under 16 cricket
-
హెచ్‌సీఏ అండర్–16 టోర్నీ విజేత గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–16 స్కూల్, కాలేజీ టోర్నమెంట్లో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో గౌతమ్ కాలేజి 71 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జట్టుపై గెలిచింది. తొలుత గౌతమ్ కాలేజి 50 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి (74 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బిడిగుల బాలాజీ (46; 5 ఫోర్లు), రిషభ్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ వఫీ కచ్చి (119 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. గౌతమ్ కాలేజీ బౌలర్లలో బాలాజీ మూడు, రుతీష్ రెడ్డి రెండు, రవికుమార్ రెండు వికెట్లు తీశారు. గౌతమ్ కాలేజి జట్టు లెగ్ స్పిన్నర్ డి.మనీశ్ ఓవరాల్‌గా 14 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
మనీశ్‌కు ఆరు వికెట్లు.. 147 పరుగులతో ఘన విజయం
హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–16 స్కూల్, కాలేజీ క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్‌పీఎస్–బేగంపేట)తో మ్యాచ్‌లో గౌతమ్ జూనియర్ కాలేజీ 147 పరుగుల తేడాతో నెగ్గింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హెచ్‌పీఎస్ జట్టు గౌతమ్ కాలేజీ జట్టు స్పిన్నర్ డి.మనీశ్ (6/26) ధాటికి 62 పరుగులకే కుప్పకూలింది. తొలుత గౌతమ్ కాలేజీ 209 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ తేజ్ (100; 14 ఫోర్లు) సెంచరీ చేశాడు. -
మ్యాచ్ అంటే ఇది.. జట్టులోని సభ్యులంతా డకౌట్
ముంబై: క్రికెట్లో అద్భుతాలు జరగడం అంటే ఇదేనేమో. క్రికెట్లో ఎక్కువ మంది డకౌటైతేను ఇదేం బ్యాటింగ్‌రా అనుకుంటాం. కానీ మొత్తం జట్టులోని సభ్యులంతా సున్నాకే పరిమితమైతే ఏమనుకోవాలి. మ్యాచ్ అంటే ఇదీ అనుకోవడం తప్పితే ఏం చేస్తాం. ఇప్పుడు అదే జరిగింది. అది ఏ స్థాయి మ్యాచ్ అయినా కానీ వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు డకౌట్‌గా పెవిలియన్‌కు వెళ్లిపోతే ఏమవుతుంది. ఘోర పరాజయం ఎదరవుతుంది. అలా క్రికెట్ చరిత్రలోనే ఒక చెత్త రికార్డును మూటగట్టుకుంది చిల్డ్రన్స్ అకాడమీ అంథేరీ స్కూల్ టీమ్. హార్రిస్ షీల్డ్ అండర్-16 టోర్నమెంట్లో భాగంగా బుధవారం ఆజాద్ మైదానంలో స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ బోరివాలీతో జరిగిన మ్యాచ్‌లో చిల్డ్రన్స్ అకాడమీ అంధేరీ జట్టు 754 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వారు ఛేదించాల్సిన లక్ష్యం 761 పరుగులు కాగా, కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. అవి కూడా ఎక్స్‌ట్రాల రూపంలో రావడం గమనార్హం. మొత్తం జట్టంతా సున్నాకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఓపెనర్లు మొదలుకొని కడవరకూ డకౌట్లనే కొనసాగించింది అంథేరీ చిల్డ్రన్స్ జట్టు. స్వామి వివేకానంద బౌలర్లలో అలోక్ పాల్ ఆరు వికెట్లతో అంథేరీ డకౌట్ల పతనాన్ని శాసించగా, వరాద్ వాజే రెండు వికెట్లు తీశాడు. ఇక రెండు రనౌట్ల రూపంలో వచ్చాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ జట్టు 39 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 605 పరుగులు చేసింది. వివేకానంద ఇంటర్నేషనల్ బొరివాలీ మయేకర్ (338) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కాగా, 45 ఓవర్లను అంథేరీ జట్టు నిర్ణీత సమయంలో పూర్తి చేయకపోవంతో 156 పరుగుల పెనాల్టీ పడింది. దాంతో అంథేరీ లక్ష్యం 761 పరుగులు అయ్యింది. -
ఇల్యాన్ సథాని సెంచరీ
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఇల్యాన్ సథాని (129 బంతుల్లో 103; 18 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈసీఐఎల్ గ్రౌండ్లో కర్ణాటకతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓ మోస్తరు స్కోరును సాధించగలిగింది. 222/9 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 101.3 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. 82 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట రెండోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇల్యాన్, శ్రాగ్వి (15 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కర్ణాటక బౌలర్లలో కుషాల్ గౌడ 4 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్ణాటక జట్టు ఆటముగిసే సమయానికి 77 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులతో నిలిచింది. అక్షణ్ రావు (182 బంతుల్లో 103; 14 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా, స్మరణ్ (132 బంతుల్లో 76; 14 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో టి. రోహన్, శ్రాగ్వి చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం కర్ణాటక 14 పరుగుల ఆధిక్యంలో ఉంది. నేడు ఆటకు చివరిరోజు. ఆంధ్ర 353/9 డిక్లేర్డ్ ఎన్ఎఫ్సీ గ్రౌండ్లో కేరళతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీస్కోరు సాధించింది. 144/1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 85 ఓవర్లలో 9 వికెట్లకు 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆంధ్రకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కె. నితీశ్ కుమార్ రెడ్డి (69; 12 ఫోర్లు), ఎం. సూర్యకిరణ్ (65; 5 ఫోర్లు), పి. సుబ్రమణ్యం (62; 5 ఫోర్లు), ధరణి కుమార్ (66; 10 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కేరళ బౌలర్లలో కిరణ్ సాగర్, శ్రీనాథ్, రెహాన్ సాయి తలా 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేరళ జట్టు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 5 వికెట్లకు 71 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో వాసు 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు చేసిన కేరళ... ఇంకా 144 పరుగులు వెనకబడి ఉంది. -
బిహార్ 1007
పట్నా: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 టోర్నమెంట్లో బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 1007 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 870 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 961/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన బిహార్ మరో 46 పరుగులు చేసి 159.1 ఓవర్లలో 1007/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బిన్నీ (358; 36 ఫోర్లు) అవుట్ కాగానే ఇన్నింగ్స్‌ను ముగించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ 83 పరుగులకే ఆలౌటైంది. -
చాంపియన్ ఈస్ట్‌జోన్
సాక్షి, హైదరాబాద్: ఎన్సీఏ అండర్–16 ఇంటర్ జోనల్ రెండు రోజుల క్రికెట్ టోర్నమెంట్లో ఈస్ట్‌జోన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సెంట్రల్ జోన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ 88 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన ఈస్ట్‌జోన్ మూడింట్లో నెగ్గి ఆరు పాయింట్లను సాధించింది. సెంట్రల్ జోన్ జట్టు కూడా ఆరు పాయింట్లతో నిలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఈస్ట్‌జోన్ విజేతగా నిలిచింది. ఆదివారం ప్రారంభమైన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 90 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. శయన్ కుమార్ (79), ప్రయాస్ బర్మన్ (84) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 81.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఈస్ట్‌జోన్ బౌలర్లలో టి. సుశాంత్ మిశ్రా, కరణ్ లాల్ చెరో 3 వికెట్లు తీశారు. చివరి స్థానంలో సౌత్‌జోన్ టోర్నీ ఆరంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయిన సౌత్‌జోన్ జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లోనూ వెస్ట్‌జోన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి వరుసగా నాలుగు పరాజయాలతో టోర్నీని ముగించింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ జట్టు 30.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. అనంతరం వెస్ట్‌జోన్ జట్టు 20.3 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసి గెలిచింది. ప్రజ్ఞేశ్ (53 నాటౌట్) ఆకట్టుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత క్రికెటర్ అంబటి రాయుడు, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ పాల్గొని నార్త్‌జోన్ జట్టుకు ట్రోఫీని బహూకరించారు. -
కర్ణాటక, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకతో జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్- 16 క్రికెట్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రాగా ముగించింది. షిమోగలో జరిగిన ఈ మ్యాచ్‌లో శుక్రవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్సలో 61 ఓవర్లలో 3 వికెట్లకు 102 పరుగులు చేసింది. వైష్ణవ్ రెడ్డి (31) రాణించాడు. కర్ణాటక బౌలర్లలో శుభమ్ హెగ్డే 2 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు 211/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స కొనసాగించిన కర్ణాటక 135.5 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో సాయి శ్రాగ్వి 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. -
చెలరేగిన సాయి శ్రాగ్వి, త్రిశాంక్
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో బౌలర్లు సాయి శ్రాగ్వి (7/15), త్రిశాంక్ (6/39) విశేషంగా రాణించడంతో హైదరాబాద్ జట్టు ఘన విజయాన్ని సాధించింది. షిమోగాలో జరిగిన ఈ మ్యాచ్‌లో గోవాపై ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో రోజు 13/0తో తొలి ఇన్నింగ్‌సను కొనసాగించిన గోవా జట్టు 33.1 ఓవర్లలో 88 పరుగులకు ఆలౌటైంది. గౌరీశ్ భరత్ 41 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహన్ 2, సాయి శ్రాగ్వి 7 వికెట్లు తీశారు. అనంతరం ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స ను ప్రారంభించిన గోవా జట్టు 104 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అభిషేక్ 2, త్రిశాంక్ 6 వికెట్లతో రాణించారు. -
సెంచరీలతో చెలరేగిన యశ్, పూర్ణచంద్
దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: గీతాంజలి స్కూల్ జట్టు బ్యాట్స్‌మెన్ యశ్ బన్సల్ (114 బంతుల్లో 158; 17 ఫోర్లు), సాయి పూర్ణచంద్ (125 బంతుల్లో 123 నాటౌట్; 4 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కాడు. దీంతో దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో ఫాస్టర్ బిల్లాబాంగ్ హైస్కూల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 289పరుగుల తేడాతో గీతాంజలి స్కూల్ ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గీతాంజలి జట్టు 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 323 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్ బన్సల్, పూర్ణచంద్ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫాస్టర్ బిల్లాబాంగ్ హైస్కూల్ జట్టు 15.4 ఓవర్లలో 34 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. గీతాంజలి జట్టు బౌలర్ కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు లిటిల్ ఫ్లవర్ (ఉప్పల్): 89 (కృతార్థ్ 3/16, నితీశ్ 6/18), స్కాలర్ ఇంటర్నేషనల్ స్కూల్: 70 (ప్రతీక్ 7/19). సుప్రీం హైస్కూల్: 316/7 (దుర్గేశ్ 134, అనురాగ్ 41), ఆక్స్ఫర్డ్ స్కూల్: 91/10 (ఫహద్ 5/14, సాత్విక్ 5/26). నీరజ్ పబ్లిక్ స్కూల్: 129 (ఆశిష్ 3/26), శ్రీవిద్యానికేతన్: 57 (శశాంక్ 4/9, విశాల్ 5/22). గ్లెండాల్ స్కూల్: 119 (యశ్వర్ధన్ 5/28, విష్ణు 3/7), క్రీసెంట్ మోడల్ స్కూల్: 121 (అనిరుధ్ 35నాటౌట్, ఠాకూర్ తిలక్ 74నాటౌట్). విజ్ఞాన్ విద్యాలయ: 202 (సాత్విక్ 41, యశ్వంత్ 50; అబ్దుల్ రెహమాన్ 3/36), డాన్‌బాస్కో: 203/5 (నిఖిల్ రెడ్డి 74, వసంత్ 32). ఎన్ఏఎస్ఆర్ స్కూల్: 168 (షంశుద్దీన్ 37; అజయ్ కుమార్ 4/44), సెయింట్ జోసెఫ్: 96 (షంశుద్దీన్ 5/17). -
జయవర్ధన్ అజేయ సెంచరీ
దయానంద్ క్రికెట్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆర్. దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో భవన్స ఆర్కే స్కూల్ బ్యాట్స్‌మన్ జయవర్ధన్ (127 బంతుల్లో 143 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భవన్స స్కూల్ 221 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స ఆర్కే స్కూల్ (సైనిక్‌పురి) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. జయవర్ధన్‌తో పాటు అకీబ్ (71) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 346 పరుగుల లక్ష్యఛేదనలో డీఆర్ఎస్ స్కూల్ జట్టు తడబడింది. బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే వెనుదిరగడంతో 23.3 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. అక్షయ్ రెడ్డి (45) పోరాడాడు. భవన్స బౌలర్లలో శ్రీకాంత్ రెడ్డి 4, ప్రతీక్ 3 వికెట్లతో రాణించారు. ఇతర మ్యాచ్‌ల ఫలితాలు సెయింట్ జోసెఫ్ పీఎస్: 196 (రోహన్ 4/22); లిటిల్ ఫ్లవర్ హెచ్ఎస్ (అబిడ్స): 200/5 (కుశ్ అగర్వాల్ 45, శిరీష్ రెడ్డి 54, ఆదిత్య సాయి 45నాటౌట్). క్రీసెంట్ మోడల్ స్కూల్: 263/9 (అనిరుధ్ కపిల్ 52, ఠాకూర్ తిలక్ వర్మ 105; వినయ్ రావు 3/49, నిమిష్ 4/49), శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్: 192 (గ్రాహం 44, ఎస్. రోహిత్ 48, నందన్ 30; విష్ణు 4/29).