వాషింగ్టన్: గత పదకొండేళ్లలో హెచ్ 1 బీ వీసాకు 21 లక్షలమందికి పైగానే భారతీ యులు దరఖాస్తు చేసుకున్నారని తాజా గణాంకాలు వెల్లడించాయి. యూఎస్ సిటిజ న్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించిన ఈ నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2007 నుంచి ఈ ఏడాది జూన్ వరకు వివిధ దేశాల నుంచి 34 లక్షలమంది హెచ్ 1 బీ వీసా దరఖాస్తులు అందగా అందులో 21 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు.
ఇదే సమయంలో అమెరికా 26 లక్షల హెచ్1 బీ వీసాలను మంజూరు చేసింది. అయితే ఏ దేశానికి ఎన్ని వీసాలు మంజూరు చేసిం దన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. 2007–17 మధ్య 21లక్షల హెచ్1 బీ వీసా దరఖాస్తులతో భారత్ తొలిస్థానంలో నిలవగా, చైనా (2,96,313 దరఖాస్తులు) రెండో స్థానం, ఫిలిప్పీన్స్ (85,918) మూడో స్థానంలోనూ, దక్షిణ కొరియా (77,359) నాల్గో స్థానంలోనూ, కెనడా (68, 228) ఐదో స్థానంలోనూ ఉన్నాయి.