నరసరావుపేటలో నాటి తుక్కు డీలర్.. మిట్టల్
నరసరావుపేటలో నాటి తుక్కు డీలర్.. మిట్టల్
Published Sat, Nov 16 2013 1:16 PM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
ఎంతటి మహా ప్రయాణానికైనా మొదలు మొదటి అడుగే. ఈ విషయాన్ని ఇప్పుడు ఎంతో ఎత్తుకు ఎదిగి గొప్పవారైన ఎందరో నిరూపిస్తూనే ఉంటారు. తాజాగా ప్రపంచ ఉక్కు దిగ్గజం, ప్రవాస భారతీయుడు లక్ష్మి నారాయణ్ మిట్టల్ అలియాస్ లక్ష్మి నివాస్ మిట్టల్ ఉదంతం ఒకటి నిరూపిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే, అమెరికా ఒహియొ రాష్ట్రంలోని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు ఫ్యాక్టరీని ఆ దేశ అధ్యక్షుడు బారక్ ఒబామా గురువారం నాడు సందర్శించారు. తమ దేశంలో పెట్టుబడులు పెట్టినందుకు, కొత్తగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించినందుకు ఆయన మిట్టల్‌ని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకుగాను, మిట్టల్ ఫ్యాక్టరీల్లో సంతోషపడొచ్చు, మా గడ్డ మీద పుట్టిన బిడ్డ కదా అని రాజస్థాన్ వాళ్లో, మా దగ్గర పెరిగాడు కదా అని కలకత్తా వాళ్లో అనంద పడితే ఫర్లేదు. కానీ, ఎక్కడో ఆంధ్రాలో మారుమూల నరసరావుపేట అనే పట్టణం మురిసిపోయింది ఎందుకు? ఎందుకో చెప్పుకొచ్చారు, వావిలాల రామలింగం: 'ఆనాడు వ్యాపార నిమిత్తం లక్ష్మి మిట్టల్ ఈ ప్రాంతానికి రావడం, మా నరసరావుపేటలో విడిది చేయడం వల్ల, ఆయన విజయాల్ని మావిగానే భావిస్తాం.'
రాజకీయ విశ్లేషకులు, 1960లలో కాంగ్రెస్ నాయకులు అయిన రామలింగం చెప్పినదాన్ని బట్టి చూస్తే.. బ్రిటన్ కు చెందిన ఎన్నారై పారిశ్రామికవేత్త లార్డ్ స్వరాజ్ పాల్ ప్రోద్బలంతో లండన్ వెళ్లక ముందు, మిట్టల్ ఒక స్క్రాప్ డీలర్‌గా ఉండేవారు. నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ పనులకు వాడే వేలాది టన్నుల ఇనుము నుంచి వచ్చే స్క్రాప్ ను కొనుగోలు చేయడానికి, అప్పటి నరసరావుపేట ఎంపీ మద్ది సుదర్శనం సూచన మేరకు మిట్టల్ ఆ ప్రాంతానికి వెళ్లారు.
'లావాదేవీ లాభదాయకంగా జరిగినందుకు ఆయన సంతోషించారు. ఆయనకు రెండ్రోజులపాటు మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడం నా అదృష్టం. ఒబామా చేత ప్రశంసలు పొందటం మాకు ఎనలేని అనందాన్ని కలిగించింది ఆనాటి ఆయన స్నేహశీలతని, మంచితనాన్ని గుర్తుచేసుకుంటూ, నాతో పాటు ఆయనని కలిసిన మిత్రులందరం ఈ రోజు చిన్న పార్టీ చేసుకున్నాం. ఆయనకి మా అభినందనలు పంపించడం కూడా ఆనవాయితీగా చేస్తుంటాం," అన్నారు రామలింగం.
Advertisement