Vanisha Mittal And Amit Bhatia Love Story In Telugu, Know About Their Marriage Specialities - Sakshi
Sakshi News home page

Vanisha Mittal Amit Bhatia Love Story: వనీషా...అమిత్‌ లవ్‌ స్టోరీ తెలుసా? ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి ఒక రికార్డ్‌  

Published Fri, Apr 28 2023 1:07 PM | Last Updated on Fri, Apr 28 2023 3:21 PM

Vanisha Mittal Amit Bhatia love story who spent Rs 240 crore on her wedding - Sakshi

రూ.1.38 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు వనీషా మిట్టల్‌. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో  ఒకరైన ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ కుమార్తె వనీషా. కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు వనీషా. డిసెంబర్ 2004లో మిట్టల్ స్టీల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి నియమితులయ్యారు ఏప్రిల్ 2011లో అపెరమ్ అనే కంపెనీలో చేరారు. అప్పటి నుండి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అయితే 2004లో అత్యంత అట్టహాసంగా జరిగిన వనీషా  వివాహం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది.  అత్యంత ఖరీదైన వివాహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చేరింది.

వనీషా, అమిత్‌  పెళ్లి: రికార్డులు, విశేషాలు
ప్రియుడు, అమిత్ భాటియాని 20004లో వనీషా వివాహమాడింది. వనీషా వివాహానికి  స్టీల్‌దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ రూ. 240 కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుత వాల్యుయేషన్ ప్రకారం దీని ధర రూ.550 కోట్లకు పైగా ఉంటుంది. పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ సన్నాహాలకే ఒక ఏడాది పట్టిందంటేనే ఈ వెడ్డింగ్‌ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పెళ్లిలో ప్రతి అంశం ఒక విశేషం. ఆరు రోజుల పాటు వివాహ కార్యక్రమాలు జరిగాయి.  ప్రిన్స్ విలియం తన వివాహానికి ఖర్చు చేసిన దానికంటే  కూడా ఇది ఎక్కువట. (మైక్రోసాఫ్ట్‌ గుడ్‌ న్యూస్‌: సైబర్‌ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ)

పెళ్లిలో 30 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడానికి కైలీ మినోగ్‌కు ఏకంగా  330,000 డాలర్లు చెల్లించారట.  పాపులర్‌ బాలీవుడ్ స్టార్లు కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు.
 

♦ 1500 మంది అతిథుల బస, ప్రయాణ ఖర్చులను మిట్టల్‌ కుటుంబం చెల్లించింది. 
 వెడ్డింగ్ డ్యాన్స్ స్టెప్స్ నేర్పించేందుకు కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ పెళ్లికి వెళ్లింది. జావేద్ అక్తర్ ఒక నాటకాన్ని రచించగా మిట్టల్ కుటుంబం యాక్ట్‌ చేసింది. 
బాలీవుడ్‌ హీరోయిన్‌లు, సూపర్‌ స్టార్లు స్పెషల్‌ గెస్ట్స్‌గా హాజరయ్యారు. అలాగే జూహీ చావ్లా, రాణిముఖర్జీ, సైఫ్ అలీఖాన్, షారూఖ్ చేసిన స్పూఫ్‌కి కోట్ల రూపాయలు 
♦  వివాహ వేడుకలో కూడా ఐశ్వర్యరాయ్  ప్రదర్శన  (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్​: టెక్‌ సీఈవోలు, ఐపీఎల్‌ ఆటగాళ్లను మించి .!)
అతిథులకు వడ్డించే రుచికరమైన వంటలకోసం  పాపులర్‌ చెఫ్ మున్నా మహారాజ్‌ను ప్రత్యేకంగా పిలిపించారు. 

20పేజీల సిల్వర్‌ ఇన్విటేషన్‌ బాక్స్‌,  పారిస్‌కు టిక్కెట్లు 
ఇదంతా ఒక ఎత్తయితే..అతిథులందరికీ 20 పేజీల ఆహ్వాన కార్డులను సిల్వర్‌ బాక్స్‌లో పెట్టి అందించడం మరో ఎత్తు.  ఇందులో  పారిస్‌కు వెళ్లే వారి విమాన టిక్కెట్‌లు, అవాంట్-గార్డ్ ఇంటర్‌కాంటినెంటల్ ప్యారిస్‌లో బస వివరాలు కూడా ఉన్నాయి. దీనికి ముందు ప్రత్యేక అనుమతులుతీసుకొని మరీ ఎంగేజ్‌మెంట్ వేడుక వెర్సైల్స్ ప్యాలెస్‌లో, సంగీత్‌ వేడుకులను పారిస్‌లోని 500 ఏళ్ల నాటి టుయిలరీస్ గార్డెన్‌లో  ఘనంగా నిర‍్వహించారు. 

వనీషా మిట్టల్‌
1980 ఆగస్టు 23న పుట్టింది వనీషా మిట్టల్‌.ఆమె సోదరుడి పేరు ఆదిత్య మిట్టల్. యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేసింది. అమిత్‌కు క్రీడలంటేచాలా ఇష్టం. వనీషా, అమిత్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్‌: సంబరాల్లో ఉద్యోగులు)

అమిత్‌ భాటియా
అమిత్ భాటియా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో 1979 సెప్టెంబరు 4న జన్మించారు. కానీ 1995 వరకు ఢిల్లీలో కొలంబా స్కూల్‌లో, 1996లో లండన్‌లోని దుల్విచ్ కాలేజ్,1997లో ఢిల్లీ బ్రిటీష్ స్కూల్‌లో విద్యాభ్యాసం సాగింది.  యూకేలో అతిపెద్ద సిమెంట్‌ కంపెనీ హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు అమిత్‌. దీంతోపాటు స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్‌మెంట్స్, ది గ్లోబల్ రిలీఫ్ ఇనిషియేటివ్ ఫౌండర్‌ కూడా అమిత్‌కు క్రీడలంటే ముఖ్యంగా గోల్ఫ్‌, క్రికెట్‌, ఫుట్‌బాల్‌ అంటే ఇష్టం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్ (క్యూపీఆర్‌)  ఫౌండర్‌ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే మామ మిట్టల్‌ ఛాంపియన్‌ ట్రస్ట్‌ ఏర్పాటులో కూడా అమిత్‌ది కీలక పాత్ర అని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. వనీషా, అమిత్‌ల పరిచయం ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. దీంతో ఈ లవ్‌బర్డ్స్‌ ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు కలకాలం గుర్తుండిపోయేలా అత్యంత వైభంగా మూడుముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement