Bhatia
-
చిప్ తయారీకి విధానాలు ముఖ్యం
ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు. మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్‌లోని సణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు. భారత్‌కు అవకాశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్‌లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్‌కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే. -
వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్
రూ.1.38 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు వనీషా మిట్టల్. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ కుమార్తె వనీషా. కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు వనీషా. డిసెంబర్ 2004లో మిట్టల్ స్టీల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి నియమితులయ్యారు ఏప్రిల్ 2011లో అపెరమ్ అనే కంపెనీలో చేరారు. అప్పటి నుండి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అయితే 2004లో అత్యంత అట్టహాసంగా జరిగిన వనీషా వివాహం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అత్యంత ఖరీదైన వివాహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చేరింది. వనీషా, అమిత్ పెళ్లి: రికార్డులు, విశేషాలు ప్రియుడు, అమిత్ భాటియాని 20004లో వనీషా వివాహమాడింది. వనీషా వివాహానికి స్టీల్దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ రూ. 240 కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుత వాల్యుయేషన్ ప్రకారం దీని ధర రూ.550 కోట్లకు పైగా ఉంటుంది. పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ సన్నాహాలకే ఒక ఏడాది పట్టిందంటేనే ఈ వెడ్డింగ్ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పెళ్లిలో ప్రతి అంశం ఒక విశేషం. ఆరు రోజుల పాటు వివాహ కార్యక్రమాలు జరిగాయి. ప్రిన్స్ విలియం తన వివాహానికి ఖర్చు చేసిన దానికంటే కూడా ఇది ఎక్కువట. (మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ) ♦ పెళ్లిలో 30 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడానికి కైలీ మినోగ్‌కు ఏకంగా 330,000 డాలర్లు చెల్లించారట. పాపులర్ బాలీవుడ్ స్టార్లు కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ♦ 1500 మంది అతిథుల బస, ప్రయాణ ఖర్చులను మిట్టల్ కుటుంబం చెల్లించింది. ♦ వెడ్డింగ్ డ్యాన్స్ స్టెప్స్ నేర్పించేందుకు కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ పెళ్లికి వెళ్లింది. జావేద్ అక్తర్ ఒక నాటకాన్ని రచించగా మిట్టల్ కుటుంబం యాక్ట్ చేసింది. ♦ బాలీవుడ్ హీరోయిన్లు, సూపర్ స్టార్లు స్పెషల్ గెస్ట్స్‌గా హాజరయ్యారు. అలాగే జూహీ చావ్లా, రాణిముఖర్జీ, సైఫ్ అలీఖాన్, షారూఖ్ చేసిన స్పూఫ్కి కోట్ల రూపాయలు ♦ వివాహ వేడుకలో కూడా ఐశ్వర్యరాయ్ ప్రదర్శన (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) ♦ అతిథులకు వడ్డించే రుచికరమైన వంటలకోసం పాపులర్ చెఫ్ మున్నా మహారాజ్‌ను ప్రత్యేకంగా పిలిపించారు. 20పేజీల సిల్వర్ ఇన్విటేషన్ బాక్స్, పారిస్‌కు టిక్కెట్లు ఇదంతా ఒక ఎత్తయితే..అతిథులందరికీ 20 పేజీల ఆహ్వాన కార్డులను సిల్వర్ బాక్స్‌లో పెట్టి అందించడం మరో ఎత్తు. ఇందులో పారిస్‌కు వెళ్లే వారి విమాన టిక్కెట్లు, అవాంట్-గార్డ్ ఇంటర్కాంటినెంటల్ ప్యారిస్‌లో బస వివరాలు కూడా ఉన్నాయి. దీనికి ముందు ప్రత్యేక అనుమతులుతీసుకొని మరీ ఎంగేజ్మెంట్ వేడుక వెర్సైల్స్ ప్యాలెస్‌లో, సంగీత్ వేడుకులను పారిస్‌లోని 500 ఏళ్ల నాటి టుయిలరీస్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. వనీషా మిట్టల్ 1980 ఆగస్టు 23న పుట్టింది వనీషా మిట్టల్.ఆమె సోదరుడి పేరు ఆదిత్య మిట్టల్. యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేసింది. అమిత్‌కు క్రీడలంటేచాలా ఇష్టం. వనీషా, అమిత్ దంపతులకు ముగ్గురు పిల్లలు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) అమిత్ భాటియా అమిత్ భాటియా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో 1979 సెప్టెంబరు 4న జన్మించారు. కానీ 1995 వరకు ఢిల్లీలో కొలంబా స్కూల్లో, 1996లో లండన్‌లోని దుల్విచ్ కాలేజ్,1997లో ఢిల్లీ బ్రిటీష్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. యూకేలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు అమిత్. దీంతోపాటు స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్, ది గ్లోబల్ రిలీఫ్ ఇనిషియేటివ్ ఫౌండర్ కూడా అమిత్‌కు క్రీడలంటే ముఖ్యంగా గోల్ఫ్, క్రికెట్, ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్ (క్యూపీఆర్) ఫౌండర్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే మామ మిట్టల్ ఛాంపియన్ ట్రస్ట్ ఏర్పాటులో కూడా అమిత్‌ది కీలక పాత్ర అని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. వనీషా, అమిత్‌ల పరిచయం ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. దీంతో ఈ లవ్‌బర్డ్స్ ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు కలకాలం గుర్తుండిపోయేలా అత్యంత వైభంగా మూడుముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించారు. View this post on Instagram A post shared by Amit Bhatia (@amitbhatia100) -
మనసు మార్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా
-
గుడ్ టచ్ బ్యాడ్ టచ్
మేఘా భాటియా... యానిమేటెడ్ చిత్రాల రూపకర్త. పిల్లల లైంగిక దోపిడీ గురించి అర్థం అయ్యేలా చెప్పాలనే ఆమె ప్రయత్నం ఇప్పుడు ఎంతోమందిని ఆకట్టుకుంటుంది. ఆలోచింపజేస్తుంది. తను రూపొందించిన చిత్రాల ద్వారా ‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్’ని పిల్లలు అర్థం చేసుకోవాలని ఆమె కోరుకుంటుంది. మేఘా మొదట పిల్లల లైంగిక దోపిడీకి సంబంధించి 10 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిల్మ్ చేసింది. దీనిని హిందీతోపాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేసింది. సినిమా పేరు ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’. మేఘాకు ‘అవర్ వాయిస్’ అనే ఎన్జీఓ కూడా ఉంది. దీని ద్వారా ఆమె సెమినార్లను నిర్వహించి మరీ విషయాలను రాబడుతుంది. పిల్లల లైంగిక వేధింపులు.. సమాచార సేకరణ ఢిల్లీలో రాజేంద్రనగర్‌లో నివసిస్తున్న మేఘా భాటియా లండన్ యూనివర్శిటీ కాలేజ్ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందింది. అక్కడే ఒక పరిశోధన ప్రాజెక్ట్ సమయంలో పిల్లల లైంగిక వేధింపుల గురించిన సమగ్ర సమాచారం ఆమెకు లభించింది. ఆ తర్వాత ఆమె ఇండియాకు తిరిగి వచ్చింది. తను ఎంచుకున్న అంశం మీద ఎంతో సమాచార సేకరణ చేసింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం పిల్లలతో సంబంధం ఉన్న 1,06,958 కేసులలో 36,022 కేసులు లైంగిక వేధింపులకు పాల్పడ్డవే. వీరిలో సగం మంది పిల్లలు నేరాలకు పాల్పడతారనే భయంతో పోలీస్‌స్టేషన్‌లో నివేదికలో రాయడం లేదని తెలిసింది. ఇలాంటి పిల్లలకు సాయం చేయడానికి మేఘ యానిమేషన్ చేయడం ప్రారంభించింది. పిల్లలకు తెలియదు.. పెద్దలు అర్థం చేసుకోరు! యానిమేషన్ సినిమాలు అంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. అందుకే, వాటి ద్వారానే పిల్లలకు లైంగిక విద్యను ఇవ్వాలని నిర్ణయించుకున్నారు మేఘ. ‘‘నిజానికి పిల్లలకు సంబంధించిన నేరాలు చాలా మటుకు వారికి తెలియకుండానే జరుగుతాయి. ఒకసారి ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి, ‘నా పట్ల ఒకరు అసహ్యంగా ప్రవర్తించారని అమ్మకు చెప్పాను. మరోసారి ఇలాంటి మాటలు చెబితే కొడతాన’ని చెప్పింది’ అని ఆ పాప చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది’ అన్నారు మేఘ. ఈ పరిస్థితుల్లో ఈ పిల్లలకు సురక్షితమైన వాతావరణం అవసరమని మేఘా గ్రహించింది. ఆ ఆలోచనతోనే ‘హమారే సూపర్ బడ్డీస్, హమారే రక్షక్’ పేరుతో పది నిమిషాల నిడివిగల యానిమేటెడ్ సినిమా రూపొందించింది. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాతో సహా తొమ్మిది రాష్ట్రాల్లో నివసిస్తున్న 100 మందికి పైగా న్యాయవాదులు, ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని తీసుకున్న తరువాత మేఘా ఈ చిత్రాన్ని రూపొందించింది. మేఘ చేస్తున్న ఈ ప్రయత్నం పిల్లల క్షేమం కోసమే. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో పెరిగేలా తల్లిదండ్రులూ, ఉపాధ్యాయులూ పిల్లల్లో అవగాహన తీసుకురావాలి. పెద్దలూ అర్థం చేసుకోవాలి. (చదవండి: ఆమె ఒక నడిచే గ్రంథాలయం) -
ఇండిగో ప్రమోటర్లు : ముదురుతున్న పోరు
సాక్షి, ముంబై : ఇండిగో ప్రమోటర్ల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇండిగో బ్రాండు విమానయాన సేవల సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ కో ప్రమోటర్, అమెరికాకు చెందిన రాకేష్ గాంగ్వాల్ , సహ ప్రమోటర్ రాహుల్ భాటియాపై సెబీకి ఫిర్యాదు చేశారు. భాటియాపై గతంలో తాను చేసిన ఫిర్యాదులపై రెగ్యులేటరీ జోక్యం కోరుతూ సోమవారం సెబీకి లేఖ పంపారు. 49 పేజీల ఈ లేఖలో సంస్థలో గవర్నన్స్‌పై తాను తీవ్ర ఆందోళన వ్యక్తం చేశానని గాంగ్వాల్ తెలిపారు. దీనిపై స్పందించిన సెబీ జూలై 19 లోగా ఈ లేఖపై స్పందన తెలియజేయాల్సిందిగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను కోరింది. మరోవైపు గాంగ్వాల్ ఆరోపణలను రాహుల్ భాటియా తీవ్రంగా ఖండించారు. కంపెనీని బలహీన పర్చేందుకే గాంగ్వాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు రాహుల్ ఇండిగో బోర్డుకు లేఖ రాశారు. కాగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌ను నిర్వహిస్తున్న యాజమాన్యంలో రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య ఆధిపత్య పోరు మరింత ముదిరిన నేపథ్యంలో ఇద్దరూ విడిగా న్యాయ సలహాల కోసం విభిన్న సంస్థలను ఆశ్రయించారు. రాహుల్ భాటియాకు ఇంటర్‌గ్లోబ్ మాతృ సంస్థ ఇండిగోలో 38 శాతం వాటా ఉండగా, గంగ్వాల్ కు 37 శాతం వాటాను కలిగి ఉన్నారు. 2006లో భాటియా, గంగ్వాల్ సంయుక్తంగా ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ సంస్థను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
బురారీ కాండ: ఒకరి ఉన్మాదం.. పదకొండు ప్రాణాలు!
ఇటీవల ఢిల్లీలో జరిగిన బురారీ కాండలో ఒకరి భ్రాంతి 11 మంది ప్రాణాలను బలితీసుకున్న ఘటనకు కళాచిత్రం. మోక్షం ఇక్కడే ఉంది. అందమైన ప్రపంచం ఇదే. మన కుటుంబాలకు ఈ విషయం గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ పంచుకుంటే సగమవుతుంది. సంతోషం పంచుకుంటే రెట్టింపవుతుంది. కల పంచుకుంటే క్రాంతి అవుతుంది. కానీ భ్రాంతి పంచుకుంటే అశాంతి మిగులుతుంది. ఢిల్లీలో జరిగిన బురారీ కాండను మరచిపోలేం. ఒకరి ఉన్మాదం పదకొండు ప్రాణాలు తీసింది. అది పైశాచికత్వం కాదు... ఒక భ్రాంతి రోగం. ఒక మానసిక అంటువ్యాధి. ఇది ఒక పంచుకున్న భ్రమ..షేర్డ్ సైకోసిస్ వల్ల జరిగిందంటున్నారు నిపుణులు. మోక్షానికి తలుపు తెరవబోయి నరకాన్ని చూశారు. వ్యాధుల్లో రెండు రకాలుంటాయి. మామూలువి. అంటుకునేవి. మరి మానసిక సమస్యల్లో అంటువ్యాధులుంటాయా? ఉంటాయి. అరె... అదెలా సాధ్యం అనిపిస్తోందా? ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఇది అంటువ్యాధి కానే కాదు. కానీ అంటువ్యాధే. అదెలాగో చూద్దాం. ఒక కేస్ స్టడీ: ఇటీవల ఢిల్లీలోని బురారీలో పదకొండు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతోకాలం కిందట నారాయణి దేవి భర్త చనిపోయాడు. మరణించినాయన కుటుంబపెద్ద కావడంతో ఆయన మృతి తర్వాత ఆ కుటుంబం అష్టకష్టాలు పడింది. కుటుంబ పెద్ద రెండో కొడుకైన లలిత్ భాటియా తరచూ ఓ మాట అంటుండేవాడు. నాన్న తనతో మాట్లాడుతున్నాడనీ, బిజినెస్ విషయంలో సలహాలు ఇస్తున్నాడని చెప్పేవాడు. ఆ సలహాలను తాము పాటిస్తూ ఉండటం వల్ల బిజినెస్ పుంజుకొని తమ కష్టాలు గట్టెక్కాయని ఆయన నమ్ముతుండేవాడు. ఈ నమ్మకం మరింత పెరిగింది. దాంతో 2015 నుంచి అతడు తాంత్రిక పూజల్లో నిమగ్నం కావడం మొదలుపెట్టాడు. ఈ ఏడాది మొదట్లో అతడి పూజలు మరింత ముమ్మరమయ్యాయి. అందులో వటవృక్ష పూజ అనే ఓ తంతును నిర్వహిస్తే... తమకు మోక్షం తప్పదని అతడు నమ్మాడు. అతడే కాదు... గతంలో బిజినెస్ బాగుపడటం, తమ జీవనశైలి మెరుగుపడటంతో లలిత్భాటియా తండ్రే అతడితో మాట్లాడుతున్నాడని కుటుంబసభ్యులంతా నమ్మడం మొదలు పెట్టారు. దాంతో లలిత్ చెప్పే వటవృక్షపూజ కాన్సెప్ట్‌నూ అందరూ విశ్వసించారు. కుటుంబ సభ్యులందరికీ మోక్షం కోసం ఈ వటవృక్షపూజలో భాగంగా... చెట్టుకు ఉండే ఊడల్లాగా ఉరి వేసుకొని వేలాడాలనీ, దాంతో ఇప్పుడు తాము మరణించబోమనీ, అయితే వాస్తవంగా చనిపోయినప్పుడు తమకు మోక్షం తప్పదంటూ లలిత్ చెప్పిన దాన్ని అందరూ గుడ్డిగా నమ్మారు. పూజలో భాగంగా తమ నవరంధ్రాలనూ మూసిపెట్టాలని కళ్లకు గంతలు కట్టుకున్నారు. నోట్లో గుడ్డలు, చెవుల్లో దూది కుక్కుకున్నారు. పూజలో భాగంగా అందరూ ఉరేసుకున్నారు. తమ ఆత్మలు గాలిలో కలిసి, మళ్లీ తమ శరీరంలోకి ప్రవేశించడానికి 11 మంది కోసమంటూ పదకొండు గొట్టాలనూ ఏర్పాటు చేసుకున్నారు.ఇంతాచేసి ఉరివేసుకున్న తర్వాత వారు బతకలేదు సరికదా... కుటుంబంలోని 11 మందీ చనిపోయారు. అయితే ఈ వటపూజను ఎంతగా నమ్మారంటే... తమ పూజాక్రతువు పూర్తయ్యాక, తమలాగే కష్టాలు పడుతున్న మరో కుటుంబంతోనూ ఈ వ్రతం చేయించాలని వారనుకున్నారు. అంత మూఢంగా, గాఢంగా వారీ తాంత్రిక తంతును విశ్వసించారన్నమాట. లలిత్ భాటియా నమ్మాడు సరే... మరి మిగతావారి విచక్షణ ఏమైంది? ఏమైందంటే... సైంటిఫిక్‌గా చెప్పాలంటే తాను నమ్మిన సైకోటిక్ వైఖరిని మిగతావారికీ ‘షేర్’ చేశాడు. అలా తన సైకోసిస్‌ను మిగతావారికీ షేర్ చేసిన ఈ వ్యాధి పేరే ‘‘షేర్డ్ సైకోసిస్’’. మానసిక వైద్యశాస్త్రంలో ఒకింత అరుదైన వ్యాధే. కానీ ఎంతో ప్రమాదకరం. ఎంతగానంటే... ఏ డిప్రెషన్లోనో కూరుకుపోతే... అలా దానికి గురైనవాడే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ‘షేర్డ్ సైకోసిస్’లో అతడితో పాటు మరో సమూహం సమూహమే బలయిపోతుంది. అలా బలిచేసిన ఆ ‘షేర్డ్ సైకోసిక్’ రుగ్మత గురించి సమగ్ర అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. అసలు ‘షేర్డ్ సైకోసిస్’ అంటే ఏమిటీ? ఇది భ్రాంతులు కలిగించే ఒక రుగ్మత. దీన్నే ఇండ్యూస్డ్ డెల్యూజన్ డిజార్డర్ అని కూడా అంటారు. ఈ భ్రాంతి రుగ్మతకు వైద్యపరమైన ఒక ఫ్రెంచ్ పేరు ఉంది. అదే ‘ఫోలీ ఎ డ్యుయో’ (జౌ జ్ఛీ ్చ ఛ్ఛీu్ఠ) అంటే వాస్తవంగా డ్యుయో అంటే రెండు అని అర్థం. ఒకవేళ ఇది కుటుంబ సభ్యుల్లో ఇద్దరికంటే ఎక్కువగా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దీన్నే ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ అంటారు. అదే కుటుంబాన్ని దాటి ఇంకా చాలామందికి వచ్చిందనుకోండి. అప్పుడు దాన్ని ‘ఫోలీ ఎ ప్లసియర్స్’ అంటారు. బురారీ ఆత్మహత్యల సంఘటనలో అది ‘ఫోలీ ఎన్ ఫ్యామిలే’ వరకు వచ్చి ఆగింది. అదే వారు సంకల్పించినట్టుగా మరో కుటుంబాన్నీ ప్రభావితం చేసి పూజకు ఉసిగొలిపి, ఆ కుటుంబం మరణానికీ కారణమయ్యుంటే అప్పుడది ‘ఫోలీ ఎ ప్యాసియర్స్’ అయి ఉండేది. దీన్ని ఫ్రెంచ్ సైకియాట్రిస్ట్‌లు అయిన చార్లెస్ లేసెగ్, జీన్ పెర్రీ ఫార్లెట్ను 19వ శతాబ్దంలో కనుగొన్నారు. అందుకే దీన్ని లేసెగ్–ఫార్లెట్ సిండ్రోమ్ అని కూడా అంటారు. కనీసం ఇద్దరు భ్రాంతులకు గురైనప్పుడు కానీ దీన్ని గుర్తించడం సాధ్యం కాదు. మొట్టమొదట భ్రాంతులకు గురయ్యే రోగిని ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ఇండ్యూసర్’ అని అంటారు. అంటే పై కేస్‌స్టడీలో లలిత్ భాటియా ‘ద ప్రైమరీ కేస్’ లేదా ఇండ్యూసర్ అన్నమాట. ఆ తర్వాత అతడి భ్రాంతులకు పొరుగు ఉన్న ఆరోగ్యవంతులూ ప్రభావితులైపోతారు. ఇలా తర్వాత ప్రభావితులయ్యే వారిని ‘ద సెకండరీ’ లేదా ‘యాక్సెప్టార్’ లేదా ‘అసోసియేట్’ అంటారు. ఇక్కడ మరో విచిత్రం ఉంది. ఒకరిపై ఒకిరికి ఎలాంటి ప్రభావాలూ లేకుండా ఇద్దరు వేర్వేరు వ్యక్తులు ఒకేలాంటి భ్రాంతులకు లోనైతే ఆ కండిషన్‌ను ‘ఫోలీ సైమల్టేనీ’ అంటారు. ఏదైనా కారణాల వల్ల ‘ద ప్రైమరీ కేస్’ లేదా ‘ద ఇండ్యూసర్’ భ్రాంతులకు గురికావడం లేదనుకోండి. క్రమంగా సెకండరీ/యాక్సెప్టార్/అసోసియేట్స్ కూడా భ్రాంతుల నుంచి ఆటోమేటిక్‌గా బయటకు వచ్చేసి పూర్తిగా నార్మల్ అయిపోతారు. ఏదైనా కారణం చేత ఈ తరహా సైకోసిస్‌కు గురైనవారు భ్రాంతుల వల్ల వేర్వేరుగా హాస్పిటల్లో చేరారనుకోండి. అప్పటివరకూ ‘ద ఇండ్యూస్డ్’ తాలూకు ప్రభావం లేకపోవడంతో... ‘ద అసోసియేట్’కు ఎలాంటి వైద్య చికిత్సా అవసరం లేకుండానే ఆటోమేటిగ్గా నయమైపోతుంది. ఎవరెవరిలోనంటే...? నిజజీవితంలో దీనితో బాధపడ్డవారి కేసులు చూస్తే ఎంతో విచిత్రంగా అనిపిస్తాయి. స్వీడన్‌కు చెందిన ఇద్దరు కవల అక్కాచెల్లెళ్లు ఇంగ్లాండ్‌కు వచ్చారు. వాళ్ల పేర్లే ఉర్సులా ఎరిక్సన్, సబీనా ఎరిక్సన్. లండన్ వెళ్లడం కోసం లివర్‌పూల్‌లో బస్ ఎక్కడానికి ప్రయత్నిస్తుండగా... వారి ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో బస్‌డ్రైవర్ వాళ్లను బస్ ఎక్కనివ్వలేదు. అక్కడి ‘హైవేస్ ఇంగ్లాడ్ ట్రాఫిక్ ఆఫీసర్లు’ వాళ్లను ఆ తర్వాతి బస్‌లో ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా... తొలుత ఉర్సులా ఉన్నట్టుండి విపరీతమైన ట్రాఫిక్ ఉన్న రోడ్డుపైకి అకస్మాత్తుగా పరుగెత్తి లారీని ఢీకొనబోయింది. అంతలోనే ఆమె చెల్లి సబీనా కూడా రోడ్డు మీదికి పెరుగెత్తింది. వీళ్లలో ఉర్సులా ‘ద ప్రైమరీ కేస్’ అని, సబీనా ‘సెకండరీ’ అని.. వాళ్లిద్దరూ ‘ఫోలీ ఎ డ్యూయో’కు లోనయ్యారని ఆ తర్వాత తేలింది. ఇలా అనేక కేసులను పరిశీలించనప్పుడు బంధువర్గంలోని వారు, అన్నదమ్ముల లేదా అక్కచెల్లెళ్ల పిల్లలు (కజిన్స్) ఈ ‘షేర్డ్ సైకోసిస్’కు ఎక్కువగా గురవుతారని తేలింది. ఎందుకు, ఎలా...? ఈ ‘షేర్డ్ సైకోసిస్’కు ఎందుకు, ఎలా గురవుతారో తెలుసుకునే ముందర... అసలు ‘సైకోసిక్’కు ఎలా గురవుతారో అర్థం చేసుకుందాం. మన మెదడులో సుమారు పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని నాడీకణాలు ఉంటాయి. సన్నటి వైర్లలాంటి వాటితో ఒక్కో కణానికి మళ్లీ పక్కనున్న కణాలతో పదివేల నుంచి లక్ష వరకు కనెక్షన్లు ఉంటాయి. ఒక్కో కనెక్షన్‌ను ఒక్కో వైర్ అనుకుంటే మెదడులో మొత్తం పది పక్కన 16 సున్నాలు పెడితే ఎంత విలువ వస్తుందో... వైర్లలాంటి అన్ని కనెక్షన్లు ఉంటాయి. ఈ వైర్ల మధ్య కొన్ని చోట్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ ఖాళీ స్థలంలో మెదడుకు సంబంధించిన కొన్ని రసాయనాలు ఉంటాయి. అలాగే కణాల్లోనూ కొన్ని రసాయనాలు స్రవిస్తుంటాయి. కణాల మధ్యన ఉండే రసాయనాలను ఫస్ట్ మెసెంజర్స్ అనీ, కణాల్లోపలి రసాయనాలను సెకండ్ మెసెంజర్స్ అని అంటారు. ఈ రసాయనాలు, వైర్ల ద్వారా ఒక్కోకణానికి మరో కణంతో కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. వాటి ద్వారానే మన ఆలోచనలు పుడుతుంటాయి. మారుతుంటాయి. రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు రసాయనాలలో డోపమైన్, సెరిటోనిన్, ఎపీనెఫ్రిన్ వంటివి కొన్ని. ఈ రసాయనాలు తమ నార్మల్ స్థాయిని దాటి పెరిగినప్పుడు ‘సైకోటిక్ డిజార్డర్స్’ వస్తాయి. అంటే నిజానికి ఏ సంఘటనా జరగకపోయినా, మెదడులో ఈ రసాయనాల మార్పులు జరిగిన వారికి నిజంగా ఏదో జరిగినట్లు భ్రాంతి కలుగుతుంది. నార్మల్ వ్యక్తికి ఏమీ జరగకపోవడం ఎంత వాస్తవమో... తమ రసాయన మార్పుల అనుభూతుల వల్ల వాళ్లకు ఏదో జరగడం కూడా అంతే వాస్తవం. అందుకే వాళ్ల భ్రాంతులను మనం కొట్టిపారేయకూడదు. అలా జ్ఞానేంద్రియాలు చూడకపోయినా సంఘటనను జరిగిన అనుభూతి పొందడాన్ని ఇంగ్లిష్‌లో ‘హేలూసినేషన్స్’ అంటారు. ఇక సైకోటిక్ డిజార్డర్ ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరగకపోయినా అది జరిగిందంటూ మనసులో దృఢంగా నమ్మడాన్ని ‘డెల్యూషన్’ అంటారు. ఇలాంటి భ్రాంతులు మద్యం, మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా జరుగుతాయి. అయితే వ్యాధికి లోనైనవారిలో అలాంటివేవీ తీసుకోకపోయినా ఈ భ్రాంతులు కలుగుతాయి. ఇలా సైకోసిస్‌కు గురైన వారు మళ్లీ... ఇతరులను ప్రభావితం చేస్తే పక్కవారిలోనూ కనిపించే మానసిక సమస్యనే ‘షేర్డ్ సైకోసిస్’ అంటారు. ఈ విధంగా షేర్డ్ సైకోసిస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుందన్నమాట. ఈ వ్యాప్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ఒక కుటుంబంలోని డామినెంట్ పర్సనాలిటీ... అదే కుటుంబలో సబ్మిసివ్ పర్సనాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఆ సబ్మిసివ్ పర్సనాలిటీ, డామినెంట్ పర్సనాటిటీపై ఆధారపడి చాలాకాలం జీవించాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సబ్మిసివ్ పర్సనాలిటీ... తన డామినెంట్ పర్సనాలిటీతో తేలిగ్గా ప్రభావితమవుతుంది. ఉగ్రవాదుల నేతలు తమ ప్రయోజనాల కోసం సబ్మిసివ్ పర్సనాటిటీ ఉన్న అనుచరులను కూడా ఇలాగే ప్రభావితం చేస్తుంటారు. ఈ జబ్బుపైన ఒక సినిమా కూడా... షేర్డ్ సైకోసిస్ అంశంగా ఆరోన్ రాటింగాస్ అనే అమెరికన్ డైరెక్టర్ 2011లో ‘అపార్ట్’ అనే సినిమా కూడా తీశాడు. దీని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫోలీ ఎ డ్యూయోతో బాధపడుతున్న ఇద్దరి నిజజీవిత సంఘటన ఆధారంగా సినిమా తీసినట్లు చెప్పాడు. లక్షణాలు ఏమిటి / గుర్తించడం ఎలా: మద్యం, మాదకద్రవ్యాలు ఏమీ లేకుండానే ఒకరు తమకు ఏవేవో వినిపిస్తున్నాయనీ, ఎవరెవరో కనిపిస్తున్నారని చెప్పే స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ప్రైమరీలో కనిపిస్తాయి. వాటితో కుటుంబ సభ్యులూ ప్రభావితమవుతుంటారు. ఉదాహరణకు తాము పేదరికంలో బాధపడుతున్నప్పుడు ఏదో ఒక వ్యాపారం చేస్తే... తమకు కలిసి వస్తుందనీ, దాంతో స్విమ్మింగ్‌పూల్ వంటి ఇంట్లో తాము ఉండబోతామని అనిపిస్తుంది. వ్యాపారంలో యాదృచ్చికంగా కలిసి వచ్చాక... తాము స్విమ్మింగ్‌పూల్ ఉన్న ఇంట్లోనే చేరారనుకోండి. ఇక అప్పట్నుంచి ప్రైమరీ తనకు ఏవేవో మాటలు వినిపిస్తుంటాయనీ, తనకు ఎవరెవరో కనిపిస్తుంటారనీ, తనకు వినిపించే ఆదేశాలను పాటిస్తే.. అంతా విజయమేనని నమ్ముతుంటారు. నిర్ధారణ : షేర్డ్ సైకోసిస్ నిర్ధారణకు ఇదమిత్థంగా వైద్య పరీక్షలేమీ అందుబాటులో లేవు. అయితే ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధారణ చేయడం కోసం ఒక్కోసారి రోగులకు బ్రెయిన్ ఎమ్మారై, ఇతర రక్తపరీక్షలు చేయిస్తుంటారు. అవన్నీ నార్మల్‌గా ఉండి కూడా రోగి వైద్య చరిత్ర (మెడికల్ హిస్టరీ), ధోరణి, ప్రవర్తలను సైకియాట్రిస్టులు పరిశీలిస్తారు. వారు ఇతరులను ప్రభావితం చేసేలా భ్రాంతులకు లోనవుతున్నట్లు తెలుసుకున్నప్పుడు దాన్ని షేర్డ్ సైకోసిస్‌గా సైకియాట్రిస్ట్‌లు నిర్ధారణ చేస్తారు. నివారణ / చికిత్స : కుటుంబంలో ఒకరు ఇలా భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు గ్రహిస్తే దీన్ని పసిగట్టడం తేలికే. అయితే వారు కూడా ప్రైమరీతో పాటు ప్రభావితమైతేనే సమస్య. దీనికి కౌన్సెలింగ్‌తోనూ, కుటుంబానికి ఇవ్వాల్సిన ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. అలాగే యాంగై్జటీని తగ్గించే మందులు, యాంటీసైకోటిక్ మందులు, నిద్రలేమికి ఇవ్వాల్సిన ట్రాంక్విలైజర్లతో చికిత్స చేస్తారు. సామాజిక సేవా కార్యకలాపాల్లో ఉన్నప్పుడు ఈ తరహా భ్రాంతులకు గురికావడం చాలా తక్కువని సైకియాట్రిస్టులు గుర్తించారు. -
బురారీ కేసు: ఇంటిని ఆలయంగా మార్చండి!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసు విషయంలో స్థానికులు ఓ కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. గత ఆదివారం 11 మంది మూకమ్మడిగా బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికులు భయంతో చచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల్లో నివసించే చాలా మంది ఇతర ప్రదేశాలకు తరలి వెళ్లారు. ప్రస్తుతం ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆ ఇంటిని తీసుకోడానికి బంధువులు సైతం విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటిని ఏం చేయాలనే విషయంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనతో ఆ ఇంటిని కొనుగోలు చేయడానికి కూడా ఎవరూ ముందుకు రారని, ఆ ఇంటిని దేవాలయంగా మార్చడమే ఉత్తమమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దీనిపై మృతుల బంధువు కేతన్ నాగ్‌పాల్ స్పందిస్తూ.. ఇంటి గురించి ఇంకా ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై బంధువులతో చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని, పోలీసులు ఆధీనంలో ఉన్న ఇంటిని ఎప్పుడు అప్పజెప్పుతారనే విషయం తెలియదన్నారు. మృతురాలు నారాయణ్ దేవి మరో కుమార్తె, కుమారుడు పానిపట్, ఛిత్తోర్‌గఢ్‌లో స్థిరపడ్డారు. దీంతో వారు ఈ ఇంటిని తీసుకోడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. నవీన్ బాత్రా అనే స్థానికుడు మాట్లాడుతూ.. తన 21 ఏళ్ల కూతురు ఈ ఘటన అనంతరం భయంతో వణికిపోతుందని, లైట్ లేనిది ఇంట్లో ఉండలేక పోతుందని, చివరకు వాష్ రూం డోర్ పెట్టుకోడానికి కూడా భయపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ ఇంటికి పోలీసులు వస్తుండటం, టీవీ చానెళ్లో పదే పదే రావడం కూడా స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. చిన్నారులను బలవంతంగా చంపారు! ఇక ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో విస్తుగొలిపే విషయాలు వెల్లడవుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీలో చిన్నారులను ఆత్మహత్య చేసుకునేలే వారిపై ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. 15 ఏళ్ల ధృవ్, శివమ్లిద్దరికి బలవంతంగా ఊరితాడు బిగించారని దీంతోనే వారి శరీరాలపై గాయాలైనట్లు పోలీసులు వాపోతున్నారు. ఈ ఫుటేజీలో ఆ 11 మంది స్టూల్స్, వైర్ల పట్టుకెళ్లినట్లు స్పష్టంగా తెలుస్తోంది. -
బురారీ కేసులో 12వ వ్యక్తి??
సామూహిక మరణాల కేసు(బురారీ కేసు) దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కొత్త అనుమానాలు వ్యక్తం కావటంతో బురారీ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. లలిత్ భాటియా మభ్యపెట్టడంతోనే కుటుంబ సభ్యులంతా ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారన్న కోణం ఒకటి కాగా, ఈ వ్యవహారంలో మరో వ్యక్తి ప్రమేయం ఉండి ఉంటుందన్నది రెండో కోణం. అందుకు కారణం ఆత్మహత్యకు ముందు ఇంట్లో పూజలు నిర్వహించినట్లు ఉండటం. (...విచిత్రంగా ప్రవర్తించేవాళ్లు) సాక్షి, న్యూఢిల్లీ: భాటియా కుటుంబం ఆత్మహత్యకు ముందు ఇంట్లో ‘వటవృక్ష’ పూజ నిర్వహించారు. సాధారణంగా పూజారుల సమక్షంలోనే దీనిని నిర్వహిస్తుంటారు. దీంతో బయటి నుంచి వచ్చిన వ్యక్తే ఈ పూజను నిర్వహించి ఉంటాడని భావిస్తున్నారు. మోక్షం కోసం భగవంతుడ్ని చేరేందుకు దగ్గరి దారి ఇదేనని ప్రలోభానికి గురి చేసి ఉంటారా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో సదరు వ్యక్తి పూజ ముగిశాక ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భాటియా కుటుంబం తరచూ ఇటువంటి పూజలు నిర్వహించేదని, కొందరు స్వామీజలు వారి ఇంటికి వచ్చే వారని గతంలో ఇంట్లో పని చేసిన వాళ్లు చెబుతున్నారు. దీంతో 12వ వ్యక్తి మిస్టరీ చేధించే పనిలో పడ్డారు. మానసిక రుగ్మతే!... 2007లో నారాయణ్ దేవి(77) భర్త మృతి చెందారు. ఆయన మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. ముఖ్యంగా లలిత్ భాటియా మానసిక స్థితి పూర్తిగా దెబ్బతింది. తండ్రి ఫొటోతో మాట్లాడడం, ఆయన ఆదేశాలు ఇచ్చాడంటూ వాటిని ఓ పుస్తకంలో రాయడం చేస్తుండేవాడు. ‘తండ్రి తన కలలో కనిపించాడని, మాట్లాడాడని, ఆయన ఆత్మ ఆవహించిందని చెబుతూ కుటుంబ సభ్యులను కూడా అదే దారిలో నడిపించాడు. క్రమంగా తన రుగ్మతను కుటుంబ సభ్యులకూ అంటించాడు. ‘అంతిమ సమయంలో మన కోర్కెలు నెరవేరేటప్పుడు ఆకాశం బద్దలవుతుంది.భూమి కంపిస్తుంది. అయినా ఎవరూ భయపడొద్దు. నేనొచ్చి రక్షిస్తా’ పుస్తకాల్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఈ రెండు కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు.. వీలైనంత త్వరలో కేసులో చిక్కుముడి విప్పుతామని డీసీపీ వెల్లడించారు. మరోవైపు భాటియా ఇంట్లో దొరికిన నోట్ బుక్‌లను విశ్లేషించిన మానసిక నిపుణులు.. వాటిని అధ్యయనం చేసే పనిలో ఉన్నారు. సీసీటీవీలో షాకింగ్ విజువల్స్... ఆ పైపుల సంగతేంటి? -
ఆ మరణాలకు కారణమదేనా?
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బురారీ ప్రాంతం లో ఉన్న ఇంట్లో అనుమానాస్పదంగా చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకూ ‘ఉమ్మడి భ్రమ’ (షేర్డ్ సైకోసిస్) వంటి మానసిక వ్యాధి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ ‘ఉమ్మడి భ్రమ అంటే అది ముందు ఒక వ్యక్తికి మొదలై ఆ తర్వాత ఇతరులకు కూడా పాకుతుంది. ఈ కుటుంబం విషయానికి వస్తే లలిత్ భాటియా తండ్రి చనిపోయినప్పటికీ.. తాను తన తండ్రితో మాట్లాడుతున్నట్లు భ్రమపడేవాడనీ, ఆ తర్వాత కుటుంబలోని మిగతా సభ్యులు కూడా ఆయనను నమ్మి, అందరూ కలిసి భ్రమపడేవారని మేం అనుమానిస్తున్నాం’ అని చెప్పారు. మరోవైపు భాటియా కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వారితో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, కుటుంబ, వ్యక్తిగత విష యాలను ఎవరికీ తెలియనిచ్చే వారు కాదనీ, ఎవ్వరినీ తమ ఇంట్లోకి కూడా పిలిచేవారు కాదని ఇరుగుపొరుగువారు చెప్పారు. బురారీ ప్రాంతంలోని ఇంట్లో జూలై 1న ఒకే కుటుంబానికి చెందిన 11 మృతదేహాలు కనిపించి సంచలనంగా మారడం తెలిసిందే. 10 మృతదేహాలు పై కప్పుకు వేలాడుతుండగా, ఒక ముసలావిడ శవం మాత్రం నేలపై పడి ఉంది. ఇవి హత్యలా, లేక తాంత్రిక పూజలతో మోక్షం కోసం అందరూ ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 11 పైపుల కథేంటి? మృతదేహాలు కనిపించిన ఇంటి గోడకు 11 పైపులు అమర్చి, వాటికి ఎలాంటి కనెక్షన్ ఇవ్వకపోవడం తమకు కూడా వింతగా అనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. పైపులను నాలుగు నెలల క్రితమే అమర్చారని తెలిపారు. లోపలికి గాలి రావడం కోసం, ప్లైవుడ్ రసాయనాల నుంచి వచ్చే విషవాయువులను బయటకు పంపడం కోసం ఆ పైపులను ఏర్పాటుచేసినట్లు భాటియా కుటుంబసభ్యులు అప్పట్లో చెప్పారని స్థానికులు వెల్లడించారు. అయితే ఆ 11 పైపులు అమర్చిన విధానం చూస్తుంటే కూడా వింతగా ఉంది. చనిపోయాక గాలితో కలిసి ఆత్మలు బయటకు వెళ్లేందుకే వారు ఆ పైపులను ఏర్పాటు చేసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. 11లో 7 పైపులు ఒక పరిమాణంలో, 4 పైపులు మరో పరిమాణంలో ఉన్నాయి. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. ఏడు పైపులను కొంచెం వంచి రంధ్రాలు నేలవైపుకు ఉండేలా అమర్చగా, నాలుగు పైపులు మాత్రం వంపు లేకుండా గోడ నుంచి చొచ్చుకొచ్చి అలాగే ఉండిపోయాయి. రెండు పైపులు మాత్రం దూరంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు వితంతువులున్నందునే ఇలా దూరంగా అమర్చి ఉంటారంటున్నారు. -
ధోనిసేన గెలిచిందోచ్!
► ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నెగ్గిన పుణే సూపర్ జెయింట్స్ ► రాణించిన రహానే సీజన్ ఆరంభం నుంచి నిలకడలేమి... గాయాలతో స్టార్ క్రికెటర్లు దూరం... జట్టులో అనేక మార్పులు... అంతా గందరగోళం... ఇలాంటి స్థితిలో ఉన్న పుణే సూపర్ జెయింట్స్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. జట్టులో కొత్తగా చేరిన క్రికెటర్లు రాణించడంతో పాటు... రహానే నిలకడ కొనసాగించడంతో ఢిల్లీపై నెగ్గి సీజన్లో మూడో విజయం సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: యువ క్రికెటర్ల రాణింపుతో సంచలన విజయాలు సాధిస్తున్న ఢిల్లీ డేర్‌డెవిల్స్ జోరుకు పుణే సూపర్ జెయింట్స్ బ్రేక్ వేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ధోనిసేన ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీపై నెగ్గింది. టాస్ గెలిచిన పుణే ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. డుమిని (32 బంతుల్లో 34; 1 ఫోర్), కరుణ్ నాయర్ (23 బంతుల్లో 32; 5 ఫోర్లు) రాణించారు. పుణే బౌలర్లలో బోలాండ్, భాటియా రెండేసి వికెట్లు తీసుకున్నారు. పుణే జట్టు 19.1 ఓవర్లలో మూడు వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ రహానే (48 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ అజేయంగా అర్ధసెంచరీ చేయగా... తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఖవాజా (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించాడు. ధోని (20 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తలా ఓ చేయి... గత మ్యాచ్‌లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన పంత్ (2) ఈసారి విఫలం కావడంతో ఆరంభంలోనే ఢిల్లీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే సంజు శామ్సన్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు), కరుణ్ నాయర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించి పరిస్థితిని సరిదిద్దారు. డుమిని, బిల్లింగ్స్ (15 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా రాణించడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే పుణే బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో ఢిల్లీని నియంత్రించే ప్రయత్నం చేశారు. బ్రాత్‌వైట్ (8 బంతుల్లో 20) మూడు భారీ సిక్సర్లతో చెలరేగడంతో మ్యాచ్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగినా... ఆరు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు తీసి పుణే బౌలర్లు కట్టడి చేశారు. చివరి ఓవర్లో నెగి (12 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీకి గౌరవప్రదమైన స్కోరు లభించింది. రాణించిన టాపార్డర్ కొత్తగా జట్టుతో చేరిన ఖవాజా కుదురుకునేందుకు సమయం తీసుకోగా... ఫామ్‌లో ఉన్న పుణే ఓపెనర్ రహానే పవర్‌ప్లేలో చెలరేగి ఆడాడు. క్రమంగా ఖవాజా కూడా బ్యాట్ ఝళిపించడంతో పవర్‌ప్లేలో పుణే వికెట్ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. మిశ్రా బౌలింగ్‌లో ఖవాజా అవుటయ్యాక... సౌరవ్ తివారీ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో రహానే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 45 పరుగులు జోడించాక తివారీ అవుటయ్యాడు. ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలబడ్డ రహానే 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు వచ్చిన ధోని భారీ సిక్సర్‌తో ఫామ్‌లో కనిపించాడు. పుణే విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు అవసరమైన దశలో... షమీ బౌలింగ్‌లో ధోని వరుసగా ఫోర్, సిక్సర్ కొట్టడంతో ఒకే ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్ తొలి బంతికి ధోని భారీ షాట్ ఆడినా... బిల్లింగ్స్ కళ్లుచెదిరే క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు. పెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్; 2 సిక్సర్లు) రెండు భారీ సిక్సర్లు బాది... ఎలాంటి నష్టం జరగకుండా పుణే విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: రిషబ్ పంత్ (బి) దిండా 2; శామ్సన్ (సి) ఆర్. అశ్విన్ (బి) బోలాండ్ 20; కరుణ్ నాయర్ (సి) పెరీరా (బి) భాటియా 32; డుమిని రనౌట్ 34; బిల్లింగ్స్ (సి) రహానే (బి) భాటియా 24; బ్రాత్‌వైట్ (సి) పెరీరా (బి) బోలాండ్ 20; పవన్ నెగి నాటౌట్ 19; జయంత్ రనౌట్ 1; షమీ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1-13; 2-48; 3-65; 4-110; 5-137; 6-138; 7-143. బౌలింగ్: దిండా 4-0-34-1; పెరీరా 1-0-9-0; బోలాండ్ 4-0-31-2; ఆర్.అశ్విన్ 4-0-34-0; భాటియా 4-0-22-2; ఎం.అశ్విన్ 3-0-31-0. పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే నాటౌట్ 63; ఖవాజా (స్టం) శామ్సన్ (బి) మిశ్రా 30; సౌరవ్ తివారీ (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 21; ధోని (సి) బిల్లింగ్స్ (బి) తాహిర్ 27; పెరీరా నాటౌట్ 14; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (19.1 ఓవర్లలో మూడు వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-59; 2-104; 3-146. బౌలింగ్: జయంత్ 4-0-25-0; బ్రాత్‌వైట్ 2-0-17-0; షమీ 3.1-0-50-0; అమిత్ మిశ్రా 4-0-28-1; డుమిని 1-0-9-0; తాహిర్ 4-0-26-2; నెగి 1-0-10-0.