
హైదరాబాద్: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు, ఆర్థిక ప్రణాళికలు, ఇన్వెస్ట్‌మెంట్స్ నిర్వహణ వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు ఈ సారి నెల్లూరులో జరగనుంది. ఈ నెల 16న ఆదివారం నెల్లూరులోని వాహబ్‌పేట్‌లోని హోటల్ భవానీ రెసిడెన్సీలో సాక్షి–మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సు జరగనుంది.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ సదస్సుకు పెట్టుబడులపై ఆసక్తి ఉన్నవారెవరైనా హాజరుకావచ్చు. ప్రవేశం ఉచితం. ఈ కార్యక్రమంలో సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి, కార్వీ స్టాక్ బ్రోకింగ్ జనరల్ మేనేజర్ ఎల్ రాజేశ్, వైస్ ప్రెసిడెంట్ ఎస్ వెంకట శ్రీనివాస్ రెడ్డి తదితరులు పా ల్గొని ఇన్వెస్టర్లకు సలహాలు, సూచనలు ఇస్తారు.