సాక్షి, హైదరాబాద్: కొత్త భవనాలనే కాదు పాత వాటినీ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే..
♦ భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి. ఇంట్లో త్రీ స్టార్, ఫై స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి.
♦ భవనాల లోపలికి గాలి, వెలుతురు దారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణం లో చిన్నచిన్న మార్పులు చే యాలి. ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలి.
♦ భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి.
♦ ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి.
పాత భవనాలు గ్రీన్ బిల్డింగ్స్ గా..
Published Fri, Apr 1 2016 10:10 PM | Last Updated on Sun, Sep 3 2017 9:01 PM
Advertisement
Advertisement