
సాక్షి, విజయవాడ: ఏపీని ప్రపంచస్థాయి పెట్టుబడుల రాష్ట్ర్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అన్నారు. శుక్రవారం విజయవాడలో భారత విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లామాటిక్ ఔట్ రీచ్ సదస్సు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అనేక దేశాలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఎలక్ర్టా నిక్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులకు రాష్ట్రంలో వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు.
ప్రపంచస్థాయి రాష్ట్ర్రంగా ఏపీ: కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి
ఏపీని ప్రపంచస్థాయి రాష్ట్ర్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి హరీష్ అన్నారు. భారత్‌కు ఏపీ అన్నపూర్ణ వంటిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment