తూర్పుగోదావరి జిల్లా రచయితల మహాసభలు 1972లో కాకినాడలో జరిగాయట. మొక్కపాటి నరసింహ శాస్త్రి అధ్యక్షపీఠం అలంకరించారట. పదింటికి ప్రారంభమైన సభ సాగి సాగి ఒంటిగంట వరకు నడిచింది. ఎజెండాలో చివరి అంశం ‘దివంగతులైన కవి ప్రముఖులకు సంతాపం ప్రకటించడం’. ప్రతినిధులు ఏయే దేశాల్లో ఎవరెవరు రచయితలు మరణించారో జాబితా తయారు చేస్తున్నారు. ఇవతలేమో భోజన సమయం మించిపోతోంది. ఈ పరిస్థితిలో మొక్కపాటి మైకు అందుకుని, ‘అయ్యా! మీరు ఇక ఎంతమాత్రం జాప్యం చేసినా నా పేరు కూడా ఆ జాబితాలో చేర్చవలసి వస్తుంది’ అన్నారుట, అసహనాన్ని హాస్యంగా మలుస్తూ.
డా‘‘ దన్నాన అప్పలనాయుడు
∙
Comments
Please login to add a commentAdd a comment