పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా..
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించటం మనందరికీ తెలిసిందే. మరి ఇంతకుముందే నిర్మించిన భవనాలనూ హరిత ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకోవడమెలా? పాత భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా తీర్చిదిద్దే సౌలభ్యం ఉందండోయ్. గచ్చిబౌలిలోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ భవనమే ఇందుకు చక్కటి ఉదాహరణ.
⇒ఇంట్లో వినియోగించే ఎలక్ట్రిక్ వస్తువులన్నీ కూడా త్రీ స్టార్, ఫై స్టార్ ఉండే లా చూసుకోవాలి.
⇒భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా పైకప్పు నిర్మాణ ంలో చిన్నచిన్న మార్పులు చే యాలి.
⇒భవనం లోపల పూర్తిగా కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ లైటింగ్ (సీఎఫ్‌ఎల్) బల్బులను వాడాలి.
⇒భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి.
⇒సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి.
⇒బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి.
⇒భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది.
⇒వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
⇒ఇంటికి వాడే పెయింటింగ్స్ నుంచి విషపూరిత రసాయనాలు విడుదలవకుండా జీరో శాతం వలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ (వీఓసీ) ఉన్న రసాయన పెయింటింగ్స్‌ను వాడాలి.
ప్రయోజనాలనేకం:
ఫ్లైయాష్ ఇటుకల మధ్య థర్మాకోల్ ఉండటం వల్ల భవనం లోపలికి వేడి రాదు.
గ్రేసింగ్ అద్దాల మధ్య ఉన్న గాలి కారణంగా భవనం ఎల్లప్పుడూ చల ్లగా ఉంటుంది.
సౌరశక్తి వినియోగించడం వల్ల విద్యుత్, నీటి బిల్లుల మోత తగ్గుతుంది. నీరు వృథాగా పోకుండా నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీంతో వృథా నీటిని మొక్కలు, బాత్‌రూమ్‌లకు తిరిగి వినియోగించుకోవచ్చు.