గాళ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి.. ఊహించని షాకిచ్చాడు | Man saw girlfriend sleeping with someone else | Sakshi
Sakshi News home page

గాళ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి.. ఊహించని షాకిచ్చాడు

Published Thu, Apr 27 2017 3:18 PM | Last Updated on Fri, Aug 24 2018 4:46 PM

గాళ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి.. ఊహించని షాకిచ్చాడు - Sakshi

గాళ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి.. ఊహించని షాకిచ్చాడు

లండన్‌: సాధారణంగా ఎవరైనా తన గాళ్‌ఫ్రెండ్‌ కానీ బాయ్‌ఫ్రెండ్ కానీ మరొకరితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపిస్తే వెంటనే గొడవ పెట్టుకుని పోట్లాడుతారు. అమెరికాకు చెందిన డస్టన్‌ హోలోవే (23) మాత్రం విభిన్న పద్ధతిలో గాళ్‌ఫ్రెండ్‌పై ప్రతీకారం తీర్చుకున్నాడు.

డస్టన్‌ తన ఇంట్లో గాళ్‌ఫ్రెండ్‌ మరో వ్యక్తితో కలసి నిద్రపోతున్న దృశ్యాన్ని చూశాడు. అతను ఆమెతో గొడవ పెట్టుకోకుండా తాను చేసిన మోసాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్లాలని భావించాడు. డస్టన్‌ తన జేబులోంచి మెల్లగా మొబైల్‌ ఫోన్‌ బయటకు తీసి, గాళ్‌ఫ్రెండ్, ఆమె ప్రియుడితో కలసి సెల్ఫీలు తీసుకున్నాడు. వీటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. 'ఇంటికి వచ్చినపుడు బెడ్‌పై ప్రేయసి మరో వ్యక్తితో ఉంది!' అంటూ ఫొటోలకు కింద క్యాప్షన్‌ రాశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. గాళ్‌ఫ్రెండ్‌ చేసిన మోసానికి డస్టన్‌ తగిన బుద్ధి చెప్పాడని నెటిజెన్లు ప్రశంసించారు. తనకు మద్దతు ఇచ్చిన అతను డస్టన్‌ కృతజ్ఞతలు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement