్ద కనిపించకుండాపోయాడు. మావోయిస్టులు పట్టుకలిగిన జిల్లా కావడంతో జాన్‌ను మావోయిస్టులే కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. జాన్‌కు సంబంధించిన వివరాలను ముంబైలోని ఆయన ట్రావెల్ ఏజెంట్ వద్ద నుంచి సేకరిస్తున్నారు. అయితే, జాన్ అపహరణపై పోలీసులు ఎలాంటి ధ్రువీకరణ చేయలేదు. -
ట్రంప్‌కు టిట్ ఫర్ టాట్: ఇరాన్ సంచలన నిర్ణయం
టెహ్రాన్: ఇస్లామిక్ దేశం ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై ప్రతిబంధకాలు విధించింది. ఏడు ఇస్లామిక్ దేశాల పౌరులను అమెరికాలోకి అడుగుపెట్టనీయకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయానికి ప్రతిచర్యగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ట్రంప్ చర్యలు ఇరానీయులను అవమానించేలా ఉన్నాయని, ఇకపై ఇరాన్‌కు రావాలనుకునే అమెరికా పౌరులు కఠిన నిబంధనలు ఎదుర్కోక తప్పదని ప్రకటనలో పేర్కొంది. అమెరికాలోకి సిరియా శరణార్థుల వలసపై నిరవధిక నిషేధంతోపాటు ఇస్లామిక్ దేశాలైన ఇరాక్, సిరియా, ఇరాన్ , సూడాన్ , లిబియా, సోమాలియా, యెమెన్ పౌరులకు 90 రోజుల వరకు వీసాల జారీ నిలిపేస్తూ ట్రంప్ శుక్రవారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. ముస్లిం దేశాలపై ట్రంప్ నిర్ణయం.. తీవ్రవాదం, హింసను మరింత ప్రేరేపించేలా ఉన్నదని ఇరాక్ విదేశాంగశాఖ మంత్రి జాదవ్ జరీఫ్ అన్నారు. ‘ఉగ్రవాదంపై ఉక్కుపాదం, అమెరికన్ల భద్రత అనే రెండు అంశాల ప్రాతిపదికన ఇస్లామిక్ దేశాలకు చెందిన పౌరులపై ట్రంప్ నిషేధం విధించారు. నిజం చెప్పాలంటే ఇది చరిత్రను వెనక్కి మళ్లించే చర్య. ఆయన నిర్ణయంతో ఉగ్రవాదం తగ్గకపోగా, గతంలో మాదిరి మరింత బలపడుతుంది’ అని జరీఫ్ వ్యాఖ్యానించారు. మున్ముందు ఇరు దేశాల సంబంధాలు ఎలా ఉంటాయనేది చెప్పలేమని మంత్రి అన్నారు. అమెరికా సహా ఆరు అగ్రరాజ్యాలు ఇరాన్‌తో చేసుకున్న అణుఒప్పందంపైనా ట్రంప్ గతంలో విమర్శలు చేసిన సంగతి విదితమే. ఇరాకీల ఆగ్రహం: ట్రంప్‌పై తొలి కోర్టు దావా అమెరికా అధ్యక్షడిగా ప్రమాణం చేసి పట్టుమని పదిరోజులైనా కాకముందే డొనాల్డ్ ట్రంప్‌పై కోర్టులో తొలి దావా దాఖలైంది. వీసా కలిగిఉన్నప్పటికీ తమను నిర్బంధించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు ఇరాకీ పౌరులు శనివారం కోర్టును ఆశ్రయించారు. ట్రంప్‌తోపాటు అమెరికా ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా పేర్కొంటూ దావా వేశారు. నిబంధనల ప్రకారం వీసా పొంది, అమెరికా వచ్చిన తమ క్లైట్స్ను న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో అధికారులు నిర్బంధించారని, ఇది చట్టవిరుద్ధమని ఇరాకీల తరఫు న్యాయవాదులు చెప్పారు. (శరణార్థులకు ట్రంప్ షాక్) -
‘ట్రంప్ వద్దనుకుంటే పొరుగు దేశం పోండి’
న్యూయార్క్: కొందరు అమెరికన్లు, వలస దారులపై ఓ ఫెడరల్ మేజిస్ట్రేట్ జడ్జి జాన్ ప్రిమామో సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఎవరికి నచ్చకుంటే వారు దేశం విడిచి పొరుగు దేశానికి వెళ్లిపోవచ్చంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా ఆందోళనలు నిర్వహించడంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. ‘మీరు ట్రంప్ కు ఓటు వేశారా? లేదా ? అనే విషయం గురించి మాట్లాడను. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం చేయాలని అనుకుంటున్నాను. మీరు నిజంగా అమెరికా పౌరులే అయితే, ట్రంప్ ఇప్పుడు మీ అధ్యక్షుడు.. ఆయనే ఉంటాడు. ఒక వేళ మీకు అది ఇష్టం లేకుంటే పొరుగు దేశం వెళ్లిపోండి’ అని ఆయన అన్నారు. ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో శాన్ ఆంటోనియోలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్సాన్ కల్చర్స్ లో ‘కొత్త అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్’ అనే అంశంపై ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించేందుకు జాన్ ప్రిమామో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా అమెరికా జాతీయ గీతం ఆలపించే సమయంలో కొలిన్ కాపెర్నిక్ అనే వ్యక్తి ఏమాత్రం గౌరవం లేకుండా మొకాళ్లపై నిరసన వ్యక్తం చేయడాన్ని తప్పు బట్టారు. ఈ దేశంలో ఎలాంటి వ్యతిరేక చర్యలు జరుగుతున్నా వాటి కోసం ఆందోళన చేసే హక్కు ఉందని, కానీ, జాతీయ చిహ్నాలు, గీతాలువంటి వాటిని అవమానించే పనులు చేయకూడదని హితవు పలికారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతానికి ట్రంప్ అమెరికా అధ్యక్షుడని ఆయన స్పష్టం చేశారు. -
కాల్‌సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
-
కాల్‌సెంటర్ స్కామ్ 2 వేల కోట్లపైనే
► అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ వెల్లడి ► ఎఫ్‌బీఐ అదుపులో హైదరాబాదీ భోగవల్లి నరసింహ ► టెక్సాస్ రాష్ట్రం ఇర్వింగ్‌ను చిరునామాగా పేర్కొన్న భోగవల్లి ► ఐఆర్ఎస్ ఏజెంట్ల పేరిట బెదిరింపులు, ఆపై వసూళ్లు ► అతని ఖాతాల్లో కోట్లు జమచేసిన అమెరికన్లు ► నగదును భారత్‌కు బదిలీ చేశాడంటూ ఎఫ్‌బీఐ అభియోగాలు వాషింగ్టన్, డల్లాస్: భారత్ కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ కుంభకోణం విలువ రూ. 2 వేల కోట్లకు పైనేనని అమెరికా అధికారులు నిర్ధారించారు. ఐదు కాల్ సెంటర్లు వేలాది మంది అమెరికా పౌరులను మోసం చేసి ఈ మొత్తాన్ని అక్రమంగా వసూలు చేశాయని, దొంగిలించాయని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ జే జాన్సన్ తెలిపారు. ఈ కేసులో ఇంతవరకూ అమెరికాలో 20 మంది అరెస్టు కాగా, అందులో భారతీయులే అధికంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. హెచ్ గ్లోబల్, కాల్‌మంత్ర, వరల్డ్‌వైడ్ సొల్యూషన్స్, జోరియన్ కమ్యూనికేషన్స్, శర్మ బీపీవో సర్వీసెస్ పేరుతో కాల్‌సెంటర్ల నుంచి ఈ ఫోన్‌కాల్స్ వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేశాయి. మరోవైపు ఈ కుంభకోణంలో రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తోంది. కీలక సూత్రధారుల్లో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన భోగవల్లి నరసింహ(50)ను ఎఫ్‌బీఐ అధికారులు గురువారం అమెరికాలో అదుపులోకి తీసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా నగదు కార్యకలాపాలు నిర్వహించాడంటూ ఎఫ్‌బీఐ అతనిపై కేసు నమోదు చేసి టెక్సాస్ రాష్ట్రం నార్తర్న్ జిల్లా మెజిస్ట్రేట్ న్యాయమూర్తి ముందు హాజరుపర్చింది. ఈ మేరకు నార్తర్న్ జిల్లా అటార్నీ శుక్రవారం ప్రకటన విడుదలచేశారు. ఎఫ్‌బీఐ వెల్లడించిన వివరాల మేరకు... అమెరికాకు చెందిన ఆదాయపు పన్ను వసూలు విభాగం ఐఆర్ఎస్(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) ఏజెంట్లుగా పేర్కొంటూ కొందరు వ్యక్తులు అమెరికాలో పలువురికి ఫోన్లు చేసి బెదిరించారు. పన్ను చెల్లింపుల్లో లొసుగులున్నాయని, అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయంటూ భయపెట్టేవారు. జరిమానా చెల్లించకపోతే జైలుకు పంపుతామంటూ ఐఆర్ఎస్ పేరిట హెచ్చరించారు. మనియార్డర్లు, నగదును తాము పేర్కొన్న బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలంటూ వందలాది మందిని మోసగించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో కొన్నింటిని భోగవల్లి నియంత్రించేవాడని ఎఫ్‌బీఐ వెల్లడించింది. వెంటనే ఐఆర్ఎస్కు డబ్బు చెల్లించకపోతే... గంటల వ్యవధిలో అరెస్టు చేస్తామని హెచ్చరించి కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ డబ్బును భోగవల్లి హవాలా మార్గంలో భారత్‌కు పంపేవాడు. మోసంలో మూడు ఖాతాల వినియోగం బ్యాంక్ ఆఫ్ అమెరికాకు చెందిన రెండు ఖాతాల్ని ఈ మోసంలో భోగవల్లి వినియోగించాడు. అందులో ఒకటి టెక్‌డైనమిక్స్ ఇండస్ట్రీస్ పేరిట, రెండోది టచ్‌స్టోన్ కమోడిటీస్ ఇండస్ట్రీస్ పేరిట ఉంది. భోగవల్లి వాడిన ఇతర ఖాతాల్లో టచ్‌స్టోన్ కమోడిటీస్ పేరిట ఉన్న సిటీ బ్యాంకు అకౌంట్ కూడా ఉంది. నవంబర్ 5, 2014– ఫిబ్రవరి 2, 2015 మధ్య దాదాపు 242 సార్లు భోగవల్లికి చెందిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాకు నగదు జమైనట్లు గుర్తించారు. వాటి మొత్తం విలువ రూ. 11.29 కోట్లు. ఈ మొత్తంలో 2,250 ప్రత్యేక మనియార్డర్లు కూడా ఉన్నాయి. అలాగే జనవరి 16, 2015–జనవరి 30, 2015 మధ్య దాదాపు 60 మనియార్డర్లు (రూ. 25.81 లక్షలు) మరో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఖాతాలో జమయ్యాయి. నవంబర్ 4, 2014– ఫిబ్రవరి 5, 2015 మధ్యలో దాదాపు 128 మనియార్డర్లు (రూ.65.76 లక్షలు) సిటీ బ్యాంక్ ఖాతాకు చేరాయి. ఈ ఖాతాల్లో నగదును భోగవల్లి... తన నియంత్రణలోని ఇతర ఖాతాలకు బదిలీ చేసేవాడు. వాటిని ఖర్చుపెట్టడం లేదా భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఖాతాలకు బదిలీ చేసేవాడు. రెండు కంపెనీలకు అధినేతగా భోగవల్లి రికార్డుల ప్రకారం భోగవల్లి టెక్సాస్ రాష్ట్రంలోని ఇర్వింగ్ పట్టణం చిరునామాతో టచ్‌స్టోన్ కమోడిటీస్‌కు డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. టచ్‌స్టోన్ కమోడిటీస్ ద్వారా ఎగుమతులు, దిగుమతులు వ్యాపారం చేస్తున్నట్లు వెబ్సైట్లో అతను పేర్కొన్నాడు. టెక్‌డైనమిక్స్ వెబ్సైట్ ప్రకారం... ఆ సంస్థకు అధ్యక్షుడు భోగవల్లే... టెక్నాలజీ, అవుట్సోర్సింగ్, కన్సల్టింగ్ సేవల్ని అందిస్తామంటూ అందులో పేర్కొన్నాడు. అందులోను ఇర్వింగ్ పట్టణం చిరునామానే ఇచ్చాడు. -
కాల్‌సెంటర్ స్కాం సూత్రధారి తెలుగువాడేనా?
పుణె కేంద్రంగా సాగిన కాల్‌సెంటర్ స్కాం మొత్తానికి సూత్రధారులు కొందరు అమెరికాలో ఉన్నారని నిన్నమొన్నటి వరకు చెప్పారు. ఇప్పుడు ఆ సూత్రధారుల్లో ఒకరైన భోగవల్లి నరసింహ (50)ని అమెరికా పోలీసులు అరెస్టుచేశారు. ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారులుగా నటిస్తూ కొంతమంది అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి.. పన్ను ఎగవేతలకు పాల్పడినందుకు మీపై వారంట్లు పెండింగులో ఉన్నాయని, వెంటనే తాము చెప్పిన ఖాతాల్లోకి డబ్బు పంపకపోతే అరెస్టు తప్పదని బెదిరించి.. ఏడాది కాలంలోనే దాదాపు రూ. 500 కోట్ల వరకు వెనకేసుకున్నారు. ఇందుకోసం పుణెలో ఏకంగా ఏడంతస్థుల భవనాన్ని తీసుకుని, అందులో రోజుకు మూడు షిఫ్టులలో 24 గంటలు నడిచే కాల్ సెంటర్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. దీనంతటికీ భారతదేశంలో పనిచేసిన వ్యక్తి షాగర్ ఠక్కర్.. అలియాస్ షాగీ కాగా, అతడికి అమెరికాలో సహకరించినవాళ్లలో ప్రధానమైన వ్యక్తులలో ఒకరిగా భోగవల్లి నరసింహను గుర్తించారు. హైదరాబాద్‌కు చెందినట్లుగా చెబుతున్న నరసింహ మొదట్లో ఐబీఎంలో పనిచేసి, తర్వాత సొంతంగా టెక్‌డైనమిక్స్ అనే సంస్థను స్థాపించారు. నరసింహను అమెరికాలో అరెస్టుచేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అమెరికా మేజిస్ట్రేట్ జడ్జి పాల్ డి స్టిక్నీ ఎదుట ప్రవేశపెట్టగా, తదుపరి విచారణ జరిగేవరకు పోలీసుల అదుపులో ఉంచాలని ఆదేశించారు. ఐఆర్ఎస్ ఏజెంట్లుగా తమను తాము చెప్పుకొన్న కొందరు.. అమెరికా పౌరులకు ఫోన్లు చేసేవారు. పన్నులు ఎగవేశారని, డబ్బు చెల్లించని పక్షంలో జైలుకు వెళ్లక తప్పదని.. మరి కొంత సేపట్లోనే సోదాలు జరగబోతున్నాయంటూ వాళ్లను భయపెట్టి.. వెంటనే ఖాతాల్లోకి డబ్బు వేయించుకునేవారు. భోగవల్లి నరసింహ తన పేరుమీద ఉన్న టెక్‌డైనమిక్స్ సంస్థ అకౌంటుతో పాటు టచ్‌స్టోన్ కమోడిటీస్ సంస్థ ఖాతాను కూడా ఉపయోగించారు. ఈ స్కాంలో మరికొన్ని ఖాతాలను కూడా ఉపయోగించారని, వాటిలో ఒకటి సిటీబ్యాంక్ అకౌంట్ అని పోలీసులు తెలిపారు. (కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!) 2014 నవంబర్ 5 నుంచి 2015 ఫిబ్రవరి 2వ తేదీ వరకు మొత్తం 242 సార్లు డబ్బులు డిపాజిట్ అయ్యాయని, వాటి మొత్తం విలువ సుమారు రూ. 11 కోట్లని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అకౌంటులో మరో రూ. 10 కోట్లు జమ చేయించుకున్నారు. ఇలా.. రకరకాల బ్యాంకు ఖాతాలతో ఇటు భారతదేశంలోను, అటు అమెరికాలోను కూడా వసూళ్లు సాగించారు. అమెరికాలో వసూలు చేసిన మొత్తాలను కూడా భారతదేశంలోని ఖాతాలకు మళ్లించేవారు. (23 ఏళ్లకే.. రూ. 500 కోట్లు కొట్టేశాడు!) నరసింహ ఏం చేసేవారు? ఇర్వింగ్‌లో ఉన్న టచ్‌స్టోన్ కమోడిటీస్‌లో భోగవల్లి నరసింహ డైరెక్టర్‌గా లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఆ సంస్థ పేరున అకౌంటు తెరిచేటప్పుడు.. తమది ఎగుమతులు - దిగుమతుల సంస్థ అని ఆయన పేర్కొన్నారు. కంపెనీ వెబ్సైట్లో మాత్రం తమ కంపెనీ ఇనుప ఖనిజం, స్టీలు, చెక్ చిప్స్ లాంటి ఖరీదైన ఉత్పత్తులను సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. సంస్థ సైట్లో మాత్రం భోగవల్లిని సంస్థ చైర్మన్‌గా పేర్కొన్నారు. టెక్‌డైనమిక్స్ ప్రెసిడెంటుగా కూడా భోగవల్లి నరసింహ లిస్ట్ అయినట్లు రికార్డులను బట్టి తెలుస్తోంది. ఈ సంస్థ టెక్నాలజీ, ఔట్సోర్సింగ్, కన్సల్టింగ్ అవసరాలు తీరుస్తుందని పేర్కొన్నారు. -
స్కాం చేసి.. గర్ల్‌ఫ్రెండుకు 2.5 కోట్ల కారు గిఫ్ట్
ఎక్కడో మహారాష్ట్రలోని థానె ప్రాంతంలో ఉండి.. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి 500 కోట్ల రూపాయలు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ (23) ఆ డబ్బుతో మంచి విలాసవంతమైన జీవితం ఆస్వాదించాడు. తన గర్ల్‌ఫ్రెండుకు రూ. 2.5 కోట్లు పెట్టి ఆడి ఆర్8 కారు పుట్టినరోజు బహుమతిగా కొనిచ్చాడు. ఈ విషయాన్ని థానె పోలీసులు తెలిపారు. షాగీ దగ్గర కూడా లెక్కలేనన్ని హై ఎండ్ కార్లు ఉన్నాయి. ఆడి ఆర్8 కారును అహ్మదాబాద్‌లో కొన్న తొలి వ్యక్తి ఇతడే. అయితే, అసలు ఇంత ఖరీదైన బహుమతి అందుకున్న అతడి గర్ల్ ఫ్రెండు ఎవరన్నది మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు. ఆమె ఆనుపానులు కనిపెట్టి, కారును కూడా స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. షాగీ స్కూలు స్నేహితులలో కొందరిని అరెస్టు చేసి విచారించినప్పుడు ఈ విషయం తెలిసింది. ఈ బహుమతి గురించి షాగీ తరచు తమతో చెప్పేవాడని అంటున్నారు. థానె నుంచి అహ్మదాబాద్ వెళ్లిన తర్వాత సాగర్ ఠక్కర్ తన సోదరి రీమా ఠక్కర్తో కలిసి ఉండేవాడు. అమెరికాలో ఈ స్కాంకు మరో సూత్రధారి ఉన్నాడని.. అతడితో స్నేహం మొదలైన తర్వాతే స్కాం మొత్తం మొదలైందని పోలీసులు చెప్పారు. అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్లకు సంబంధించిన వివరాలు తీసుకుని.. వాటిని సాగర్‌కు పంపేవాడు. వాటి ఆధారంగా ఇక్కడినుంచి అమెరికన్ పౌరులకు ఫోన్లు చేసి, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండుకునేవారు. సాగర్‌కు దుబాయ్‌లో కూడా భారీ ఎత్తున వ్యాపారం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ దండుకున్న డబ్బులతోనే ఆ వ్యాపారం పెట్టాడంటున్నారు. థానెకు ఎఫ్‌బీఐ అధికారులు అమెరికా పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ దోపిడీ వ్యవహారంపై విచారణ జరిపేందుకు ఎఫ్‌బీఐ నుంచి ఏడుగురు అధికారులు వస్తున్నారు. థానె పోలీసు కమిషనరేట్ వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని సీపీ పరమ్‌వీర్ సింగ్ చెప్పారు. అహ్మదబాద్ నుంచి ముంబైకి మనీలాండరింగ్ చేస్తున్న నలుగురు హవాలా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ఈ కేసులో సాక్షులుగా చేస్తామంటున్నారు. అమెరికాకు, అహ్మదాబాద్‌కు మధ్య ఎలాంటి లింకు ఉందో తేలుస్తామని చెబుతున్నారు. -
కాల్‌సెంటర్ కేంద్రంగా.. రూ. 500 కోట్ల దోపిడీ!
గడిచిన ఏడాది కాలంలో అమెరికన్ పౌరులు దాదాపు రూ. 500 కోట్ల మేర దోపిడీకి గురయ్యారు. అది కూడా ఎక్కడి నుంచో తెలుసా.. మన దేశంలోని ఒక కాల్ సెంటర్ నుంచి!! అవును.. థానెలోని మీరారోడ్డు కాల్‌సెంటర్ స్కాం వెల్లడిస్తున్న భయంకర వాస్తవమిది. ఇప్పటివరకు బయటపడింది కూడా చాలా చిన్నదే కావచ్చని, ఇందులో మరింత పెద్ద మొత్తం ఉండి ఉండొచ్చని పోలీసు కమిషనర్ పరమ్ వీర్ సింగ్ తెలిపారు. కేవలం అమెరికాలోనే కాక.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పౌరులు కూడా ఈ దోపిడీ బాధితులు కావచ్చని అంటున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 70 మందిని అరెస్టు చేశారు. అక్రమ కాల్సెంటర్లకు చెందిన మరో 630 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. స్కాం ఎలా జరిగిందంటే... కాల్ సెంటర్ల ఉద్యోగులు తమను తాము అమెరికా ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అధికారులుగా చెప్పుకొంటూ.. పన్నులు ఎగ్గొట్టినందుకు అరెస్టుచేస్తామని బెదిరించి, అలా చేయకుండా ఉండాలంటే 500 నుంచి 3000 డాలర్ల వరకు చెల్లించాలని బెదిరించేవారు. దాంతో దిక్కుతోచని ఆ పౌరులు వీళ్లు చెప్పిన ఖాతాలకు ఆ మొత్తాన్ని పంపేవాళ్లు. ఈ స్కాంపై అమెరికాకు చెందిన పలు ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. ఈ గ్యాంగు సభ్యుల్లో కొంతమంది అమెరికాలో కూడా ఉన్నారు. వాళ్లే అక్కడివాళ్ల వివరాలు ఇచ్చి వీళ్లకు సాయం చేసేవారని తెలిసింది. ముందుగానే పన్ను ఎగ్గొడుతున్న విషయం తెలుసుకుని వీళ్లు ఫోన్ చేసేవారు. ఒకేసారి ఏకంగా 10 వేల డాలర్లు డిమాండ్ చేసి.. చివరకు అవతలివాళ్ల సామర్థ్యాన్ని బట్టి ఎంతో అంతకు సెటిల్ చేసేవారు. ఎలా పట్టుబడ్డారు.. మూడు అక్రమ కాల్సెంటర్లపై థానె పోలీసులు అర్ధరాత్రి దాడి చేశారు. మీరా రోడ్డులోని ఏడు అంతస్తుల డెల్టా బిల్డింగులో రోజుకు మూడు షిఫ్టుల చొప్పున 24 గంటలూ నడిచే ఈ కాల్‌సెంటర్ల గుట్టు అప్పుడే బయటపడింది. కాల్ సెంటర్ల యజమానులు ఎలాగోలా తప్పుకొన్నారు. అయితే హైదర్ అలీ అయూబ్ మన్సూరీ అనే ఒక డైరెక్టర్‌ను మాత్రం పోలీసులు అరెస్టుచేశారు. అసలైన యజమానుల కోసం గాలింపు విస్తృతంగా సాగుతోంది. హరిఓం ఐటీపార్క్, యూనివర్సల్ ఔట్సోర్సింగ్ సర్వీస్, ఆస్వాల్ హౌస్ అనే ఈ మూడు కాల్ సెంటర్లలో ఒక్కోదాంట్లో రోజుకు దాదాపు కోటి నుంచి కోటిన్నర వరకు సంపాదిస్తున్నారు. ప్రాక్సీ సెర్వర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (వీఓఐపీ) కాల్ చేయడంతో ఎక్కడినుంచి చేస్తున్నారో ఎవరికీ తెలిసేది కాదు. తన ఇంటిమీద దాడి జరగకుండా ఉండేందుకు ఒక వ్యక్తి ఏకంగా 60వేల డాలర్లు సమర్పించుకున్నాడు. వీళ్ల దగ్గర నుంచి 852 హార్డ్ డిస్కులు, హై ఎండ్ సెర్వర్లు, డీవీఆర్లు, ల్యాప్‌టాప్‌లు, కోటి రూపాయల విలువైన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడు అంతస్తులలో పైదాంట్లో శిక్షణ ఇచ్చేవారు. మిగిలిన ఒక్కో ఫ్లోర్లో దాదాపు వంద వరకు ఇంటర్నెట్ కనెక్షన్లున్నాయి. -
వాటి కోసం ఫేస్‌బుక్‌ను ప్రిఫర్ చేస్తున్నారు
న్యూయార్క్: అమెరికా సిటిజెన్లు వార్తలు, సమాచారం తెలుసుకునేందుకు సోషల్ మీడియాను ఎక్కువగా వాడుకుంటున్నారు. ఆ దేశంలో 62 శాతమంది నెటిజెన్లు ఫేస్బుక్, ట్విట్టర్, రెడిట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే అత్యధికమంది నెటిజెన్లు ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా వార్తలను చదువుతున్న వారిలో 67 శాతం మంది ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇక ఫేస్బుక్ యూజర్లలో మూడింట రెండొంతుల మంది వార్తాసమాచారం తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా నెటిజన్లలో యూ ట్యూబ్ చూసే వారి సంఖ్య కూడా ఎక్కువే. 48 శాతం మంది యూ ట్యూబ్ చూస్తున్నారు. ప్రతి సైట్ నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, రెడిట్‌లలో వార్తలు వస్తున్నాయి. ఈ మూడింటితో పాటు ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్ ద్వారా వార్తలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్తలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో వార్తలు చదివే వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. -
పెరిగిన యూఎస్ వీసా ఫీజు
వాషింగ్టన్: హెచ్ 1బీ, ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను అమెరికా భారీగా పెంచింది. ఈ పెంపు ప్రభావం ప్రధానంగా భారతీయ ఐటీ కంపెనీలపై పడనుంది. డిసెంబర్ 18, 2015 తరువాత హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవారు అదనంగా 4 వేల డాలర్లను(రూ. 2.67 లక్షలు) చెల్లించాలని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. అలాగే, ఎల్1ఏ, ఎల్2బీ దరఖాస్తుదారులు 4500 డాలర్లను(రూ. 3.01 లక్షలు) అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. అమెరికాలో 50 మందికి పైగా ఉద్యోగస్తులుండి, వారిలో కనీసం 50% మంది హెచ్1బీ, లేదా ఎల్1ఏ, ఎల్1బీ నాన్‌ఇమిగ్రంట్ స్టేటస్ వీసాదారులై ఉన్న కంపెనీలకు ఈ పెంపు వర్తిస్తుందని యూఎస్సీఐఎస్ పేర్కొంది. ఈ ఫీజు సాధారణ, ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు, ఫ్రాడ్ ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఫీజు, అమెరికన్ కాంపిటీటివ్నెస్ అండ్ వర్క్‌ఫోర్స్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ ఫీజులకు.. తాజాగా పేర్కొన్న ఫీజు అదనమని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30, 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా డిసెంబర్ 18న సంతకం చేయడంతో సంబంధిత చట్టం అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. కొత్త చట్టంలో పేర్కొన్న సమాచారం ఇవ్వని వీసా పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరి 11 నుంచి తిరస్కరిస్తామని యూఎస్సీఐఎస్ పేర్కొంది. -
27 ఏళ్ల తర్వాత రూ.2 కోట్ల పరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాద బాధితుడికి నష్టపరిహారం కేసు ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అన్ని చోట్లా బాధితుడికే తీర్పు అనుకూలంగా వచ్చినా.. పరిహారం ఇచ్చేందుకు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ నిరాకరిస్తూ వచ్చింది. చివరకు సుప్రీం కోర్టు తీర్పుకు రాజస్థాన్ కార్పొరేషన్ తలవంచక తప్పలేదు. దాదాపు 2 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. 27 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అమెరికా సిటిజన్ విజయం సాధించారు. వివరాలిలా ఉన్నాయి. అమెరికాకు చెందిన అలెగ్జిక్స్ సోనియెర్ 1988లో 'పీస్ మార్చ్'లో పాల్గొనేందుకు భారత్ వచ్చాడు. ఇతర కార్యకర్తలతో కలసి సోనియెర్ ఓ వాహనంలో వెళ్తుండగా.. జైపూర్ సమీపంలో రాజస్థాన్ కార్పొరేషన్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సోనియెర్ కోమాలోకి వెళ్లారు. రాజస్థాన్, గుజరాత్‌లలో అతనికి చికిత్స చేయించినా కోమాలోంచి బయటకు రాలేదు. చికిత్స కోసం అతణ్ని అహ్మదాబాద్ నుంచి అమెరికాకు తరలించారు. తమకు 2 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా ఇప్పించాల్సిందిగా బాధితుడి తల్లి డొమినిక్వె సోనియెర్ రాజస్థాన్ రోడ్డు యాక్సిడెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. 6శాతం వడ్డీతో 1.25 కోట్ల రూపాయలు చెల్లించాలని ట్రిబ్యునల్ రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థను ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కార్పొరేషన్ రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు పరిహార మొత్తాన్ని కోటి రూపాయలకు తగ్గించింది. అయితే కార్పొరేషన్ పరిహారం చెల్లించకుండా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు రాజస్థాన్ రోడ్డు రవాణ సంస్థ పిటిషన్‌ను కొట్టివేస్తూ బాధితుడికి 1.17 కోట్ల రూపాయల పరిహారం పాటు 6 శాతం వడ్డీ (కేసు దాఖలు చేసిన తేదీ నుంచి) చెల్లించాలని ఆదేశించింది. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఆర్కే అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పరిహారం, వడ్డీ కలిపితే దాదాపు 2 కోట్లకు పైగా అవుతుంది. -
తెలుగు సంస్కృతిపై మమకారం
* అమెరికా నుంచి వచ్చి ఇల్లెందులో వివాహం ఇల్లెందు: అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించింది. అమెరికా అబ్బాయినే మనుమాడినా తన పూర్వీకుల ఊరైన ఖమ్మం జిల్లా ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే లిన్ అనే మహిళను వివాహమాడారు. వీరి కూతురు జయలిన్ సుశీల అప్పుడప్పుడు తాత వెంకటేశ్వర్లు వద్దకు (ఇల్లెందుకు) వచ్చిపోయేది. ఈ క్రమంలో జయలిన్కు పాట్రిక్ కోయల్ బార్కో అనే అ మెరికన్తో నిశ్చితార్థం జరిగింది. అయితే.. తమ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని జయలిన్ పట్టుపట్టి వరుడి సహా ఇల్లెందుకు వచ్చి వేదమంత్రాల నడుమ వివాహం చేసుకుంది. -
లాటరీతో హెచ్1బి వీసాల జారీ
* అమెరికా వీసా కోసం 1,72,000 దరఖాస్తులు * లాటరీ ద్వారా 85,000 దరఖాస్తుల ఎంపిక * మరిన్ని వీసాలకు అమెరికా ఐటీ సంస్థల వినతి వాషింగ్టన్: అమెరికాలో పని చేసేందుకు విదేశీయులకు అనుమతినిచ్చే హెచ్1బి వీసాల కోసం ఈసారి 1,72,000 దరఖాస్తులు అందాయి. అయితే.. ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కేవలం 85,000 వీసాల (రెండు తరగతులూ కలిపి) జారీకి మాత్రమే అనుమతి ఉండటంతో.. అమెరికా పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి దరఖాస్తుదారులకు లాట్లు కేటాయించింది. భారత్ వంటి దేశాలకు చెందిన సాఫ్ట్వేర్ రంగ నిపుణులు అమెరికా హెచ్1బి వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకుంటారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఐదు రోజుల్లోనే 1,72,000 దరఖాస్తులు అందాయి. ఇందులో సాధారణ తరగతి దరఖాస్తులతో పాటు, ప్రత్యేక తరగతి దరఖాస్తులు కూడా ఉన్నాయి. సాధారణ తరగతిలో 65,000 వీసాలు, ప్రత్యేక తరగతిలో 20,000 వీసాలు జారీ చేస్తారు. ఈ నేపధ్యంలో తొలుత ప్రత్యేక తరగతి దరఖాస్తులకు లాటరీ నిర్వహించి 20,000 మందికి లాట్లు ఖరారు చేశారు. ఈ తరగతిలో ఎంపిక కాని వారి దరఖాస్తులను కూడా సాధారణ తరగతి దరఖాస్తులతో చేర్చి మొత్తం 65,000 దరఖాస్తులను లాటరీలో ఎంపికచేశారు. మిగతా దరఖాస్తులను సంబంధిత రుసుములతో సహా దరఖాస్తుదారులకు వాపసు చేస్తామని పౌరసత్వం, ప్రవాస సేవల విభాగం తెలియజేసింది. అయితే.. పోటీ ప్రపంచంలో అమెరికా అగ్రస్థానంలో కొనసాగేందుకు మరిన్ని హెచ్1బి వీసాలు జారీ చేయాలని అమెరికా ఐటీ సంస్థల సంఘం కోరుతోంది.