
45 ఏళ్ల బాక్సింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏ భారత బాక్సర్‌కు సాధ్యం కాని ఘనతను అమిత్ పంఘాల్ సాధించాడు. ఇప్పటి వరకు కాంస్యాలకే పరిమితమైన మన బాక్సింగ్ ఘనత స్థాయిని తొలిసారి పెంచాడు. చాంపియన్‌షిప్ చరిత్రలో ఫైనల్ చేరిన తొలి భారత బాక్సర్‌గా నిలిచి కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు.
తుది పోరులోనూ ఇదే రీతిలో సత్తా చాటితే అతని పంచ్ పసిడిని తాకడం ఖాయం. మరోవైపు సెమీస్‌లో ఓటమితో మనీశ్ కౌశిక్ కంచుకే పరిమితమయ్యాడు. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్íÙప్‌లో కాంస్యం గెలిచిన ఐదో బాక్సర్‌గా మనీశ్ నిలిచాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011), శివ థాపా (2015), గౌరవ్ బిధురి (2017) ఈ ఘనత సాధించారు.
ఎకతెరిన్‌బర్గ్ (రష్యా): ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి భారత్ రెండు పతకాలు సాధించిన సంబరం శుక్రవారం రెట్టింపయింది. 52 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్ నుంచి ఈ ఘనత సాధించిన తొలి బాక్సర్ అతనే కావడం విశేషం. సెమీఫైనల్లో అమిత్ 3–2 తేడాతో సాకెన్ బిబోసినోవ్ (కజకిస్తాన్)ను ఓడించాడు. తుది పోరుకు అర్హత సాధించడంతో అమిత్‌కు కనీసం రజత పతకం ఖాయమైంది. శనివారం జరిగే ఫైనల్లో అతను ప్రస్తుత ఒలింపిక్ చాంపియన్ షఖోబిదీన్ జొయిరోవ్ (ఉజ్బెకిస్తాన్)తో తలపడతాడు. తనదైన వేగం, నైపుణ్యం కలగలిపి అమిత్ విసిరిన పంచ్‌లకు ప్రత్యర్థి వద్ద జవాబు లేకపోయింది. దీంతో పాటు అత్యుత్తమ డిఫెన్స్‌తో అతను బిబోసినోవ్‌ను నిలువరించాడు. అమిత్‌తో పోలిస్తే పొడగరి అయిన కజకిస్తాన్ బాక్సర్ తన ఎత్తును ఉపయోగించుకుంటూ శక్తిమేర అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే అమిత్ తగినంత దూరం పాటిస్తూ తెలివిగా వ్యవహరించడంతో బిబోసినివ్ విసిరిన కొన్ని పంచ్‌లు అసలు భారత బాక్సర్‌ను తాకలేదు. కొన్ని దగ్గరగా వచి్చనా వాటిలో పెద్దగా పదును లేకపోయింది.
మనీశ్‌కు నిరాశ...
63 కేజీల విభాగంలో మనీశ్ కౌశిక్ ఫైనల్ చేరడంలో విఫలమయ్యాడు. సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, టాప్ సీడ్ ఆండీ గోమెజ్ క్రజ్ (క్యూబా) 5–0తో మనీశ్‌ను చిత్తుగా ఓడించాడు. కామన్వెల్త్ క్రీడల రజత పతక విజేత అయిన మనీశ్ తన ప్రత్యర్థి ముందు ఏమాత్రం నిలవలేకపోయాడు. వరుస పంచ్‌లతో క్యూబా స్టార్ విరుచుకుపడటంతో మూడు రౌండ్లలోనూ ఏమీ చేయలేక కౌశిక్ చేతులెత్తేశాడు. తన అత్యుత్తమ ప్రదర్శన ఇచి్చనా... కొన్ని లోపాలతో బౌట్‌ను కోల్పోయానన్న భారత బాక్సర్... భవిష్యత్తులో మరింత శ్రమిస్తానని వ్యాఖ్యానించాడు.
►చాలా సంతోషంగా ఉంది. అయితే నా పని పూర్తి కాలేదు. దీని కోసం ఎంతో కష్టపడ్డాను కాబట్టి స్వర్ణం సాధించేందుకు గట్టిగా ప్రయతి్నస్తా. ఫైనల్లో ఆడబోతున్న బాక్సర్‌తో గతంలో ఎప్పుడూ తలపడలేదు. కాబట్టి అతని వీడియోలు చూసి సిద్ధం అవుతాను. కేటగిరీ మార్చుకున్న తర్వాత నేను దానికి అనుగుణంగా ఎప్పుడో మారిపోయాను. నా పంచ్‌లలో వేగం కూడా పెరిగింది.
–అమిత్
Comments
Please login to add a commentAdd a comment