
సాక్షి,హైదరాబాద్: మొదటి సారిగా అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ వెల్‌నెస్ (ఐహెచ్‌డబ్ల్యూ)–22 సదస్సు హైదరాబాద్‌లో జరగనుంది. హార్ట్‌ఫుల్‌నెస్, దాని సహాయక సంస్థలతో కలిసి జరిగే ఈ సదస్సు డిసెంబర్ 16–18 తేదీల్లో హార్ట్‌ఫుల్‌నెస్ ప్రధాన కార్యా లయం కన్హా శాంతివనంలో నిర్వహించనున్నా మని ఆ సంస్థ తెలిపింది.
సదస్సుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ, తెలంగాణ ఉద్యానవన శాఖ, రామయ్య యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్, ఎయిమ్స్ రాయ్‌పూర్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ మద్దతుని స్తున్నాయి. ఈ కాన్ఫరెన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా 3 వేల మంది హాజరయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇందులో వైద్యులు, నర్సు లు, అనుబంధ ఆరోగ్య సంరక్షణ నిపు ణులు, వర్ధమాన పరిశోధకులు, విద్యార్థులు, నాన్ ఫార్మాస్యూటికల్ విధానాల ఔత్సాహికులు పాల్గొంటారని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment