పట్నా: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 టోర్నమెంట్‌లో బిహార్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 1007 పరుగులు చేసింది. అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 870 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 961/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన బిహార్ మరో 46 పరుగులు చేసి 159.1 ఓవర్లలో 1007/7 స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బిన్నీ (358; 36 ఫోర్లు) అవుట్ కాగానే ఇన్నింగ్స్‌ను ముగించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన అరుణాచల్ ప్రదేశ్ 54 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్ 83 పరుగులకే ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment