
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–16 స్కూల్, కాలేజీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–బేగంపేట)తో మ్యాచ్‌లో గౌతమ్ జూనియర్ కాలేజీ 147 పరుగుల తేడాతో నెగ్గింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు గౌతమ్ కాలేజీ జట్టు స్పిన్నర్ డి.మనీశ్ (6/26) ధాటికి 62 పరుగులకే కుప్పకూలింది. తొలుత గౌతమ్ కాలేజీ 209 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తేజ్ (100; 14 ఫోర్లు) సెంచరీ చేశాడు.