Green Buildings
-
సిటీ.. గో గ్రీన్
హరితభవనాలుగా నివాస, వాణిజ్య, కార్యాలయాలుస్వచ్ఛమైన గాలి.. ఫుల్ వెంటిలేషన్.. చుట్టూ ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఇలా ప్రకృతితో కలిసి జీవించడం అంటే కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో కష్టమే. స్థలాభావం, నిర్మాణ వ్యయం, నిర్వహణ భారం ఇలా కారణాలనేకం. కానీ కరోనా తర్వాత నివాసితుల అభిరుచి మారింది. ఇళ్లు, ఆఫీసు, షాపింగ్‌మాల్,మెట్రోరైల్.. ఇలా ఒకటేమిటి ప్రతీది హరితంగానే ఉండాలని కోరుకుంటున్నారు. సాక్షి హైదరాబాద్హరిత భవనాల్లో ఏముంటాయంటే..సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌తో 20–30 శాతం విద్యుత్, 30–40 శాతం నీరు ఆదా అవుతుంది. నిర్వహణ వ్యయం తగ్గుతుంది. జీవవైవిధ్యం, సహజ వనరుల పరిరక్షణతో మెరుగైన గాలి నాణ్యత, ఆహ్లాదకరమైన వాతావరణంతో నివాసితులు ఆరోగ్యంగా ఉంటారు. ల్యాండ్ స్కేపింగ్, వరి్టకల్ గార్డెనింగ్, రెయిన్వాటర్ హార్వెస్టింగ్, ఎస్టీపీ, రూఫ్‌టాప్ సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ, సహజసిద్ధమైన గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాట్లు ఉండాలి.షేక్‌పేట, కోకాపేట, నార్సింగి, కొల్లూరు, తెల్లాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శామీర్‌పేట, పటాన్చెరు ఇలా నగరం నలువైపులా ఈ హరిత భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. గ్రీన్ బిల్డింగ్స్ ధరలు విస్తీర్ణాన్ని బట్టి చదరపు అడుగుకు రూ.4,500 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. వీటి విస్తీర్ణాలు 1,200 చ.అ. నుంచి 5,000 చ.అ. మధ్య ఉంటున్నాయి.హైదరాబాద్‌లో 890 ప్రాజెక్టులు2001లో దేశంలో 20 వేల చదరపు అడుగుల్లో (చ.అ.)కేవలం ఒక్కటంటే ఒక్కటే హరిత భవనం ఉండగా, ప్రస్తుతం 1,175 కోట్ల చ.అ. విస్తీర్ణంలో 13,722 భవనాలు ఉన్నాయి. ఇందులో 120కు పైగా నెట్‌జీరో బిల్డింగ్లే ఉన్నాయి. హైదరా బాద్‌లో 114 కోట్ల చ.అ.ల్లో 890 ప్రాజెక్టుల పరిధిలో హరిత భవనాలుండగా, ఇందులో నివాస, వాణిజ్య భవనాలే కాదు స్కూళ్లు, ఫ్యాక్టరీలూ ఉన్నాయి. అపర్ణాసరోవర్, రెయిన్బో విస్టాస్, మైహోమ్ అవతార్, బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్ సైబర్ కాలనీ, రహేజా విస్టాస్‌లు గ్రీన్ బిల్డింగ్స్‌గా గుర్తింపు పొందాయి.తొలిముద్ర నగరానిదే..⇒ హరిత భవనాల్లో హైదరాబాద్‌ది ప్రత్యేకస్థానం. గృహాలు, వాణిజ్య సముదాయాలు, కార్యాలయాలు, రైలు, మెట్రోస్టేషన్లు, ఫ్యాక్టరీలు, ఐటీ టవర్లు, విద్యాసంస్థలు ఇలా 31 విభాగాలలో హరిత భవనాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) రేటింగ్ ఇస్తుంది. వీటిల్లో తొలి రేటింగ్ పొందిన భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్గాగుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరితభవనంగా గచి్చ»ౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ⇒ ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెరి్మనల్గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. ⇒ తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా, కొత్తగా నిర్మించిన సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం కూడా ఐజీబీసీ రేటింగ్స్ అందుకున్నాయి.రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా.. హరిత భవనాలను ప్రోత్సహించేందుకు దేశంలో 11 రాష్ట్రాలు పలు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఐజీబీసీ గుర్తింపు పొందిన భవనాలకు పరి్మట్ ఫీజులో 20 శాతం, స్టాంప్ డ్యూటీ సర్చార్జ్లో 20 శాతం తగ్గుదల ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), భారీ పరిశ్రమలకు మూలధన పెట్టుబడి మీద 25 శాతం సబ్సిడీ కూడా ఉంది.డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్ (డీఐపీపీ), కేంద్ర పరిశ్రమ శాఖ నుంచి రూ.2 లక్షల వరకు నగదు ప్రోత్సాహకం ఉంది. సిడ్బీ బ్యాంక్ నుంచి వడ్డీ రేట్లలో మినహాయింపు కూడా ఉంది. ఇళ్లు, ఆఫీసులు, విద్యాసంస్థలు, ఐటీ టవర్లు, రైలు, మెట్రోస్టేషన్లు ఇలా 31 విభాగాల్లో తొలి ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో హరితభవనాలకు ప్రభుత్వం నుంచి రాయితీ, ప్రోత్సాహకాలు లేవు.తెలంగాణలో ఐజీబీసీ ప్రాజెక్టులలో కొన్ని..⇒ దుర్గంచెరు, పంజగుట్ట, ఎల్బీనగర్ సహా 17 మెట్రోస్టేషన్లు ⇒ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రైల్వే నిలయం ⇒ కాచిగూడ రైల్వేస్టేషన్ ⇒ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ గ్రీన్ విలేజ్ ⇒ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ⇒ సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లు ⇒ శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం(యాదగిరిగుట్ట) ⇒ ఇనార్బిట్ మాల్, నెక్సస్ షాపింగ్‌మాల్⇒ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జేయూఎన్టీయూహెచ్ (సుల్తాన్పూర్) ⇒ క్యాప్‌జెమినీ కార్యాలయం ⇒ హెచ్ఏఎల్ హెలికాప్టర్ ఫ్యాక్టరీ (తూంకూరు) ⇒ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంగ్రీన్ బిల్డింగ్స్ ఉద్యమంలా చేపట్టాలి ఏ తరహా నిర్మాణాలైనా సరే హరిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. గ్రీన్ బిల్డింగ్స్‌ను బిల్డర్లు ఉద్యమంలా నిర్మించాలి. హరిత భవనాల గురించి నగరంతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని ప్రజలకు అవగాహన కలి్పంచేలా పెద్దఎత్తున ప్రచారం చేపట్టాలి. - శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ జాతీయ ఉపాధ్యక్షుడుహరిత భవనాలను కోరుకుంటున్నారు హరిత భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఇంటికి రాగానే చల్లగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుండటంతో గ్రీన్ బిల్డింగ్స్‌లను కోరుకుంటున్నారు. దీంతో బిల్డర్లు కూడా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. - ఇంద్రసేనారెడ్డి, గిరిధారి హోమ్స్ఎండీ -
ఎవర్ ‘గ్రీన్’ బాటలో..! హైదరాబాద్ వాసుల ఆసక్తి ‘పచ్చటి’ భవనాలే!
సాక్షి, హైదరాబాద్: కరోనా నేర్పిన చక్కని పాఠం ఆరోగ్యంపై శ్రద్ధ. తినే తిండి మాత్రమే కాదు ఉండే ఇల్లు కూడా ఆరోగ్యాన్ని ఇచ్చేలా ఉండాలని జనం కోరుకుంటున్నారు. అందుకే హరిత (గ్రీన్) భవనాలకు డిమాండ్ పెరిగింది. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ధారాళమైన గాలి, వెలుతురు వచ్చే ఏర్పాట్లు, సౌర విద్యుత్, వర్షపు నీటి వినియోగం, జీవ వైవిధ్య పరిరక్షణ.. ఈ ఏర్పాట్లు, సదుపాయాలు ఉన్నవే హరిత భవనాలు. కొనుగోలుదారుల అభిరుచి మేరకు ఇటీవల రియల్ఎస్టేట్ సంస్థలు ఈ తరహా నిర్మాణాలకే మొగ్గుచూపిస్తుండటంతో..హైదరాబాద్‌లో గ్రీన్ బిల్డింగ్స్ పెరుగుతున్నాయి. ఆనందం, ఆహ్లాదంతోపాటు కాలుష్యానికి దూరంగా, ఆరోగ్యానికి దగ్గరగా ఉండటమే హరిత భవనాల అసలు లక్ష్యం. సాధ్యమైనంత వరకు సహజ సిద్ధమైన ఇంధన వనరులను వినియోగిస్తూ.. జీవ వైవిధ్యాన్ని కాపాడే నిర్మాణాలను హరిత భవనాలుగా పరిగణిస్తారు. నిర్వహణ వ్యయాన్ని తగ్గించడం, జీవన కాల పరిమితిని పెంచడమే హరిత భవనాల ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం దేశంలో 975 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణం మేర 8,600 హరిత భవనాలు ఉన్నాయి. తెలంగాణలో 178 నివాస, 256 వాణిజ్య భవనాలు ఐజీబీసీ గుర్తింపు పొందాయి. రేటింగ్‌ను బట్టి సర్టిఫికెట్లు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు ఉన్న నివాస, వాణిజ్య సముదాయాలను గుర్తించి ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కేటగిరీలలో సర్టిఫికెట్లను ప్రదానం చేస్తుంటారు. 80కిపైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60–79 మధ్య వస్తే గోల్డ్, 50–59 మధ్యవస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆయా భవనాల్లో విద్యుత్, నీటి వినియోగం, నిర్మాణ సామగ్రి ఎంపిక, ల్యాండ్ స్కేపింగ్ మీద ఆధారపడి ఈ రేటింగ్స్ ఉంటాయి. ‘గ్రీన్ బిల్డింగ్’ ప్రయోజనాలివే.. ►సాధారణ భవనాలతో పోలిస్తే గ్రీన్ బిల్డింగ్స్‌లో విద్యుత్ 30–50% ఆదా ఆవుతుంది. ►20–30 % నీటి వినియోగం తగ్గుతుంది. ►12–16% మేర కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయి. పాత భవనాలూ ‘గ్రీన్’గా.. కొత్త భవనాలను పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించవచ్చు. మరి పాత భవనాల పరిస్థితేంటి అనే సందేహాలు వస్తుంటాయి. వాటిని కూడా గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా మార్చుకునే అవకాశం ఉంది. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంకు బిల్డింగ్‌ను హరిత భవన ప్రమాణాలకు అనుగుణంగా మార్చారు. బిల్డింగ్‌లో త్రీస్టార్, ఫైవ్‌స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రికల్ వస్తువులను వినియోగించడం, గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పులో మా ర్పులు, సౌర విద్యుత్ వినియోగం, నీటి వృథాను అరికట్టడం, మొక్కలను పెంచడం వంటివి చేస్తే ‘గ్రీన్’గా మారొచ్చు. హరిత భవనాలు ఎలా ఉండాలంటే? ►భవన నిర్మాణంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ►వేడిని విడుదల చేసే ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి. ►వాన నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతలు, నీటి శుద్ధి కేంద్రం ఉండాలి. ►భవనంలో సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించాలి. ►ఇంటి లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. ►భవనం చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి. ►ఖాళీ స్థలంలో పచ్చదనం ఎక్కువగా ఉండే మొక్కలను పెంచాలి. ‘తొలి’ ఘనత మనదే.. హరిత భవనాల గుర్తింపులో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దేశంలోనే తొలి ఐజీబీసీ ప్లాటినం గ్రేడ్ స్టేషన్‌గా గుర్తింపు పొందగా.. ఆసియాలోనే తొలి హరిత భవనంగా గచ్చిబౌలిలోని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సొహ్రబ్జి గ్రీన్ బిజినెస్ సెంటర్ నిలిచింది. ఇక ప్రపంచంలో మొదటి గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఖ్యాతి గడించింది. తాజాగా తెలంగాణ పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు గ్రీన్ బిల్డింగ్ గుర్తింపు దక్కగా.. కొత్తగా నిర్మించనున్న సచివాలయం, తెలంగాణ అమరవీరుల స్మారకం కూడా ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మిస్తున్నారు. అనుమతుల్లో తప్పనిసరి చేయాలి 2070 నాటికి కార్బన్ న్యూట్రల్ ఇండియాగా మారాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దాన్ని చేరాలంటే భవన నిర్మాణాలు కూడా హరితంగా ఉండాలి. దేశంలో ప్రతి ప్రభుత్వ భవనాన్ని హరిత భవనంగా మార్చాలి. అలాగే నిర్మాణ అనుమతులలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఐజీబీసీ సర్టిఫికెట్ లెవల్‌ను తప్పనిసరి చేయాలి. – సి.శేఖర్‌రెడ్డి, ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ -
ఈ నెల 18 నుంచి గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: సీఐఐ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో ‘గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్–2021’ 19వ ఎడిషన్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ‘నెట్‌జీరో బిల్డింగ్–బిల్ట్ ఎన్విరాన్మెంట్’ థీమ్‌తో వర్చువల్‌లో ఈ సదస్సును నిర్వహిం చనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల ఈ సదస్సులో 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, 500లకు పైగా హరిత భవనాల ఉత్పత్తుల ప్రదర్శన, బృంద చర్చలు, ఉపన్యాసాలుంటాయి. సీఐఐ–ఐజీబీసీ చైర్మన్ వీ సురేష్, వైస్ చైర్మన్ గుర్మిత్‌సింగ్ అరోరా, మాజీ ప్రెసిడెంట్ జంషెడ్ ఎన్ గోద్రె జ్, ఐజీబీసీ హైదరాబాద్ చాప్ట ర్ చైర్మన్ సీ శేఖర్ రెడ్డి, కో–చైర్మన్ అభయ శంకర్ తదితరులు పాల్గొననున్నారు. కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) 2001లో ఐజీబీసీని ఏర్పాటు చేసింది. దేశంలో హరిత భవనాల నిర్మాణం, అభివృద్ధి, ఉత్పత్తుల పరిశోధన, అవగాహన వంటివి చేపడుతుంది. ప్రస్తుతం దేశంలో 6,781 ప్రాజెక్లు, 786 కోట్ల చదరపు అడుగుల హరిత భవనాలు ఉన్నాయి. -
5 నగరాల్లో క్రెడాయ్ హరిత భవనాలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) లకి‡్ష్యంచింది. ఇందులో భాగంగా 5 నగరాల్లో హరిత భవనాలను నిర్మించనుంది. ఈ మేరకు క్రెడాయ్ యూత్వింగ్, క్రెడాయ్ ఉమెన్స్ వింగ్ వ్యవస్థాపక వేడుకలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ఎంవోయూ కుదుర్చుకుంది. తొలుత హైదరాబాద్, ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, ముంబై నగరాల్లో గ్రీన్ బిల్డింగ్స్‌లను నిర్మిస్తామని.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని క్రెడాయ్ అధ్యక్షుడు సతీష్ మగర్ తెలిపారు. ‘‘రెండు దశాబ్దాలుగా మన దేశం గ్రీన్ బిల్డింగ్ మూమెంట్లో లీడర్‌గా ఉందని, క్యాంపస్, టౌన్‌షిప్స్, సిటీల వంటివి అన్నీ కలిపి 6.8 బిలియన్ చ.అ.లకు పైగా హరిత భవనాలున్నాయని’’ ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్ తెలిపారు. 2012 నుంచి ఐజీబీసీ, క్రెడాయ్ మధ్య ఎంవోయూ కుదుర్చుకోవటం ఇది మూడో సారి. -
భువికి మేలు చేసే 'భవనం'
సాక్షి, హైదరాబాద్: హైటెక్ బాటలో దూసుకుపోతున్న మన గ్రేటర్ సిటీ ఇక హరిత భవనాలకూ కేరాఫ్ అడ్రస్‌గా నిలవబోతోంది. ఇప్పుడు వాణిజ్య, గృహ అవసరాలకు సైతం ఆయా వర్గాలు హరిత భవనాలను ఎంపిక చేసుకోవడం నిర్మాణ రంగంలో నయా ట్రెండ్‌గా మారింది. ఇటీవల మహానగరం పరిధిలో సుమారు 30 ప్రముఖ నిర్మాణ సంస్థలు భారీ హరిత భవనాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆయా బహుళ అంతస్తుల భవంతుల్లో సుమారు 18 లక్షల చదరపు అడుగుల మేర నివాస, వాణిజ్య స్థలం అందుబాటులోకి రానుంది. దక్షిణాదిలో బెంగళూర్ తర్వాత అత్యధిక గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణంతో మన సిటీ ముందుకెళుతోంది. మెట్రో నగరాల్లో గ్రీన్‌బెల్ట్ ఇలా.. దేశంలో 35 శాతం గ్రీన్‌బెల్ట్‌తో చండీగఢ్ తొలిస్థానంలో ఉంది. 20.20 శాతంతో ఢిల్లీ, 19 శాతంతో బెంగళూర్, 15 శాతంతో కోల్‌కతా, 10 శాతంతో ముంబై,9.5 శాతంతో చెన్నై తరువాతి స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌లో హరితం 8 శాతానికే పరిమితమైనందున, భవిష్యత్‌లో హరిత భవనాల నిర్మాణాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. హరిత భవనాలకు డిమాండ్... హరిత భవనాల్లో సహజ సిద్ధమైన సౌరశక్తి వినియోగం, పునర్వినియోగ విధానంలో మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించడం, స్వచ్ఛమైన ఆక్సిజన్, కంటికి ఆహ్లాదం కలిగించేలా గ్రీన్‌బెల్ట్‌ను పెంపొందించే అవకాశాలుండటంతో ఇప్పుడు అన్ని వర్గాలవారు హరిత భవనాల వైపు మొగ్గుచూపుతున్నారు. మన నగరంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాల మేరకు హరిత భవనాలను నిర్మించేందుకు పలు నిర్మాణ సంస్థలు ముందుకొస్తున్నాయని కౌన్సిల్ ప్రతినిధులు తెలిపారు. గ్రేటర్ పరిధిలో కొన్ని నిర్మాణ సంస్థలు ఇటీవల 30 భారీ గ్రీన్ బిల్డింగ్స్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాయి. హరిత భవనాల నిర్మాణానికి సాధారణ భవనాల కంటే 20% అధికంగా ఖర్చు అవుతున్నా భవిష్యత్‌లో ఆయా వాణి జ్య, గృహ సముదాయాలున్న భవనాలకు నిర్వహణ వ్యయం తగ్గుముఖం పడుతుందని విశ్లేషిస్తున్నారు. హరిత భవనాలతో ఉపయోగాలివీ... సహజ వనరులను పర్యావరణానికి హాని కలగని రీతిలో వినియోగించేందుకు వీలు. - భవనాల నిర్మాణ ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల్లోనూ గ్రీన్ టెక్నాలజీ వినియోగంతో కర్బన ఉద్గారాలు, క్లోరోఫ్లోరో కర్బన్ల ఉద్గారాలు తగ్గుతాయి. గాలి, నీరు, నేల కాలుష్యం తగ్గుతుంది. - ఆహ్లాదకరమైన హరిత వాతావరణంతో యూవీ రేడియేషన్ తీవ్రత తగ్గుతుంది. - ఆయా భవనాల నుంచి వెలువడే మురుగునీటిని మినీ మురుగుశుద్ధి కేంద్రాల్లో శుద్ధిచేసి గార్డెనింగ్, ఫ్లోర్‌క్లీనింగ్, కార్ వాషింగ్ వంటి అవసరాలకు వినియోగించడం. - చుట్టూ హరితహారం ఉండటంతో ఆయా భవనాల్లో ఉండేవారికి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందుతుంది. - ఘన వ్యర్థాలను సైతం రీ సైకిల్ చేసి పునర్వినియోగం చేసేందుకు అవకాశం. -
మీ ఇంటి రేటింగ్ ఎంత?
♦ కస్టమర్ల చూపు గ్రీన్ బిల్డింగ్స్ వైపు ♦ విద్యుత్, నీటి పొదుపు; బిల్లుల తగ్గింపుతో డబ్బు ఆదా ♦ దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్; తెలంగాణలో 259 ఇంట్లోకి ఫ్రిజ్, వాషింగ్ మిషన్ వంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు త్రీస్టారా? ఫోర్ స్టారా? ఫైవ్ స్టారా? అని చూసి మరీ కొంటాం. వేల రూపాయల ఖరీదు చేసే వీటిని కొనేటప్పుడే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) రేటింగ్ ఉన్న వాటినే తీసుకుంటాం. మరి అలాంటిది ఏకంగా ఇంటినే కొనుగోలు చేసే ముందు ఏం చూడాలి? ఏ రేటింగ్ ఉన్న ఇంటిని సొంతం చేసుకోవాలి?.. ఇదిగో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది స్థిరాస్తి రంగంలో! అందుకే హరిత భవనాలు (గ్రీన్స్ బిల్డింగ్స్) వైపే కొనుగోలుదారులు.. వాటి నిర్మాణాల వైపే నిర్మాణదారులూ అడుగులేస్తున్నారు మరి!! - సాక్షి, హైదరాబాద్ పర్యావరణ ప్రమాణాలను పాటించి నిర్మించే భవనాలనే గ్రీన్ బిల్డింగ్స్ అంటారు. సాధారణ నిర్మాణాలతో పోలిస్తే హరిత భవనాల నిర్మాణానికి 3-5 శాతం ఖర్చు ఎక్కువవుతుంది. విద్యుత్, నీటి వంటి బిల్లుల తగ్గింపు ద్వారా ఈ వ్యయం రెండేళ్లలో తిరిగొస్తుందని నిపుణులు చెబుతున్నారు. పునాది నుంచే మొదలు.. గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణానికి ఫ్లైయాష్ ఇటుకలు (బూడిదతో చేసిన ఇటుకలు), ఫ్లైయాష్ సిమెంట్ (గ్రీన్ సిమెంట్)లను వాడుతారు. రెండు బ్రిక్స్‌ల మధ్య థర్మాకోల ను పెడతారు. 15 నుంచి 18 మిల్లీ మీటర్ల మందం ఉన్న డబుల్ గ్రేసింగ్ అద్దాలను వినియోగిస్తారు. ఈ గ్లాస్ మధ్య 3 మి.మిల ఖాళీ స్థలం ఉంటుంది. ఇది గాలితో నిండి ఉంటుంది. రీసైకిల్ అల్యూమినియం ఉక్కు, రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ హౌజ్ నిర్మాణాల్లో వినియోగిస్తారు. సౌర శక్తి సహాయంతో భవన నిర్మాణానికి అవసరమైన విద్యుత్, నీటిని వాడుకుంటారు. సహజ వెలుగులు, వాయు ప్రసరణకు వీలుగా నిర్మాణం ఉంటుంది. ఇంటిలోపలే కాకుండా వీధుల్లోనూ ఎల్ఈడీ లైట్లను వినియోగిస్తారు. ఆవరణ, పరిసరాల్లో తక్కువ నీటిని తీసుకొని ఎక్కువ కాలం జీవించే మొక్కలు, చెట్లను పెంచుతారు. దేశంలో 3,770 గ్రీన్ బిల్డింగ్స్.. దేశంలో హరిత భవనాలను ప్రోత్సహించేందుకు, వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) కూడా ఉంది. ఇది నిర్మాణాలు, వెంచర్లకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనే మూడు కేటగిరీల్లో రేటింగ్ ఇస్తుంటుంది. 80కి పైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60-79 మధ్య వస్తే గోల్డ్, 50-59 మధ్య వస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇప్పటివరకు దేశంలో 384 కోట్ల చ.అ.ల్లో సుమారు 3,770 ప్రాజెక్ట్‌లు హరిత భవనాలుగా గుర్తింపు పొందాయని ఐజీబీసీ చెబుతోంది. పాత ఇళ్లూ గ్రీన్‌గా.. కొత్త భవనాల సంగతి పక్కన పెడితే, మరి పాత ఇళ్లనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోలేమా? అంటే ఎస్ అనే సమాధానమిస్తోంది ఐజీబీసీ. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ భవనం ఇలా హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చిందేనని ఉదహరిస్తోంది కూడా. ఏం చేయాలంటే.. ⇔ ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం. ⇔ భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి. ⇔ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. భవనం లోపల పూర్తిగా ఎల్ఈడీ లైట్లనే వినియోగించాలి. ⇔ నీటిని వృథా చేయరాదు. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవ వైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. హరిత భాగ్యనగరం.. దేశంలో తొలిసారిగా ప్లాటినం రేటింగ్ పొందిన భవనం.. హైదరాబాద్‌లోని సీఐఐ సొహబ్రి గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్. 20 వేల చ.అ.ల్లోని ఈ నిర్మాణం 2003లో గుర్తింపు పొందింది. ఆ తర్వాత నివాస సముదాయంలో అవని రెసిడెన్సీ, గ్రీన్ ప్యాసింజర్ టెర్మినల్‌గా రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, ప్రభుత్వ గ్రీన్ బిల్డింగ్‌గా హుడా బిల్డింగ్ (ప్రస్తుతం ఇది యూఎస్ కాన్సులేట్ కార్యాలయం) గుర్తింపు పొందాయి. తెలంగాణలోని 259 హరిత భవనాల్లో 150కి పైగా భవనాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. -
పాత ఇంటికీ లెక్కుంది
♦ పాత ఇళ్లనూ హరిత భవనాలుగా మార్చుకునే వీలు ♦ చిన్నచిన్న మార్పులతో సాధ్యమేనంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను పర్యావరణహితమైన గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించవచ్చు. ఆయా భవనాలకు ప్లాటినం, స్వర్ణం, రజతం పేర్లతో రేటింగ్ ఇచ్చే విధానం గురించి విన్నాం.. మరి పాత భవనాల సంగతేంటి? వాటిని కూడా హరిత భవనాలుగా మార్చుకోవటమెలా? పాత ఇళ్లను గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులతో మార్చుకునే వీలుంది. హరిత ప్రమాణాలివే.. ♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ♦ ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. ♦ భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్(సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి. ♦ భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. ♦ సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. ♦ భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. ప్రయోజనాలివే.. ♦ భవనాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్లు(సీఎఫ్‌సీ) ఓజోన్ పొర దెబ్బతినడానికి కారణమవుతున్నాయి. పర్యావరణ హానికారక సమస్యలను హరిత భవనాల ద్వారా పరిష్కరించవచ్చు. ♦ రసాయన రహిత టైల్స్, సహజ రంగులు, వెదురు సంబంధిత సామగ్రిని గ్రీన్ బిల్డింగ్స్‌లో వాడటం మూలంగా ఇంట్లోని వేడిని గ్రహిస్తాయి. ♦ సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించటంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది. ♦ గ్రీన్ బిల్డింగ్స్ భవనాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. దీంతో ఏసీ, ఫ్యాన్ల వినియోగం తగ్గుతుంది. నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉంటుంది. -
పాత భవనాలు గ్రీన్ బిల్డింగ్స్ గా..
సాక్షి, హైదరాబాద్: కొత్త భవనాలనే కాదు పాత వాటినీ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే.. ♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇంట్లో త్రీ స్టార్, ఫై స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. ♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణం లో చిన్నచిన్న మార్పులు చే యాలి. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. -
హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల భవనాల (గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ తరహా నిర్మాణాల్లో మెళకువలు నేర్పే జాతీయ శిక్షణ సంస్థ ‘అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎఫిసెంట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ’ ఏర్పాటు కాబోతోంది. దీనికి జర్మనీ మేథో సహకారం అందించనుండగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇవ్వనుంది. దేశంలో హైదరాబాద్‌తోపాటు ముంబై, కోల్‌కతాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మాదాపూర్‌లోని న్యాక్‌కు అనుబంధంగా వచ్చే ఈ కేంద్రం అదే ప్రాంగణంలో సిద్ధం కానుంది. దీనికి కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వనుంది. రెండేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు మరో రూ.5 కోట్లు ఇస్తుంది. వెంటనే పనులు మొదలయ్యేలా లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీర్లకు శిక్షణ పర్యావరణంపై దుష్ర్పభావం లేకుండా నిర్మాణాలను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ బిల్డింగ్ అంశం బాగా అభివృద్ధి చెందింది. మన దేశంలో దీనిపై అంతగా అవగాహన లేదు. దీంతో ఇంజనీర్లను ఆ దిశగా సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచంలో నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటంలో ముందున్న జర్మనీని సాయం కోరింది. దీంతో జర్మనీ ప్రత్యేకంగా నిపుణులను మనదేశానికి పంపగా, వారు వివిధ ప్రాంతాల్లోని న్యాక్ తరహా కేంద్రాలను పరిశీలించారు. అభివృద్ధి చేస్తాం: తుమ్మల న్యాక్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి దాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం న్యాక్ 17వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాక్ సిబ్బంది అతి తక్కువ జీతాలకే పనిచేస్తున్నారని సంస్థ డీజీ భిక్షపతితోపాటు డెరైక్టర్ శాంతిశ్రీ, ఫైనాన్స్ డెరైక్టర్ హేమలత, ఇతర అధికారులు వెంకట్రామయ్య, గంగాధర్‌లు అదే సభలో పేర్కొనటంతో మంత్రి వెంటనే స్పందించారు. వారి జీతాల పెంపుతోపాటు సర్వీసు క్రమబద్ధీకరణకు సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. న్యాక్‌లో యువతకు నిర్మాణరంగంలో మెళకువలు నేర్పటం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తామన్నారు. సంవత్సర కాలంలో 3,800 మందికి శిక్షణ ఇస్తే 3,200 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. -
హరిత భవనాల్లో హాయిగా!
సాక్షి, హైదరాబాద్ : హరిత భవన విధానం అన్నది ఏ ఒక్క రంగానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతోంది. ఇల్లు, అపార్ట్మెంట్, వాణిజ్య సముదాయం, ఆసుపత్రి, కార్పొరేట్ కార్యాలయం, విద్యాసంస్థ, పారిశ్రామిక భవనం, విమానాశ్రయం.. నిర్మాణం ఏదైనా గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తే ఆహ్లాదంగా ఉంటుంది. లైట్లు, ఫ్యాన్లు, ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది. అంటే కరెంటు బిల్లులో పొదుపు సాధ్యమవుతుంది. ఇందుకు వీలు కల్పించేవే హరిత భవనాలు. పర్యావరణ నిర్మాణాలకు అంకురార్పణ జరిగింది భాగ్యనగరంలోనే. 2000లో హైదరాబాద్‌లో భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ముఖ్య కార్యాలయాన్ని పూర్తిస్థాయి హరిత భవనంగా నిర్మించారు. సొరాబ్జీ గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్‌గా పేరొందిన దీనికి హరిత భవనాల రేటింగ్ ప్రకారం అత్యుత్తమమైన ప్లాటినం రేటింగ్ లభించింది. నిర్మాణాల నుంచి అధిక విషవాయువులు విడుదలవ్వడం.. సంప్రదాయ నిర్మాణాలు ఇరవై శాతం విద్యుత్తును వినియోగించడం తదితర అంశాలు భూతాపాన్ని పెంచుతున్నాయి. ఈ సమస్య తీవ్రతను అర్ధం చేసుకున్న పలు నగర నిర్మాణ సంస్థలు ఇప్పుడు హరిత భవనాల నిర్మాణంపై దృష్టి సారిస్తున్నాయి. హరిత భవనాలు అంటేనే చాలామందిలో ఖర్చు అధికమవుతుందనే భయాలు ఉన్నాయి. స్థలం, పెట్టుబడి పెట్టే స్థోమత ఉన్నా అత్యధికులు హరిత భవనాలపై దృష్టి సారించకపోవడానికి అవగాహన లేమే ప్రధాన కారణం. సౌర విద్యుదుత్పత్తి, నీటి పునర్వినియోగ నిర్మాణాల వల్ల కాస్త ఖర్చు ఎక్కువైనా, పర్యావరణానికి జరిగే మేలు.. నెలవారీ విద్యుత్ బిల్లులో ఆదాను దృష్టిలో ఉంచుకుంటే ఇది పెద్ద భారమేమీ కాదు. వీటిని నిర్మించే డెవలపర్లకు తగిన ప్రోత్సాహకాలను అందించడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలి. -
పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించటం మనందరికీ తెలిసిందే. మరి ఇంతకుముందే నిర్మించిన భవనాలనూ హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడమెలా? పాత భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా తీర్చిదిద్దే సౌలభ్యం ఉందండోయ్. గచ్చిబౌలిలోని హెచ్ఎస్బీసీ బ్యాంక్ భవనమే ఇందుకు చక్కటి ఉదాహరణ. ⇒ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫై స్టార్ ఉండే లా చూసుకోవాలి. ⇒భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. ⇒భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్ (సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి. ⇒భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. ⇒సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. ⇒బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. ⇒భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది. ⇒వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ⇒ఇంటికి వాడే పెయింటింగ్స్ నుంచి విషపూరిత రసాయనాలు విడుదలవకుండా జీరో శాతం వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ (వీఓసీ) ఉన్న రసాయన పెయింటింగ్స్‌ను వాడాలి. ప్రయోజనాలనేకం: ఫ్లైయాష్ ఇటుకల మధ్య థర్మాకోల్ ఉండటం వల్ల భవనం లోపలికి వేడి రాదు. గ్రేసింగ్ అద్దాల మధ్య ఉన్న గాలి కారణంగా భవనం ఎల్లప్పుడూ చల ్లగా ఉంటుంది. సౌరశక్తి వినియోగించడం వల్ల విద్యుత్, నీటి బిల్లుల మోత తగ్గుతుంది. నీరు వృథాగా పోకుండా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో వృథా నీటిని మొక్కలు, బాత్రూమ్లకు తిరిగి వినియోగించుకోవచ్చు. -
భవనాలనూ పచ్చగా మార్చొచ్చు
హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించుకోవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. మరి పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చండోయ్. పాత భవనాలకు కూడా ప్లాటినం, స్వర్ణం, రజతం వంటి రేటింగ్ కూడా ఇస్తారండోయ్. సీఐఐ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఈ విధానాలకు శ్రీకారం చుట్టింది. చిన్న మార్పులతో సరి.. 1. భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. 2. ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి. 3. భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి. 4. భవనం లోపల పూర్తిగా సీఎఫ్ఎల్ బల్బులను వాడాలి. 5. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. 6. సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. దీంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది. 7 {Xన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. 8. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది. 9. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి. 10. భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి. -
గ్రీన్ బిల్డింగ్స్, ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులపై దృష్టి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మైట్రో రైలు... ముంబై మోనో రైలు... ఢిల్లీలోని టెర్మినల్-3 ఇలా ఏ భారీ ప్రాజెక్టు చూసినా వాటి వెనక ‘ఆటోడెస్క్’ హస్తం కనిపిస్తుంది. ఇవే కాదు! అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి పూర్తి గ్రాఫిక్స్‌తో నిండిన సినిమాల్లోనూ ఆటోడెస్క్ అద్భుతాలుంటాయి. అంతెందుకు! మన తెలుగులో రాబోతున్న రాణి రుద్రమ, బాహుబలి సినిమాల్లోనూ ఆటోడెస్క్ డిజైన్స్ కళ్లకు కట్టబోతున్నాయి. అదీ! ఆటోడెస్క్ ప్రత్యేకత అంటే. అందుకే ఒక చిన్న ఆఫీసులో ఆరంభమైన ఈ సంస్థ ఇపుడు ఏటా రూ.16 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. ఐపాడ్, ఐఫోన్ అప్లికేషన్స్‌తో పాటు 3డీ టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఎంటర్టైన్మెంట్ సాఫ్ట్వేర్ సేవలందిస్తున్న ఈ సంస్థ సీనియర్ ఇండస్ట్రీ ప్రోగ్రామ్ మేనేజర్(ఐపీఎం) టెర్రీ డి బెన్నెట్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇండియాతో సహా రాష్ట్ర మార్కెట్‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... ఇండియాలో ఆటోడెస్క్ ఎలాంటి సేవలందిస్తోంది? ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్, కన్స్ట్రక్షన్, మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో మేం సేవలందిస్తున్నాం. కొన్ని నేరుగా మేమే క్లయింట్లకు అందిస్తున్నాం. మరికొన్ని ఆర్డర్లను మాత్రం కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు మా ద్వారా అందిస్తున్నాయి. మేం డెవలప్ చేసిన టూల్స్‌ను అవి వినియోగించుకుంటున్నాయి. ఇండియాలో ప్రస్తుతం మీ ఆర్డర్‌బుక్ ఎంత? మా కంపెనీ పాలసీ ప్రకారం దేశాలవారీగా ఆదాయాలు, ఆర్డర్ బుక్ విలువ చెప్పలేం. కానీ ఇక్కడ ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, టాటా గ్రూపు, కల్యాణి వంటి అనేక సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. మొత్తం అన్నిదేశాలూ కలిపితే అంతర్జాతీయంగా మా సంస్థ ఆదాయం 2.5 బిలియన్ డాలర్లు దాటుతోంది. ఆటోడెస్క్ టెక్నాలజీ వినియోగిస్తే ప్రాజెక్టు వ్యయం ఏ మేరకు తగ్గుతుంది? సమయం ఎంత ఆదా అవుతుంది? మా టెక్నాలజీతో ఎంతటి భారీ ప్రాజెక్టునైనా 3డీలో డిజైన్ చేయొచ్చు. అలాగే ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏమైనా లోపాలుంటే వాటిని రియల్ టైమ్‌లోనే క్షణాల్లో సరిదిద్దుకోవచ్చు. హైదరాబాద్‌లో ఎల్ అండ్ టీ చేపట్టిన మెట్రో రైల్ ప్రాజెక్ట్ డిజైనింగ్‌లో ఆటోడెస్క్ను వినియోగించారు. దీంతో మలుపుల వద్ద కూడా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా ఉండేలా చక్కగా డిజైన్ చేయగలిగారు. పైపులకు సంబంధించి ఎన్ని వంపులు తిరిగినా మా టెక్నాలజీతో అక్కడొచ్చే సమస్యలు ఇట్టే తెలిసిపోతాయి. ఇక వ్యయం, సమయం ఎంత తగ్గుతుందనేది ప్రాజెక్టును బట్టి మారుతుంటుంది. మొత్తమ్మీద సగటున 20-30% ఖర్చు కలిసొస్తుంది. ఆర్థిక మందగమనంతో ఇన్ఫ్రా రంగంలో అనేక ప్రాజెక్టులు ఆగిపోయాయి కదా! మీ వ్యాపారం కూడా..? అలాంటిదేమీ లేదు. ఇండియాలో మౌలిక వసతుల రంగం ఏటా 17 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. మున్ముందు 40 శాతం మంది జనాభా ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళతారని అంచనా. వీరందరికీ మౌలిక వసతులు కల్పించడానికి భారీ పెట్టుబడులు కావాలి. తాజాగా 17 విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్, సరుకు రవాణాకు ప్రత్యేక రైలు మార్గం వంటి ప్రాజెక్టులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. 2025 నాటికి గ్రీన్ బిల్డింగ్స్ సంఖ్య 25 శాతం పెరుగుతుందని అంచనా. వీటన్నిటికీ మా టెక్నాలజీ అవసరం కనక ఇండియా మాకు కీలకమైన మార్కెట్. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఏం చేస్తున్నారు? మీడియా, వినోద రంగాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న అవతార్, లైఫ్ ఆఫ్ పై వంటి సినిమాల్లో మా టెక్నాలజీనే వినియోగించారు. మా టెక్నాలజీ వల్ల అవి గ్రాఫిక్స్‌లా కాకుండా సహజసిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. తెలుగులో నిర్మిస్తున్న బాహుబలి, రాణి రుద్రమ అనే కాదు... గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యం ఉండే ఏ సినిమా అయినా మా టెక్నాలజీని వాడాల్సిందే. ఇండియాలో విస్తరణ సంగతేంటి? ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా ఒక పరిశోధన, అభివృద్ధి(ఆర్ అండ్ డీ) కేంద్రం పనిచేస్తోంది. ఆటోడెస్క్ టెక్నాలజీపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన కల్పించేలా ముందుగానే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఏఐసీటీఈ, విద్యాశాఖలతో ఒప్పందాలు చేసుకున్నాం. -
ఆరోగ్యభవనాలు!
ఎటుచూసినా పచ్చని చెట్లు.. ఆహ్లాద వాతావరణం..ఆకాశహర్మ్యాలే సిగ్గుపడేలా అందమైన భవనాలు.. అచ్చం ఇలాంటి ఆహ్లాదకరమైన ఇళ్లనే కోరుకుంటున్నారు నగరవాసులు. వారి అభిరుచికి తగ్గట్టుగానే హైదరాబాద్‌లోని నిర్మాణ సంస్థలు కూడా గ్రీన్ బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగానే నిర్మాణాలు చేపడుతున్నాయి. దీంతో బెంగళూరు, ఢిల్లీ వంటి ఇతర మెట్రో నగరాలకు పోటీగా నగరంలో కూడా హరిత భవనాలు పెరిగిపోతున్నాయి. పచ్చని ప్రకృతితో పాటు, నిర్వహణ ఖర్చుల్లో తగ్గుదల ఉండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. కాలుష్యానికి దూరంగా.. ఆరోగ్యానికి దగ్గరగా.. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో కొలువుదీరుతున్న హరిత భవనాలపై ‘సాక్షి రియల్టీ’ కథనమిది.. - సాక్షి, హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యరీత్యా పర్యావరణ స్పృహ పెరిగిపోయింది. ఇతర ఫ్లాట్ల కంటే గ్రీన్ బిల్డింగ్స్‌లో నిర్వహణ వ్యయం, కరెంట్ బిల్లుల బాదుడు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో భవన నిర్మాణంలోనూ పర్యావరణ సూత్రాలను పాటించాలని కోరుకుంటున్నారు. గ్రీన్‌బిల్డింగ్స్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లనే కొనుగోలు చే సేందుకు ఆసక్తి చూపుతున్నారు. ‘‘ఇటీవల మా దగ్గరికొస్తున్న కస్టమర్లలో ఎక్కువ శాతం గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్ల వైపే మొగ్గుచూపుతున్నారు. నగరానికి దూరమైనా ఇబ్బంది లేదు కానీ విశాలంగా ఉండి, జిమ్, క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులుండాలంటున్నారు’’ అని వసతి హౌసింగ్ చైర్మన్, సీఈఓ పీవీ రవీంద్రకుమార్ చెప్పారు. రద్దీ లేకుండా, జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలనే ఎంపిక చేసుకుంటున్నారని ఆయనన్నారు. మురుగు శుద్ధి కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, సౌరశక్తి వంటి ఏర్పాట్లు ఉంటేనే ఫ్లాట్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎస్ఎంఆర్ హోల్డింగ్స్ చైర్మన్, ఎండీ ఎస్.రాంరెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్‌ను బట్టి పాయింట్లు: ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన వెంచర్లు, ప్రాజెక్టులకు ప్లాటినం, గోల్డ్, సిల్వర్ అనే మూడు కేటగిరీల్లో సర్టిఫికెట్లు ఇస్తారు. 80కి పైగా పాయింట్లు వస్తే ప్లాటినం, 60-79 మధ్య వస్తే గోల్డ్, 50-59 మధ్య వస్తే సిల్వర్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇవి కాకుండా 40-49 పాయింట్ల మధ్య వచ్చిన ప్రాజెక్టులకు మామూలు సర్టిఫికెట్ ఇస్తారు. ఐజీబీసీ సర్టిఫికెట్ కోసం నగరంలో చాలా నిర్మాణ సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) వద్ద రిజిస్టర్ చేసుకున్నాయి. ఐజీబీసీ ప్రమాణాలివే.. భవన నిర్మాణంలో నీరు, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. తక్కువ ఖర్చుతో నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి. ఫ్లాట్ల పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. నీటి గుంతలను నిర్మించి వాన నీటిని భూగర్భంలోకి పంపే ఏర్పాటు చేసుకోవాలి. వాడిన నీటిని శుద్ధి చేసుకొని తిరిగి వాడుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి. భవన నిర్మాణం, నిర్వహణలో సాధ్యమైనంత వరకు సౌరశక్తిని వినియోగించాలి. ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫైవ్ స్టార్ ఉండే వి మాత్రమే చూసుకోవడం. భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి. భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్(సీఎఫ్ఎల్) బల్బులను వాడాలి. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్త చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి. ఆయా ప్రాజెక్టు పరిసరాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి. ఐజీబీసీ సర్టిఫికెట్ పొందిన ప్రాజెక్టుల్లో కొన్ని.. కొంపల్లిలో 70 ఎకరాల్లో సాకేత్ ఇంజనీర్స్ నిర్మిస్తున్న భూఃసత్వ. మొత్తం ఫ్లాట్లు 600. ప్రారంభ ధర రూ. 65 లక్షలు. మూసాపేటలో 22 ఎకరాల్లో సైబర్‌సిటీ బిల్డర్స్ నిర్మిస్తున్న రెయిన్బో విస్టాస్-రాక్ గార్డెన్. మొత్తం ఫ్లాట్లు 2,500. చ.అ. ధర రూ. 3,900. కిస్మత్పూర్లో 4 ఎకరాల్లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న విల్లా ఓనిక్స్. మొత్తం విల్లాలు 44. ప్రారంభ ధర రూ. 1.25 కోట్లు. అప్పా జంక్షన్లో 5 ఎకరాల్లో వసతి ఆనంది. మొత్తం 480 ఫ్లాట్లు. ప్రారంభ ధర రూ. 24.1 లక్షలు. కూకట్పల్లి సమీపంలోని చింతల్లో రెండున్నర ఎకరాల్లో వసతి నవ్య. మొత్తం 190 ఫ్లాట్లు. ప్రారంభ ధర: రూ. 22.1 లక్షలు. శంషాబాద్‌లో 25 ఎకరాల్లో సుచిరిండియా ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. టింబర్‌లీఫ్. మొత్తం 123 విల్లాలు. ప్రారంభ ధర రూ. 1.50 కోట్లు ఘట్కేసర్లో 8 ఎకరాల్లో సుచిరిండియా ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. సుచిర్ ఒడిస్సీ. మొత్తం 99 విల్లాలు. ప్రారంభ ధర రూ. 36 లక్షలు. వివరణ పత్రాన్ని ఇవ్వాల్సిందే ప్రస్తుతం తమ ప్రాజెక్ట్, వెంచర్ ఐజీబీసీ సర్టిఫికెట్ పొందిందని కొనుగోలుదారులకు మౌఖికంగా చెబితే సరిపోతుంది. దాన్ని కొనుగోలుదారులు నమ్మేస్తున్నారు. కానీ సమీప భవిష్యత్తులో కొంత మార్పు రానుంది. నగరవాసుల్లో పర్యావరణ స్పృహ పెరిగిపోవడంతో సంబంధిత ప్రాజెక్ట్, వెంచర్ బ్రోచర్తో పాటు ఐజీబీసీ సర్టిఫికెట్ వివరణ పత్రాన్ని కూడా కొనుగోలుదారులకు తప్పనిసరిగా ఇచ్చే నిబంధనలు రానున్నాయి. దీంతో అన్ని నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా గ్రీన్‌బిల్డింగ్స్ ప్రమాణాలను పాటిస్తాయి. - లయన్ కిరణ్, సుచిరిండియా ఇన్ఫ్రాటెక్ ప్రై.లి. సీఈఓ. -
గ్రీన్ బిల్డింగ్స్‌తో 40శాతం తగ్గనున్న ఖర్చు