దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: గీతాంజలి స్కూల్ జట్టు బ్యాట్స్‌మెన్ యశ్ బన్సల్ (114 బంతుల్లో 158; 17 ఫోర్లు), సాయి పూర్ణచంద్ (125 బంతుల్లో 123 నాటౌట్; 4 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కాడు. దీంతో దయానంద్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్‌లో ఫాస్టర్ బిల్లాబాంగ్ హైస్కూల్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 289పరుగుల తేడాతో గీతాంజలి స్కూల్ ఘనవిజయాన్ని సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గీతాంజలి జట్టు 40 ఓవర్లలో వికెట్ నష్టానికి 323 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్ బన్సల్, పూర్ణచంద్ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఫాస్టర్ బిల్లాబాంగ్ హైస్కూల్ జట్టు 15.4 ఓవర్లలో 34 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. గీతాంజలి జట్టు బౌలర్ కేవలం 5 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
లిటిల్ ఫ్లవర్ (ఉప్పల్): 89 (కృతార్థ్ 3/16, నితీశ్ 6/18), స్కాలర్ ఇంటర్నేషనల్ స్కూల్: 70 (ప్రతీక్ 7/19).
సుప్రీం హైస్కూల్: 316/7 (దుర్గేశ్ 134, అనురాగ్ 41), ఆక్స్‌ఫర్డ్ స్కూల్: 91/10 (ఫహద్ 5/14, సాత్విక్ 5/26).
నీరజ్ పబ్లిక్ స్కూల్: 129 (ఆశిష్ 3/26), శ్రీవిద్యానికేతన్: 57 (శశాంక్ 4/9, విశాల్ 5/22).
గ్లెండాల్ స్కూల్: 119 (యశ్‌వర్ధన్ 5/28, విష్ణు 3/7), క్రీసెంట్ మోడల్ స్కూల్: 121 (అనిరుధ్ 35నాటౌట్, ఠాకూర్ తిలక్ 74నాటౌట్).
విజ్ఞాన్ విద్యాలయ: 202 (సాత్విక్ 41, యశ్వంత్ 50; అబ్దుల్ రెహమాన్ 3/36), డాన్‌బాస్కో: 203/5 (నిఖిల్ రెడ్డి 74, వసంత్ 32).
ఎన్‌ఏఎస్‌ఆర్ స్కూల్: 168 (షంశుద్దీన్ 37; అజయ్ కుమార్ 4/44), సెయింట్ జోసెఫ్: 96 (షంశుద్దీన్ 5/17).
సెంచరీలతో చెలరేగిన యశ్, పూర్ణచంద్
Published Sat, Oct 29 2016 12:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM
Advertisement
Advertisement