Lakshmi Niwas Mittal
-
హాజీరా స్టీల్ ప్లాంటు పనులు వేగవంతం
అహ్మదాబాద్: హాజీరా ఉక్కు ప్లాంటు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆర్సెలర్‌మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీనివాస్ మిట్టల్ తెలిపారు. ఇది 2026 నాటికల్లా అందుబాటులోకి రాగలదని ’వైబ్రెంట్ గుజరాత్’ సదస్సు 20 ఏళ్ల వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టులో దాదాపు 20,000 మంది పైచిలుకు వర్కర్లు పాలుపంచుకుంటున్నారని మిట్టల్ చెప్పారు. ఆర్సెలర్‌మిట్టల్‌లో భాగమైన ఏఎంఎన్ఎస్ ఇండియా గతేడాది అక్టోబర్‌లో హాజీరా ప్లాంటు సామరŠాధ్యలను 15 మిలియన్ టన్నులకు పెంచుకునేందుకు రూ. 60,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, తొలి దశలో ఉత్పత్తిని రెట్టింపు చేయాలని, ఆ తర్వాత మూడింతలు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు మిట్టల్ చెప్పారు. భారత్ దిగుమతులను తగ్గించుకుని, స్వావలంబన సాధించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. జీ20 సదస్సు విజయవంతం కావడం భారత్ ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేసిందని మిట్టల్ చెప్పారు. అటు, గుజరాత్లో సామాజిక–ఆర్థిక అభివృద్ధికి, పెట్టుబడుల రాకకు ఇన్వెస్టర్ల సదస్సు ఎంతగానో ఉపయోగపడుతోందని వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా వెల్స్పన్ సంస్థ చైర్మన్ బీకే గోయెంకా తెలిపారు. సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్‌పై కసరత్తు చేసేందుకు జపానీస్ వ్యాపార బృందాన్ని నవంబర్‌లో ఆహా్వనించే యోచనలో ఉన్నట్లు జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ తకాషి సుజుకీ తెలిపారు. తదుపరి వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సదస్సు వచ్చే ఏడాది జనవరి 10–12 మధ్య గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. -
వనీషా...అమిత్ లవ్ స్టోరీ తెలుసా? ఈ లవ్ బర్డ్స్ పెళ్లి ఒక రికార్డ్
రూ.1.38 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు వనీషా మిట్టల్. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో ఒకరైన ఉక్కు వ్యాపారి లక్ష్మీ నివాస్ మిట్టల్ కుమార్తె వనీషా. కంపెనీకి నాన్-ఎగ్జిక్యూటివ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు వనీషా. డిసెంబర్ 2004లో మిట్టల్ స్టీల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కి నియమితులయ్యారు ఏప్రిల్ 2011లో అపెరమ్ అనే కంపెనీలో చేరారు. అప్పటి నుండి చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. అయితే 2004లో అత్యంత అట్టహాసంగా జరిగిన వనీషా వివాహం అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచింది. అత్యంత ఖరీదైన వివాహంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చేరింది. వనీషా, అమిత్ పెళ్లి: రికార్డులు, విశేషాలు ప్రియుడు, అమిత్ భాటియాని 20004లో వనీషా వివాహమాడింది. వనీషా వివాహానికి స్టీల్దిగ్గజం లక్ష్మీ నివాస్ మిట్టల్ రూ. 240 కోట్లకు పైగా ఖర్చు చేయడం విశేషంగా నిలిచింది. ప్రస్తుత వాల్యుయేషన్ ప్రకారం దీని ధర రూ.550 కోట్లకు పైగా ఉంటుంది. పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ సన్నాహాలకే ఒక ఏడాది పట్టిందంటేనే ఈ వెడ్డింగ్ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ పెళ్లిలో ప్రతి అంశం ఒక విశేషం. ఆరు రోజుల పాటు వివాహ కార్యక్రమాలు జరిగాయి. ప్రిన్స్ విలియం తన వివాహానికి ఖర్చు చేసిన దానికంటే కూడా ఇది ఎక్కువట. (మైక్రోసాఫ్ట్ గుడ్ న్యూస్: సైబర్ సెక్యూరిటీలో వారికి ప్రత్యేక శిక్షణ) ♦ పెళ్లిలో 30 నిమిషాల పాటు ప్రదర్శన ఇవ్వడానికి కైలీ మినోగ్‌కు ఏకంగా 330,000 డాలర్లు చెల్లించారట. పాపులర్ బాలీవుడ్ స్టార్లు కూడా వివాహ వేడుకలో పాల్గొన్నారు. ♦ 1500 మంది అతిథుల బస, ప్రయాణ ఖర్చులను మిట్టల్ కుటుంబం చెల్లించింది. ♦ వెడ్డింగ్ డ్యాన్స్ స్టెప్స్ నేర్పించేందుకు కొరియోగ్రాఫర్ ఫర్హా ఖాన్ పెళ్లికి వెళ్లింది. జావేద్ అక్తర్ ఒక నాటకాన్ని రచించగా మిట్టల్ కుటుంబం యాక్ట్ చేసింది. ♦ బాలీవుడ్ హీరోయిన్లు, సూపర్ స్టార్లు స్పెషల్ గెస్ట్స్‌గా హాజరయ్యారు. అలాగే జూహీ చావ్లా, రాణిముఖర్జీ, సైఫ్ అలీఖాన్, షారూఖ్ చేసిన స్పూఫ్కి కోట్ల రూపాయలు ♦ వివాహ వేడుకలో కూడా ఐశ్వర్యరాయ్ ప్రదర్శన (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) ♦ అతిథులకు వడ్డించే రుచికరమైన వంటలకోసం పాపులర్ చెఫ్ మున్నా మహారాజ్‌ను ప్రత్యేకంగా పిలిపించారు. 20పేజీల సిల్వర్ ఇన్విటేషన్ బాక్స్, పారిస్‌కు టిక్కెట్లు ఇదంతా ఒక ఎత్తయితే..అతిథులందరికీ 20 పేజీల ఆహ్వాన కార్డులను సిల్వర్ బాక్స్‌లో పెట్టి అందించడం మరో ఎత్తు. ఇందులో పారిస్‌కు వెళ్లే వారి విమాన టిక్కెట్లు, అవాంట్-గార్డ్ ఇంటర్కాంటినెంటల్ ప్యారిస్‌లో బస వివరాలు కూడా ఉన్నాయి. దీనికి ముందు ప్రత్యేక అనుమతులుతీసుకొని మరీ ఎంగేజ్మెంట్ వేడుక వెర్సైల్స్ ప్యాలెస్‌లో, సంగీత్ వేడుకులను పారిస్‌లోని 500 ఏళ్ల నాటి టుయిలరీస్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. వనీషా మిట్టల్ 1980 ఆగస్టు 23న పుట్టింది వనీషా మిట్టల్.ఆమె సోదరుడి పేరు ఆదిత్య మిట్టల్. యూరోపియన్ బిజినెస్ స్కూల్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్ పూర్తి చేసింది. అమిత్‌కు క్రీడలంటేచాలా ఇష్టం. వనీషా, అమిత్ దంపతులకు ముగ్గురు పిల్లలు. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) అమిత్ భాటియా అమిత్ భాటియా యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో 1979 సెప్టెంబరు 4న జన్మించారు. కానీ 1995 వరకు ఢిల్లీలో కొలంబా స్కూల్లో, 1996లో లండన్‌లోని దుల్విచ్ కాలేజ్,1997లో ఢిల్లీ బ్రిటీష్ స్కూల్లో విద్యాభ్యాసం సాగింది. యూకేలో అతిపెద్ద సిమెంట్ కంపెనీ హోప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు అమిత్. దీంతోపాటు స్వోర్డ్ ఫిష్ ఇన్వెస్ట్మెంట్స్, ది గ్లోబల్ రిలీఫ్ ఇనిషియేటివ్ ఫౌండర్ కూడా అమిత్‌కు క్రీడలంటే ముఖ్యంగా గోల్ఫ్, క్రికెట్, ఫుట్‌బాల్ అంటే ఇష్టం. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ క్వీన్స్ పార్క్ రేంజర్స్ (క్యూపీఆర్) ఫౌండర్ చైర్మన్‌గా ఉన్నారు. అలాగే మామ మిట్టల్ ఛాంపియన్ ట్రస్ట్ ఏర్పాటులో కూడా అమిత్‌ది కీలక పాత్ర అని పరిశ్రమ వర్గాలు చెబుతాయి. వనీషా, అమిత్‌ల పరిచయం ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. దీంతో ఈ లవ్‌బర్డ్స్ ప్రేమను అర్థం చేసుకున్న ఇరు కుటుంబాలు కలకాలం గుర్తుండిపోయేలా అత్యంత వైభంగా మూడుముళ్ల వేడుకను ముచ్చటగా జరిపించారు. View this post on Instagram A post shared by Amit Bhatia (@amitbhatia100) -
వైజాగ్ స్టీల్‌పై ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ దృష్టి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ వైజాగ్ స్టీల్ (ఆర్ఐఎన్ఎల్)పై ప్రైవేట్ రంగ ఉక్కు దిగ్గజం ఏఎంఎన్ఎస్ ఇండియా (ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్) సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, కంపెనీ మాత్రం ఈ విషయం ్ర«ధువీకరించలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఏఎంఎన్ఎస్ మాతృ సంస్థ ఆర్సెలర్‌మిట్టల్ చైర్మన్ లక్ష్మి నివాస్ మిట్టల్ భేటీ అవుతున్నట్లు ఏఎంఎన్ఎస్ గురువారం ట్వీట్ చేసింది. అయితే, సమావేశ వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్‌పై కంపెనీ దృష్టి పెట్టిందన్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుజరాత్‌లోని ఏఎంఎన్ఎస్ ఇండియాలో ఆర్సెలర్‌మిట్టల్‌కు 60 శాతం, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్‌కు 40 శాతం వాటాలు ఉన్నాయి. వైజాగ్ స్టీల్‌పై ఆసక్తిగా ఉన్నట్లు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. తూర్పు తీరంలో ఉన్న ఆర్ఐఎన్ఎల్ కొనుగోలు చేస్తే ఆగ్నేయాసియా మార్కెట్లలోకి మరింత చొచ్చుకుపోయేందుకు వీలుంటుందని భావిస్తున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఇటీవల తెలిపారు. వైజాగ్ స్టీల్‌లో 100 శాతం వాటాల విక్రయ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ.790 కోట్లు ఖర్చు
సాక్షి, వెబ్‌డెస్క్: దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పెనవేసుకుపోయింది. రెండు మనసులను.. రెండు కుటుంబాలను.. మూడు ముళ్లతో పెనవేస్తుంది వివాహ బంధం. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. నిశ్చితార్థం వేడుక నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు ప్రతి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఉవ్విళ్లురతారు. అందుకే తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. కొన్ని సార్లు అంతకుమించే ఖర్చు చేస్తారు. అయితే కొన్ని పెళ్లి వేడుకలు ఖర్చు విషయంలో ఏకంగా చరిత్ర సృష్టించాయి. మరి ఆ వేడుకలు ఎక్కడ.. ఎవరింట జరిగాయి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. 1.ప్రిన్సెస్ డయానా-చార్లెస్ వివాహ వేడుక బ్రిటన్ రాజవంశంలోనే కాక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది డయానా-చార్లెస్‌ల పెళ్లి. 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. అప్పట్లోనే వీరి పెళ్లి కోసం ఏకంగా 48 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో అది ఏకంగా 100 మిలియన్ డాలర్ల కన్న ఎక్కువ అనగా సుమారు 790 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 2. వనిషా మిట్టల్-అమిత్ భాటియా వివాహం ప్రపంచ ఉక్కు రారాజు, ఇంగ్లండ్‌లోనే అత్యంత ధనవంతుడే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న లక్ష్మి నివాస్ మిట్టల్ కుమార్తె వనిషా వివాహానికి ఏకంగా 55 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 2004లో వనిషా-అమిత్ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి 20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది. 3. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్ల పెళ్లి వేడుక ప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుక బ్రిటన్ రాజకుటుంబంలోనే జరిగింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్ విలియం వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకగా నిలిచింది. ప్రిన్స్ విలియం-కేట్ మిడిల్టన్లు 29, ఏప్రిల్, 2011న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట. 4. ఇషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహం ఆసియా కుబేరుడు, భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, బాలీవుడ్ నటులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం 12, డిసెంబర్, 2018 న జరిగింది. తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది. 5. లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహం.. అమెరికన్ గాయని, నటి లిసా 2002 లో ఒక అమెరికన్ టీవీ షో నిర్మాత డేవిడ్ గెస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేశారు. 6. ఎలిజబెత్ టేలర్-లారీ ఫోర్టెన్స్కీ హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలిజబెత్ స్నేహితుడు, పాప్ మహారాజు మైఖేల్ జాక్సన్, నెవర్‌ల్యాండ్ రాంచ్లో జరిగింది. వీరి వివాహ వేడుక కోసం 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. అయితే, వివాహం అయిన 5 సంవత్సరాలకే వారు విడాకులు తీసుకున్నారు. -
నరసరావుపేటలో నాటి తుక్కు డీలర్.. మిట్టల్
ఎంతటి మహా ప్రయాణానికైనా మొదలు మొదటి అడుగే. ఈ విషయాన్ని ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగి గొప్పవారైన ఎందరో నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ఉక్కు దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మి నారాయణ్ మిట్టల్ అలియాస్ లక్ష్మి నివాస్ మిట్టల్ ఉదంతం ఒకటి నిరూపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఒహియొ రాష్ట్రంలోని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీని ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా గురువారం నాడు సందర్శించారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టినందుకు, కొత్తగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఆయన మిట్టల్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకుగాను, మిట్టల్ ఫ్యాక్టరీల్లో సంతోషపడొచ్చు, మా గడ్డ మీద పుట్టిన బిడ్డ కదా అని రాజస్థాన్ వాళ్లో, మా దగ్గర పెరిగాడు కదా అని కలకత్తా వాళ్లో అనంద పడితే ఫర్లేదు. కానీ, ఎక్కడో ఆంధ్రాలో మారుమూల నరసరావుపేట అనే పట్టణం మురిసిపోయింది ఎందుకు? ఎందుకో చెప్పుకొచ్చారు, వావిలాల రామలింగం: 'ఆనాడు వ్యాపార నిమిత్తం లక్ష్మి మిట్టల్ ఈ ప్రాంతానికి రావడం, మా నరసరావుపేటలో విడిది చేయడం వల్ల, ఆయన విజయాల్ని మావిగానే భావిస్తాం.' రాజకీయ విశ్లేషకులు, 1960లలో కాంగ్రెస్ నాయకులు అయిన రామలింగం చెప్పినదాన్ని బట్టి చూస్తే.. బ్రిటన్ కు చెందిన ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ ప్రోద్బలంతో లండన్ వెళ్లక ముందు, మిట్టల్ ఒక స్క్రాప్ డీలర్‌గా ఉండేవారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ పనులకు వాడే వేలాది టన్నుల ఇనుము నుంచి వచ్చే స్క్రాప్ ను కొనుగోలు చేయడానికి, అప్పటి నరసరావుపేట ఎంపీ మద్ది సుదర్శనం సూచన మేరకు మిట్టల్ ఆ ప్రాంతానికి వెళ్లారు. 'లావాదేవీ లాభదాయకంగా జరిగినందుకు ఆయన సంతోషించారు. ఆయనకు రెండ్రోజులపాటు మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం నా అదృష్టం. ఒబామా చేత ప్రశంసలు పొందటం మాకు ఎనలేని అనందాన్ని కలిగించింది ఆనాటి ఆయన స్నేహశీలతని, మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ, నాతో పాటు ఆయనని కలిసిన మిత్రులందరం ఈ రోజు చిన్న పార్టీ చేసుకున్నాం. ఆయనకి మా అభినందనలు పంపించడం కూడా ఆనవాయితీగా చేస్తుంటాం," అన్నారు రామలింగం.