సాక్షి, హైదరాబాద్: కర్ణాటకతో జరిగిన విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్- 16 క్రికెట్ మ్యాచ్‌ను హైదరాబాద్ డ్రాగా ముగించింది. షిమోగలో జరిగిన ఈ మ్యాచ్‌లో శుక్రవారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ రెండో ఇన్నింగ్‌సలో 61 ఓవర్లలో 3 వికెట్లకు 102 పరుగులు చేసింది. వైష్ణవ్ రెడ్డి (31) రాణించాడు. కర్ణాటక బౌలర్లలో శుభమ్ హెగ్డే 2 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు 211/7 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్‌స కొనసాగించిన కర్ణాటక 135.5 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్ బౌలర్లలో సాయి శ్రాగ్వి 6 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కర్ణాటకకు 3 పాయింట్లు లభించగా... హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది.
కర్ణాటక, హైదరాబాద్ మ్యాచ్ డ్రా
Published Sat, Dec 17 2016 11:57 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement