
సాక్షి, హైదరాబాద్: సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2021’ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ‘నెట్‌జీరో బిల్డింగ్–బిల్ట్ ఎన్విరాన్‌మెంట్’ థీమ్‌తో వర్చువల్‌లో ఈ సదస్సును నిర్వహిం చనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఈ సదస్సులో 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 500లకు పైగా హరిత భవనాల ఉత్పత్తుల ప్రదర్శన, బృంద చర్చలు, ఉపన్యాసాలుంటాయి. సీఐఐ–ఐజీబీసీ చైర్మన్ వీ సురేష్, వైస్ చైర్మన్ గుర్మిత్‌సింగ్ అరోరా, మాజీ ప్రెసిడెంట్ జంషెడ్ ఎన్ గోద్రె జ్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్ట ర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, కో–చైర్మన్ అభయ శంకర్ తదితరులు పాల్గొననున్నారు.
కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 2001లో ఐజీబీసీని ఏర్పాటు చేసింది. దేశంలో హరిత భవనాల నిర్మాణం, అభివృద్ధి, ఉత్పత్తుల పరిశోధన, అవగాహన వంటివి చేపడుతుంది. ప్రస్తుతం దేశంలో 6,781 ప్రాజెక్‌లు, 786 కోట్ల చదరపు అడుగుల హరిత భవనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment