దయానంద్ క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: ఆర్. దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో భవన్‌స ఆర్‌కే స్కూల్ బ్యాట్స్‌మన్ జయవర్ధన్ (127 బంతుల్లో 143 నాటౌట్; 14 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తించాడు. దీంతో డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టుతో సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భవన్‌స స్కూల్ 221 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్‌స ఆర్‌కే స్కూల్ (సైనిక్‌పురి) జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. జయవర్ధన్‌తో పాటు అకీబ్ (71) అర్ధసెంచరీతో రాణించాడు. అనంతరం 346 పరుగుల లక్ష్యఛేదనలో డీఆర్‌ఎస్ స్కూల్ జట్టు తడబడింది. బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే వెనుదిరగడంతో 23.3 ఓవర్లలో 124 పరుగులకే కుప్పకూలింది. అక్షయ్ రెడ్డి (45) పోరాడాడు. భవన్‌స బౌలర్లలో శ్రీకాంత్ రెడ్డి 4, ప్రతీక్ 3 వికెట్లతో రాణించారు.
ఇతర మ్యాచ్‌ల ఫలితాలు
సెయింట్ జోసెఫ్ పీఎస్: 196 (రోహన్ 4/22); లిటిల్ ఫ్లవర్ హెచ్‌ఎస్ (అబిడ్‌స): 200/5 (కుశ్ అగర్వాల్ 45, శిరీష్ రెడ్డి 54, ఆదిత్య సాయి 45నాటౌట్).
క్రీసెంట్ మోడల్ స్కూల్: 263/9 (అనిరుధ్ కపిల్ 52, ఠాకూర్ తిలక్ వర్మ 105; వినయ్ రావు 3/49, నిమిష్ 4/49), శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్: 192 (గ్రాహం 44, ఎస్. రోహిత్ 48, నందన్ 30; విష్ణు 4/29).