హిందూ సంప్రదాయం ప్రకారం ఇల్లెందులో ఒక్కటైన జయలిన్ సుశీల, పాట్రిక్ కోయిల్
* అమెరికా నుంచి వచ్చి ఇల్లెందులో వివాహం
ఇల్లెందు: అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించింది. అమెరికా అబ్బాయినే మనుమాడినా తన పూర్వీకుల ఊరైన ఖమ్మం జిల్లా ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే లిన్ అనే మహిళను వివాహమాడారు.
వీరి కూతురు జయలిన్ సుశీల అప్పుడప్పుడు తాత వెంకటేశ్వర్లు వద్దకు (ఇల్లెందుకు) వచ్చిపోయేది. ఈ క్రమంలో జయలిన్‌కు పాట్రిక్ కోయల్ బార్కో అనే అ మెరికన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే.. తమ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని జయలిన్ పట్టుపట్టి వరుడి సహా ఇల్లెందుకు వచ్చి వేదమంత్రాల నడుమ వివాహం చేసుకుంది.