Farah Khan Slapped Maniesh Paul For This Reason - Sakshi
Sakshi News home page

Farah Khan: నటుడి చెంప పగలగొట్టిన నిర్మాత! ఎందుకంటే?

Published Mon, Feb 6 2023 3:17 PM | Last Updated on Mon, Feb 6 2023 3:52 PM

Farah Khan Slapped Maniesh Paul For This Reason - Sakshi

బాలీవుడ్‌ మహిళా దర్శకనిర్మాత, కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ యాంకర్‌, నటుడు మనీశ్‌ పౌల్‌ చెంప చెళ్లుమనిపించింది. ఈ వీడియోను మనీశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అసలేం జరిగిందంటే.. అమ్మాయిలకు పెద్దగా లెక్కలు రావని మనీశ్‌ అన్నాడు. అంత సినిమా లేదు, అది నిజం కాదని బదులిచ్చింది ఫరా ఖాన్‌. దీంతో అతడు రెండులోంచి రెండు తీసేస్తే ఎంత అని ఓ ప్రశ్న అడిగాడు. అందుకామె అసలు ప్రశ్నే అర్థం కావట్లేదంది. మనీశ్‌ అదే ప్రశ్నను మరోలా అడిగాడు. నువ్వు రెండు చపాతీలు తింటున్నావనుకో.. ఆ రెండింటినీ నేను తీసుకుంటే నీ దగ్గర ఎన్ని మిగులుతాయి? అని ప్రశ్నించాడు.

అందుకామె ఇంకేం మిగులుతాయి. కేవలం కూర మాత్రమే మిగులుతుందని చెప్పింది. ఆ వెంటనే కోపంతో నా చపాతీ లాక్కోవడానికి నీకెంత ధైర్యం? అంటూ సరదాగా అతడి చెంప చెళ్లుమనిపించింది. ఫరాకు లెక్కలు ఎంత బాగా వచ్చో అంటూ మనీశ్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో వీడియో రిలీజ్‌ చేశాడు. దీనికి ఫరా స్పందిస్తూ నా తిండి దొంగిలించాలని ఎప్పుడూ అనుకోకు అంటూ కామెంట్‌ చేసింది. కాగా మనీశ్‌ పౌల్‌ చివరగా జుగ్‌ జుగ్‌ జియో సినిమాలో నటించాడు. ఇందులో కియారా అద్వానీ సోదరుడి పాత్రలో కనిపించాడు.

చదవండి: కియారాతో పెళ్లనగానే నా భార్య విడాకుల దాకా వెళ్లింది
మాటలు రావడం లేదు, ఈ అవార్డు భారత్‌కు అంకితమిస్తున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement