![New telugu movie updates - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/3/Frdship-Love.jpg.webp?itok=HQF9kPSZ)
సూర్య, మనీష్ హీరోలుగా, స్నేహ హీరోయిన్‌గా ఎల్.వి. రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్ వెర్సస్ లవ్’. లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో నయన్ షా ఫిలిమ్స్ పతాకంపై గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవుతోంది.
ఎల్.వి.రాజశేఖర్ మాట్లాడుతూ– ‘‘ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధించారు? అనే నేపథ్యంలో రూపొందిన మా చిత్రం యువతరం ప్రేక్షకులతో పాటు అందర్నీ అలరిస్తుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘ముక్కోణపు ప్రేమ కథా చిత్రమిది’’ అన్నారు గుండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: ఘంటసాల విశ్వనాథ్.
Comments
Please login to add a commentAdd a comment