న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమత, కేంద్రంలోనీ ఎన్డీయే ప్రభుత్వం మధ్య ఘర్షణ ఇంకా చల్లారడం లేదు. ఇటలీలో జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరగా విదేశాంగ నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇటలీలో అక్టోబర్‌లో జరుగబోయే ప్రపంచ శాంతి సదస్సుకు పోప్ ఫ్రాన్సిస్, జర్మన్ చాన్సలర్ ఆంజెలా, ఇటలీ ప్రధాని మారియోలు హాజరుకానున్నారు.
మమతను సైతం ఇటలీ ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. అందులో పాల్గొనడానికి తనకు అనుమతి ఇవ్వాలని మమత కోరగా విదేశాంగ శాఖ నిరాకరించింది. దీదీకి గతంలో చైనాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు ఇటలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవాన్ష్ భట్టాచార్య దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment