World peace
-
చిలీ మాజీ అధ్యక్షురాలికి ఇందిరా శాంతి బహుమతి
న్యూఢిల్లీ: 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రముఖ మానవ హక్కుల నేత, చిలీ మాజీ దేశాధ్యక్షురాలు మిచెల్ బాచెలెట్ అందుకోనున్నారు. ఇందిరా గాంధీ శాంతి బహుమతి అంతర్జాతీయ జ్యూరీ చైర్మన్, మాజీ జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ శుక్రవారం ఈ విషయం ప్రకటించారు. ప్రపంచ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి కోసం పాటుపడే వారిని ఈ అవార్డుతో గౌరవిస్తారు. ఐరాస మహిళా విభాగం వ్యవస్థాపక డైరెక్టర్‌గా, ఐరాస మానవ హక్కుల హై కమిషనర్‌గా, చిలీ అధ్యక్షురాలిగా లింగ సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం స్వదేశంలో, అంతర్జాతీయంగా మిచెల్ ఎంతగానో కృషి చేశారని ఇందిరా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ పేర్కొంది. -
ప్రజాస్వామ్యం మానవత్వం
జార్జిటౌన్: ప్రపంచ శాంతి, సౌభాగ్యాలే లక్ష్యంగా ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సరికొత్త పిలుపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చారు. అంతరిక్షం, సముద్రం అనేవి అంతర్జాతీయంగా పరస్పర సహకారానికి, అభివృద్ధికి వేదికలు కావాలి తప్ప సంఘర్షణలు, యుద్ధాలకు కాదని తేల్చిచెప్పారు. గురువారం గయానా దేశ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. స్వార్థం, విస్తరణవాదం అనే సంకుచిత ధోరణిని భారత్ ఏనాడూ నమ్ముకోలేదని అన్నారు. విస్తరణవాదంతో ముందుకెళ్లాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. వనరుల దోపిడీ అనే ఆలోచనకు భారత్ దూరంగా ఉంటుందని వివరించారు. మూడు దేశాల పర్యటన భాగంగా ప్రధాని మోదీ గయానాలో పర్యటించారు. గయానా పార్లమెంట్లో ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే సూత్రాన్ని అనుసరించాలి. అదే మనకు తారకమంత్రం. మనతోపాటు అందరినీ కలుపుకొని వెళ్లాలని, అందరి అభివృద్ధిలో మనం సైతం భాగస్వాములం కావాలని ప్రజాస్వామ్యం ప్రథమం స్ఫూర్తి బోధిస్తోంది. మనం నిర్ణయాలు తీసుకోవడంలో మానవత్వం ప్రథమం అనే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మానవత్వానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటే వచ్చే ఫలితాలతో మొత్తం మానవాళికి మేలు జరుగుతుంది. గ్లోబల్ సౌత్ దేశాలు మేల్కోవాల్సిన సమయం వచి్చంది. మనమంతా క్రియాశీలకంగా పనిచేయాలి. మనం ఒక్కతాటిపైకి రావాలి. మనం కలిసికట్టుగా పని చేస్తూ నూతన ప్రపంచ క్రమాన్ని(గ్లోబల్ ఆర్డర్) సృష్టించాలి. ప్రపంచం విషయానికొస్తే యుద్ధాలు, ఘర్షణలకు ఇది సమయం కాదు. యుద్ధాలకు దారితీస్తున్న పరిస్థితులను గుర్తించి, వాటిని రూపుమాపాల్సిన సమయం ఇది. భారత్–గయానా మధ్య గత 150 ఏళ్లుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. భారత్ దృష్టిలో ప్రతి దేశమూ కీలకమైనదే. ఏ ఒక్కటీ తక్కువ కాదు. ద్వీప దేశాలను చిన్న దేశాలుగా పరిగణించడం లేదు. వాటిని అతిపెద్ద సముద్ర దేశాలుగా భావిస్తున్నాం. ‘ప్రజాస్వామ్యం ప్రథమం, మానవత్వం ప్రథమం’ అనే స్ఫూర్తితో భారత్ ‘విశ్వబంధు’గా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభాలు తలెత్తితే అందరికంటే మొదట భారత్ స్పందిస్తోంది’ అని ప్రధాని మోదీ వివరించారు. -
నానో శాటిలైట్ సాధనలో తొలిమెట్టు.. పుణేలో గ్రౌండ్ స్టేషన్
మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ (MIT-WPU) సంస్థ నానో-శాటిలైట్ చొరవలో భాగంగా పుణే క్యాంపస్‌లో అత్యాధునిక గ్రౌండ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. శాటిలైట్ రిసెప్షన్, రేడియో ఆస్ట్రానమీ రెండింటిలోనూ సామర్ధ్యం కలిగిన ఈ కేంద్రాన్ని మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాద్ ప్రారంభించారు.రేడియో ఆస్ట్రానమీ పరిశోధన పురోగతికి, శాటిలైట్ కమ్యూనికేషన్ సామర్థ్యాలను మెరుగుపరచడానికి అవసరమైన విలువైన డేటాను ఈ గ్రౌండ్ స్టేషన్ అందిస్తుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ (డౌన్‌లింక్), కాస్మిక్ అబ్జర్వేషన్ సంక్లిష్ట పనులను ఏకకాలంలో నిర్వహించగల సామర్థ్యం ప్రపంచంలోనే అరుదైన ఈ కేంద్రానికి ఉంది.లో ఎర్త్ ఆర్బిట్ (LEO), మీడియం ఎర్త్ ఆర్బిట్ (MEO), హై ఎలిప్టికల్ ఆర్బిట్ (HEO), జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO)లోని ఉపగ్రహాల నుండి సిగ్నల్స్ అందుకోవడానికి రూపొందించిన ఆరు వేర్వేరు యాంటెన్నాలు ఈ గ్రౌండ్ స్టేషన్లో ఉంటాయి. ప్రత్యేకమైన డిష్ అండ్ హార్న్ యాంటెనాలు అధిక-ఫ్రీక్వెన్సీ సంకేతాలను స్వీకరిస్తాయి. వాటిని శక్తివంతమైన రేడియో ఆస్ట్రానమీ సాధనంగా మారుస్తాయి. అత్యంత సూక్ష్మమైన సంకేతాలు, గెలాక్సీ మ్యాపింగ్, డార్క్ మ్యాటర్, కాస్మోస్ రేడియో చిత్రాలను అధ్యయనం చేయడానికి వీలు కల్పిస్తాయి.గ్రౌండ్ స్టేషన్ వాతావరణ డేటాను సేకరించడానికి ఓపెన్ సోర్స్ ఉపగ్రహాల నుండి సిగ్నల్‌లను అందుకోగలదు, అలాగే క్యూబ్శాట్లు, నానోశాట్లు, మైక్రోసాట్ల నుండి టెలిమెట్రీని అందుకోగలదు.స్కూల్ ఆఫ్ సైన్స్ & ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అసోసియేట్ డీన్ డాక్టర్ అనుప్ కాలే, ప్రొఫెసర్ అనఘా కర్నే, డాక్టర్ డియోబ్రత్ సింగ్, డాక్టర్ సచిన్ కులకర్ణిలతో సహా 35 మంది మిట్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ విద్యార్థుల బృందం ప్రాజెక్ట్‌లో పని చేస్తోంది. -
ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం
బీజింగ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు. -
వృద్ధుడి సైకిల్ సందేశం.. మూడు నెలల్లో 7వేల కిలోమీటర్ల ప్రయాణం!
బరంపురం/ఒడిశా: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నగరానికి చెందిన 65 ఏళ్ల వృద్ధుడు సాహసయాత్రకు సిద్ధమయ్యాడు. స్థానిక కాపువీధికి చెందిన ఎ.కృష్ట్రారావు బరంపురం నుంచి రామేశ్వరం–అయోధ్య మీదు గా దేశంలోని ప్రఖ్యాత ప్రదేశాల్లో సైకిల్‌యాత్ర చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో స్థానిక ఫ్రెండ్స్ వెల్ఫేర్ క్లబ్ ఆధ్వర్యంలో బరంపురం గ్రామదేవత మాబుడి శాంతమ్మ ఆలయాన్ని బుధవారం దర్శించుకున్న ఆయన.. స్థానిక పాతబస్టాండ్ ప్రాంగణంలో సైకిల్‌యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో ఆశాంతి, అహింస రోజురోజుకీ పెరిగిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు. మనుషుల మధ్య అంతరాలు ఏర్పడి, దేశాలు, ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొందన్నారు. వైషమ్యాలు తొలగిపోయి, అంతా ప్రశాంతంగా మెలగాలని ఆకాంక్షిస్తూ సైకిల్‌యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. బరంపురం, రామేశ్వరం, అయోధ్య ప్రాంతాలను చుట్టి వస్తూ చివరగా పూరీ జగన్నాథుని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు. సగటున రోజూ 100 కిలోమీటర్లు చొప్పున మూడు నెలల్లో 7వేల కిలోమీటర్లు సైకిల్‌పై చుట్టి వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో కృష్ణారావు ఆకాంక్ష నెరవేరాలంటూ స్థానికులు ఆయనను ఉత్సాహ పరిచి, సాగనంపారు. చదవండి: భర్త, కుమారుడి ఎదుటే మహిళపై అత్యాచారం.. -
మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ సీఎం మమత, కేంద్రంలోనీ ఎన్డీయే ప్రభుత్వం మధ్య ఘర్షణ ఇంకా చల్లారడం లేదు. ఇటలీలో జరుగనున్న ప్రపంచ శాంతి సదస్సులో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరగా విదేశాంగ నిరాకరించింది. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఇటలీలో అక్టోబర్‌లో జరుగబోయే ప్రపంచ శాంతి సదస్సుకు పోప్ ఫ్రాన్సిస్, జర్మన్ చాన్సలర్ ఆంజెలా, ఇటలీ ప్రధాని మారియోలు హాజరుకానున్నారు. మమతను సైతం ఇటలీ ప్రభుత్వం ఆహ్వానించినట్లు సమాచారం. అందులో పాల్గొనడానికి తనకు అనుమతి ఇవ్వాలని మమత కోరగా విదేశాంగ శాఖ నిరాకరించింది. దీదీకి గతంలో చైనాకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదని, ఇప్పుడు ఇటలీకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దేవాన్ష్ భట్టాచార్య దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చదవండి: సైకిల్‌పై దుస్తులమ్ముకునే వ్యక్తి కొడుకు.. -
శాంతి కపోతం
చిన్నప్పుడే పెద్ద చదువులు చదివింది చిన్నప్పుడే జాతీయ అంతర్జాతీయ విజయాలను సొంతం చేసుకుంది చిన్నప్పుడే తనకంటే పెద్ద వాళ్లను చైతన్యపరిచింది.ఐక్యరాజ్య సమితి ఇరవై ఏళ్ల నైనా జైస్వాల్‌ను ప్రపంచ శాంతి రాయభారిగా నియమించింది.ఈ శాంతి కపోతం ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం పని చేస్తోంది. నైనా జైస్వాల్... బాల మేధావి. తరచూ వార్తల్లో ఉంటుంది. ఎనిమిదేళ్లకు టెన్త్ క్లాసు, పదేళ్లకు ఇంటర్, పదమూడేళ్లకు గ్రాడ్యుయేషన్, పదిహేనేళ్లకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇప్పుడు పీహెచ్డీ చేస్తోంది. పరిశోధన పూర్తయింది, ప్రెజెంటేషన్‌కు కొరోనా అడ్డొచ్చింది. చదువుతోపాటు క్రీడాకారిణిగా కూడా రాణించింది. టేబుల్ టెన్నిస్‌లో నేషనల్, ఇంటర్నేషనల్‌లో మొత్తం పాతిక టైటిల్స్‌ని సొంతం చేసుకుంది. మోటివేషనల్ స్పీకర్‌గా తొలి ఉపన్యాసం ఇచ్చే నాటికి ఆమె వయసు ఎనిమిది, ఇప్పుడు ఇరవై. దేశవిదేశాల్లో వందలాది ఉపన్యాసాలిచ్చింది. ఇవన్నీ చూసిన ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) ఈ నెల ఎనిమిదవ తేదీన ఆమెను ‘వరల్డ్ పీస్ అంబాసిడర్’గా నియమించింది. ఈ కొత్త బాధ్యతల్లో నైనా జైస్వాల్ ఐక్యరాజ్య సమితి చేపట్టిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మోటివేషనల్ స్పీకర్‌గా నైనా విద్యాసంస్థలతోపాటు మారుమూల ప్రదేశాల్లో నివసించే మహిళలను కూడా చైతన్యవంతం చేస్తోంది. ఈ సామాజిక చైతన్య కార్యక్రమాలే నైనాను ఐక్యరాజ్య సమితి పీస్ అంబాసిడర్‌ని చేశాయి. ఇప్పుడేం చేయాలి? నైనా జైస్వాల్ ఇప్పటి వరకు చేస్తున్న సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి పెట్టింది కీర్తికిరీటం మాత్రమే కాదు, అంతకంటే పెద్ద బాధ్యత కూడా. ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం ఐక్యరాజ్య సమితి చేపట్టిన సామాజిక లక్ష్యాలు పదిహేడు. అవి ఆకలి బాధలు, దారిద్య్రం లేని సమాజ నిర్మాణం. మంచి ఆరోగ్యం, నాణ్యమైన విద్య, స్త్రీ పురుష సమానత్వ సాధన, అందరికీ పరిశుభ్రమైన నీటిని అందించడం, సౌర శక్తి వనరును అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, గౌరవప్రదమైన ఉద్యోగ వృత్తి వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి, పరిశ్రమలు, మౌలిక రంగాల ఏర్పాటు, అసమానత్వాన్ని తగ్గించడం, నగరాలు– నివాస ప్రాంతాల నిరంతరత, బాధ్యతాయుతమైన వినియోగం– ఉత్పాదకత, వాతావరణ మార్పులు, నీటిలోపల నివసించే జీవుల జీవనభద్రత, భూమి మీద నివసించే జీవుల పరిరక్షణ, శాంతియుతమైన, న్యాయబద్ధమైన సంస్థల నిర్వహణ, లక్ష్యాల సాధనలో ప్రజలను భాగస్వాములను చేయడం. వీటిలో ప్రతి పదం వెనుక విస్తృతమైన పరిధి ఉంది. ఎంత చేసినా తరగని గనిలా పని ఉంటుంది. ఇంతపెద్ద బాధ్యతను లేద భుజాల మీద పెట్టింది యూఎన్ఓ. ఈ బాధ్యతకు ఎంపికైన తొలి ఇండియన్ నైనా జైస్వాల్. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు కూడా. ఈ ఏడాది సెప్టెంబర్ 21వ తేదీన బెర్లిన్ నగరం, బ్రాండెన్ బర్గ్ గేట్ వద్ద జరిగే వరల్డ్ పీస్‌డే సదస్సుకు హాజరయ్యి సదస్సులో ప్రసంగించనుంది. ఈ సదస్సులో వందకు పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారు. 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. సంగీత కవాతు కూడా ఉంటుంది. ఊహించని వరమే నైనా పీహెచ్‌డీతోపాటు ఆమె ప్రవృత్తిగా ఎంచుకున్న మోటివేషనల్ స్పీకర్‌గా ప్రసంగాలు కూడా సమాజం, మహిళలు, యువత, పిల్లల అభివృద్ధి ప్రధానాంశాలుగా ఉంటాయి. ‘రోల్ ఆఫ్ మైక్రో ఫైనాన్స్ ఇన్ ఉమెన్ ఎంపవర్మెంట్’ ఆమె పరిశోధనాంశం. మనదేశంలో మారుమూల ప్రదేశాల నుంచి యూఎస్‌లోని ప్రధాన నగరాల వరకు ఆమె వందకు పైగా ప్రదేశాల్లో పర్యటించి ప్రసంగించింది. ఇప్పుడు అదే పనిని మరింత విస్తృతంగా చేస్తానంటోంది నైనా. పీస్ అంబాసిడర్‌గా నేను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల మీదనే దృష్టి పెడతానంటోంది. ‘‘గ్రామాలకు చేయాల్సింది చాలా ఉంది. ప్రపంచం ఎప్పుడూ విశాలంగానే ఉంటుంది. అయితే ప్రపంచీకరణ కారణంగా దేశాలు దగ్గరైపోయాయి. డిజిటల్ యుగంలో సమాచార ప్రసారం వేగవంతమైంది. అయినా కొన్ని మారుమూల గ్రామాలు, అక్కడి మహిళలు ఆధునికత, అభివృద్ధికి దూరంగా ఉన్నారు. యూఎన్ఓ నిర్దేశించిన లక్ష్యాలను వాళ్లకు దగ్గర చేయగలిగితే గ్రామాల జీవన ముఖచిత్రమే మారిపోతుంది. వారిని సామాజికంగా చైతన్యవంతం చేయడంతోపాటు సాంకేతికాభివృద్ధి మీద అవగాహన కల్పిస్తే యూఎన్ఓ లక్ష్యాలు దాదాపుగా నెరవేరినట్లే. నేను ఇన్నాళ్లూ మహిళల కోసమే పని చేశాను. మహిళల సాధికారత సాధన గురించి అధ్యయనం కూడా చేశాను. ఈ సమయంలో వాళ్లకు అవగాహన ఏర్పరచడం కోసం నాకు మంచి అవకాశం వచ్చింది. నిజంగా నాకు సరైన సమయంలో మంచి అవకాశం వచ్చింది’’ అన్నది నైనా. ఈ సందర్భంగా యూఎన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పింది నైనా జైస్వాల్. – వాకా మంజులారెడ్డి -
ఆధ్యాత్మిక గురువు వాస్వానీ కన్నుమూత
పుణె: వయోభారంతో కొద్ది రోజులుగా ఆశ్రమంలో చికిత్సపొందుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాధు వాస్వానీ మిషన్ అధిపతి దాదా జేపీ వాస్వానీ (99) గురువారం తుదిశ్వాస విడిచారు. ‘గత 3 వారాలుగా పుణేలోని ఓ ప్రైవేటు ఆస్పతిలో వాస్వానీ చికిత్స పొందుతున్నారు. గత రాత్రే ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ఉదయం ఆశ్రమంలో కన్నుమూశారు’ అని మిషన్ సభ్యురాలు తెలిపారు. పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో 1918 ఆగస్టు 2న సింధి కుటుంబంలో వాస్వానీ జన్మించారు. వచ్చే నెలలోనే ఆయన వందో పుట్టిన రోజు కావడంతో మిషన్ సభ్యులు భారీగా వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఈలోపే కన్నుమూయడంతో భక్తులు, అభిమానులు శోకసంద్రంలో మునిగారు. వాస్వానీ సామాజిక సేవ, బాలిక విద్య, జంతు సంరక్షణ లాంటి సేవా కార్యక్రమాల్ని మిషన్ ద్వారా నిర్వహించేవారు. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయన భక్తులుగా మారారు. 150కి పైగా పుస్తకాలు.. వాస్వానీ 150కిపైగా ఆధ్యాత్మిక పుస్తకాలను రాశారు. వీటిలో ఇంగ్లిష్‌లో 50 పుస్తకాలు రాయగా.. సింధి భాషలో ఎక్కువగా రాశారు. ఆయన రచనలను మరాఠీ, హిందీ, కన్నడ, గుజరాతీ, అరబిక్, స్పానిష్, ఫ్రెంచ్, మాండరిన్, జర్మనీ, పలు విదేశీ భాషల్లోకి అనువదించారు. పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు. ప్రపంచ శాంతి కోసం ఆయన చేసిన కృషికి పలు అవార్డులు, బిరుదులు, సత్కారాలు పొందారు. ఐక్యరాజ్య సమితి అందించే ప్రతిష్టాత్మక యూ థాంట్ పీస్ అవార్డుని 1998లో అందుకున్నారు. గత మేలోనే రాష్ట్రపతి కోవింద్ వాస్వానీ మిషన్ సందర్శించి అక్కడి ఇంటర్నేషనల్ స్కూల్‌ని ప్రారంభించారు. వాస్వానీ 99వ పుట్టిన రోజు సందర్భంగా గతేడాది ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ సీనియర్ నేత అడ్వాణీ, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ తరచూ వాస్వానీ మిషన్‌ను సందర్శించేవారు. ప్రముఖుల సంతాపం.. దాదా వాస్వానీ మృతి పట్ల రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. ‘వాస్వానీ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన సమాజంలోని పేదలు, అభాగ్యుల కోసమే జీవించారు. బాలికలకు విద్యను అందించడం కోసం ఎంతగానో కృషి చేశారు’ అని పేర్కొంటూ ప్రధాని వరుస ట్వీట్లు చేశారు. ‘దాదా జేపీ వాస్వానీ నన్నెంతో ప్రభావితం చేశారు. 28 ఏళ్ల క్రితం అమెరికాలో జరిగిన ప్రపంచ సర్వమత సదస్సులో ఆయనతో కలసి పాల్గొనే అవకాశం దక్కింది. 2013లో వాస్వానీ మిషన్ స్థాపించిన నర్సింగ్ కళాశాల ప్రారంభించడానికి పుణేకు వెళ్లాను’ అని ఓ ట్వీట్లో మోదీ వెల్లడించారు. వాస్వానీ లేని లోటు పూడ్చలేనిదని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ పేర్కొన్నారు. అలాగే పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు సంతాపాన్ని తెలిపారు. నేడు సాయంత్రం అంత్యక్రియలు.. దాదా వాస్వానీ అంత్యక్రియలు శుక్రవారం వాస్వానీ మిషన్‌లోనే నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన పార్థివదేహాన్ని వందలాది మంది భక్తులు, అభిమానుల దర్శనార్థం అక్కడే ఉంచారు. అంత్యక్రియలకు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. -
‘ప్రపంచ శాంతికి వారధి భారతీయ సంస్కృతి’
శ్రీకాకుళం: విశ్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించే సనాతన ధర్మమే భారతీయ సంస్కృతి అని, ప్రపంచ శాంతికి వారధిలా భారతీయ సంస్కృతి దోహదపడుతుందని తెలుగుతల్లి చైతన్య సమితి అధ్యక్షుడు యర్నాగుల వేంకట రమణారావు అన్నారు. స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో సెట్‌శ్రీ సౌజన్యంతో యంగ్ ఇండియా సారథ్యంలో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల 6వ రోజు కార్యక్రమాన్ని హిందీ వికాస వేదిక ఆధ్వర్యంలో... స్థానిక చందు హిందీ పండిత శిక్షణ కళాశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య వక్తగా పాల్గొన్న ఆయన భారతీయ సంస్కృతి అనే అంశంపై మాట్లాడారు. ‘బేటీ పడావో–బేటీ బచావో’ జిల్లా కన్వీనర్, ప్రముఖ మహిళా న్యాయవాది కద్దాల ఈశ్వరమ్మ మాట్లాడుతూ స్వామి వివేకానంద ప్రభోదాలను యువత అనుసరించాలన్నారు. విశ్వగురువుగా భారత రూపు దిద్దుకోవాలని ఆకాంక్షించారు. హిందీ వికాస వేదిక అధ్యక్షుడు బాడాన దేవేభూషణరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి యంగ్ ఇండియా డైరెక్టర్ మందపల్లి రామకృష్ణారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె. శ్యామసుందరరావు, వివేకానంద సేవా సమితి సభ్యులు సోపింటి జగదీష్, కళాశాల అధ్యాపకులు ఎం. ఈశ్వరరావు, లావేటి కృష్ణారావు, రావాడ శ్రీనివాసరావు, ఎం. షణ్ముఖరావు, టి. అనిల్‌కుమార్, ఎల్. భార్గవనాయుడు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు స్వామి వివేకానంద, సోదరి నివేదిత చిత్ర పటాలకు జ్యోతి వెలిగించి అంజలి ఘటించారు. -
ప్రపంచశాంతికోసం సైకిల్ యాత్ర
గట్టు : ప్రపంచ శాంతిని కోరుతూ నాలుగేళ్లుగా ఓ వ్యక్తి సైకిల్‌యాత్ర కొనసాగిస్తున్నాడు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లా మటమారికి చెందిన ఆగస్టీన్ 2012లో సైకిల్‌యాత్రను చేపట్టాడు. తలకు హెల్మెట్ పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో పర్యటì స్తూ శుక్రవారం గట్టుకు చేరుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వంద కిలోమీటర్ల దాకా సైకిల్‌పై యాత్ర చేస్తున్నానన్నాడు. ఇప్పటి దాకా 1.2లక్షల కిలోమీటర్లు తిరిగానని, రాయిచూర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా గట్టులోకి చేరుకున్నానన్నాడు. దేశానికి ఆగస్టులోనే స్వాతంత్య్రం వచ్చినందున తన పేరు ఆగస్టీన్‌గా పెట్టుకున్నట్లు తెలిపాడు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అందరూ మొక్కలు నాటాలని కోరుతున్నాడు. వైకల్యం ఉన్నా లెక్కచేయకుండా ఓపిక ఉన్నంతవరకు ఈ యాత్రను కొనసాగిస్తానంటున్నాడు. జీవితాంతపు క్యాలెండర్‌ను వెంట పెట్టుకుని తిరుగుతున్నాడు. ఎవరైనా పుట్టిన తేదీ, సంవత్సరం చెబితే ఏ వారమో ఠక్కున చెబుతున్నాడు. ద్వేషాన్ని వీడి ప్రేమతో జీవనం సాగించే విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఆగస్టీన్ విజ్ఞప్తి చేస్తున్నాడు. -
ప్రయుత చండీయాగం చేస్తా
యాగస్థలిలో సీఎం కేసీఆర్ వెల్లడి ♦ తెలంగాణ సస్యశ్యామలం కావాలి ♦ ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి ♦ తెలంగాణ సిద్ధించినందుకే ఈ యాగం చేశా ♦ ఎప్పటికైనా ధర్మమే జయిస్తుంది.. అధర్మం నశిస్తుందని వ్యాఖ్య సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సస్యశ్యామలమై, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూసినప్పుడు శృంగేరి పీఠాధిపతి అనుమతితో ప్రయుత చండీయాగం (సప్తశతీ పారాయణాలు పది లక్షలసార్లు చేయడాన్ని ప్రయుత చండీయాగం అంటారు) నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలోనే శృంగేరి పీఠానికి వెళ్లి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అనుమతి కోరతానని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లిలో అయుత చండీయాగం ముగిసిన తర్వాత యాగశాల వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు పరిపూర్ణం కావాలని, నీటిపారుదల కోసం ప్రతి ఏటా రూ.25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించేలా దీవెనలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ‘‘2011లో శృంగేరి స్వామి వారి 60వ పుట్టిన రోజు సందర్భంగా చండీయాగం చేసినప్పుడు మేం తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నాం. ఆరాట పడుతున్నాం. ఆ సమయంలో నా మిత్రుడు అష్టకాల రామ్మోహన్రావు శృంగేరి పీఠం నుంచి ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆయన తెచ్చిన అక్షింతలు మీద చల్లుకొని తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే 100 శాతం అయుత చండీయాగం చేస్తానని దీక్ష తీసుకున్నా. అందుకే ఈ యాగం చేశాను’’ అని ముఖ్యమంత్రి వివరించారు. మనం నిమిత్త మాత్రులమని చెప్పా.. ‘‘గడా ఓఎస్డీ హన్మంతరావు ధర్మపత్ని, నా బిడ్డ ఎదురుగా నిల్చొని ఉన్నారు. నిప్పు రగిలి మంటలు లేస్తుంటే ఆ అమ్మాయి విషణ్ణ వదనంతో నిలబడింది. అప్పుడు నేను.. ఎందుకు తల్లీ.. బాధపడుతున్నావు.. మనం కేవలం నిమిత్త మాత్రులం అన్నాను’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ‘‘మళ్లీ అందరం వెళ్లి శాంతి మంత్రాలు జపించి, పూర్ణాహుతి చేసి యాగ పరిసమాప్తి చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వులు చూసిన. నిన్నటికే సుసంపన్నంగా కోటి జపాలు, 10 వేల పారాయణాలు పూర్తి చేసుకున్నాం. ఈ రోజు మహారుద్రయాగం నుంచి చతుర్వేద యాగాల వరకు కూడా పూర్ణాహుతి చేసుకున్నాం. అమ్మవారి 100 హోమగుండాల్లో పూర్ణాహుతి ఇవ్వడం జరిగిపోయింది. చివరి ఘట్టం మాత్రమే ఉంది.. మీరు ఆవాసానికి వెళ్లి రావచ్చని రుత్విక్కులకు చెప్పిన. ఆ సందర్భంగా చిన్న మంటలు చెలరేగితే.. నరహరి భట్టు గారు వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని ఒంటికాలుపై నిలబడి పరిసమాప్తి చేశారు. తెలియని వాళ్లు కొందరు గాబరా పడ్డా.. నేను గాబరా పడలేదు. యాగాలు చేయడం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలుగా చేస్తున్నా. కొందరు అవాకులు, చవాకులు పేలారు. నేను పట్టించుకోలేదు’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ధర్మం జయిస్తుంది.. తెలంగాణ ప్రజలు చిరునవ్వుతో బతకాలని కోరుకుంటున్నా. ధర్మం తప్పక జయిస్తుంది. అధర్మం నశిస్తుంది..’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సిద్ధాంతి శర్మకు రవీంధ్రభారతిలో సన్మానం చేయాలని నిర్ణయించామని, వారు శతాధిక యజ్ఞాలు చేశారని చెప్పారు. ‘‘కొందరు మిత్రులు మన సంప్రదాయంపై దాడి జరుగుతోందని నాతో అన్నారు. మన సంప్రదాయం గురించి బాధపడాల్సిన పనిలేదని వారికి చెప్పాను. తల్లి పిల్లవాడికి చనుబాలు ఇస్తూ జోలపాట పాడుతున్నప్పుడే పిల్లవాడికి మన సంస్కృతిని ఎక్కిస్తుంది. జో అచ్చుతానందా... జోజో ముకుంద... రామ పరమానంద లాలి గోవిందా... అంటదే తప్ప జో కంస... జో దుర్యోధన... జో కుంభకర్ణ... జో రావణా అని ఏ తల్లీ అనదు. మన సంప్రదాయంలో, మన సంస్కారంలో అంతటి మహోన్నతమైన విశిష్టత ఉంది. నా బోటి చిన్నవాళ్లు భవిష్యత్‌లో ఇంకా ఎంతో మంది పుడుతారు. బ్రాహ్మణోత్తములు, రుత్వికోత్తములు కార్య నిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కారం సుసంపన్నంగా, సుభిక్షంగా ఉంటది. ధర్మం ఎల్లవేళలా విస్తరిస్తూనే ఉంటది. నా మనుమడు ఉన్నడు.. నేను సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ అబ్బాయి కూడా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నిన్న నాకు అయ్యవార్లు చెప్పారు. నీ మనమవడికి కూడా మీ సంస్కారం నేర్పిస్తున్నారు.. శుభం అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా మనవడికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించాయి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. -
అమ్మవారు అనుగ్రహిస్తే ప్రయుత చండీయాగం నిర్వహిస్తా
-
సర్వమత పర్వం
పీస్ ఫెస్టివల్ - గజవెల్లి రాజు, సాక్షి, పోచమ్మ మైదాన్, వరంగల్ అది 1993వ సంవత్సరం. దీపావళి పండుగ రోజు. హిందువుల పిల్లలు టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతున్నారు. దీన్ని చూసిన హన్మకొండ జులైవాడకు చెందిన ఇద్దరు ముస్లిం చిన్నారులు దీపావళి పండుగను మనం ఎందుకు జరుపుకోవడం లేదని తమ తండ్రి మహ్మద్ సిరాజుద్దీన్‌ను ప్రశ్నించారు. రెవెన్యూ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అయిన ఆయనలో ఈ ప్రశ్న కొత్త ఆలోచనలకు తెర తీసింది. మతాలు, కులాల వారీగా కాకుండా అందరూ కలిసి జరుపుకునేందుకు పండుగలే లేవా అని ప్రశ్నించుకున్న సిరాజుద్దీన్లో రెండేళ్ల పాటు సాగిన అంతర్మథనంలోంచి ‘ప్రపంచ శాంతి పండుగ’ ఆవిర్భవించింది. సమితి ఆమోదం తన పిల్లలు వేసిన ప్రశ్నతో 1995లో ప్రపంచ శాంతి పండగ పేరిట ఓ పుస్తకాన్ని రాశారు సిరాజుద్దీన్. ఆ పుస్తకాన్ని 1996లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బౌత్రోస్ బౌత్రోస్ ఘలీకి పంపించారు. దానికి స్పందనగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని శాంతి పండుగను జరుపుకోవాలని సూచిస్తూ సమితి కార్యాలయం నుంచి సిరాజుద్దీన్‌ను లేఖ అందింది. ఏటా ఫిబ్రవరి 28న నాలుగేళ్లకోసారి వచ్చే లీపు సంవత్సరంలో 29 రోజులు ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకత ఉన్న ఫిబ్రవరి నెలలో 28వ తేదీన ప్రపంచ శాంతి పండగను నిర్వహించాలని సిరాజుద్దీన్ నిర్ణయించారు. ఈ విషయాన్ని ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు చెబితే.. ఎవరు వచ్చినా, రాకున్నా మనమిద్దరమే పండుగ జరుపుకుందామని చెప్పారు. అలా తొలిసారి 1997 ఫిబ్రవరి 28న హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో రెండు టెంట్లు వేశారు. ప్రతీ టెంట్లో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారు. ఇంతలో ఓ టెంట్లో నుంచి మహిళలు మరో టెంట్‌లోకి వెళ్లి తమ పండుగకు రావాలని ఆహ్వానించగా.. అందరూ కలిసి రెండు టెంట్ల నడుమ శాంతి జెండా ఎగరవేశారు. ఇక పురుషులూ పిలుచుకుని శాంతి కపోతాలు ఎగరవేశారు. అనంతరం అందరూ ఆప్యాయంగా, సందడిగా గడిపారు. అలా శాంతి పండుగ ప్రారంభమైంది. ఫొటో: సంపెట వెంకటేశ్వర్లు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే వారిని గుర్తించి 2007 సంవత్సరం నుంచి ‘శాంతి దూత’ అవార్డులు ఇస్తున్నాం. ఈ యేడు హన్మకొండలోని రాయల్ గార్డెన్స్‌లో జరుగుతున్న వేడుకల్లో చందుపట్ల దేవేందర్‌రెడ్డి, డాక్టర్ అద్దెపల్లి రామ్మోహన్రావు, ప్రొఫెసర్ కోదండరామ్‌లకు అవార్డులు ప్రదానం చేయనున్నాం. - మహ్మద్ సిరాజుద్దీన్, ఫౌండర్, వరల్డ్ పీస్ ఫెస్టివెల్ సొసైటీ ఇంటర్నేషనల్ -
రైడ్ ఫర్ ఫీస్
ప్రపంచ శాంతిని కోరుతూ బెంగళూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోషన్ కుమార్ సోలో బైక్‌థాన్ యాత్రను చేపట్టాడు. గత బుధవారం బెంగళూర్ నుంచి హైదరాబాద్ వరకు బైక్‌పై ఒంటరిగా వచ్చాడు. తన యాత్ర వెనకున్న ఉద్దేశాన్ని దారి పొడవునా వివరించాడు. డాక్టర్‌గానే కాదు బెంగళూరులోని ‘హ్యాపీ టు హెల్ప్’ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గానూ సామాజిక బాధ్యత భుజానికెత్తుకున్న రోషన్ కుమార్.. యాత్రవెనకున్న ఉద్దేశాన్ని సిటీప్లస్కు వివరించాడు. - వీఎస్ ప్రపంచాన్ని టైజం వణికిస్తోంది. ఇటీవల పెషావర్ ఘటన కలచివేసింది. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నా వంతుగా ప్రపంచ శాంతి కోరుతూ బైక్ రైడ్ చేయాలనుకున్నా. నా ఆలోచనను మా ఫౌండేషన్ సభ్యులతో పంచుకన్నాను. వారి ప్రోత్సాహంతో బెంగళూర్ నుంచి హైదరాబాద్‌కు సోలో బైక్‌థాన్ చేశాను. ఉదయం ఆరు గంటలకు మొదలైన నా రైడ్ వివిధ పట్టణాల మీదుగా.. భాగ్యనగరానికి చేరుకుంది. ఆత్మీయంగా ఆదరించారు... బెంగళూరు నుంచి హైదరాబాద్ వరకు రోడ్ చాలా బాగుంది. దారి పొడవునా ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. నాకు సహకారంగా ఉండేందుకు పైలట్ కారులో వచ్చిన ఐదుగురు సభ్యులు అన్ని ప్రాంతాల్లో కరపత్రాలు ఇచ్చారు. మా మెసేజ్‌ను పూర్తి స్థాయిలో తీసుకెళ్లగలిగామని భావిస్తున్నా. 46 ఏళ్ల వయసున్నా సామాజిక అవగాహన కల్పించాలన్న సంకల్పమే నన్ను ముందుకు సాగేలా చేసింది. సామాజిక సేవలో యువతను భాగస్వాములను చేసేందుకే బైక్‌ను ఎంచుకున్నాను. హైదరాబాద్‌లోనూ సేవలు... ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా happy2help foundation సేవలందిస్తోంది. పేద విద్యార్థుల చదువుతో పాటు ఆర్థికంగా వెనుకబడి ఉన్న క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యంతో పాటు మందులు అందిస్తున్నాం. ‘ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్’ పేరిట మరణానికి దగ్గరలో ఉన్నవారికి పూర్తి స్థాయిలో వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నాం. చివరి రోజుల్లో వారు మంచిగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నాం. ఈ సేవలను త్వరలో హైదరాబాద్‌లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. ఇక్కడి వైద్యులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశిస్తున్నాను. నా రైడ్ ద్వారా సమకూరిన నిధులను ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవలకు ఉపయోగిస్తాం. సామాజిక సేవలో యువత ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా నా కార్యక్రమాలు ఉంటాయి. ‘2015 జనవరి 26న బెంగళూరు నుంచి పుణేకు కొంతమంది సభ్యులతో కలిసి బైక్ యాత్ర చేపట్టనున్నామని’ వివరించాడు. -
అగ్నిధార
జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సత్వం: ‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న నిజాం కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు. దాశరథికి సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, అది ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు. ‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు. 1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’ గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా రాయడం దాశరథి నిజాయితీ! ‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’. ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు. ఆయన ‘ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’! -
సూపర్ కాప్.. లక్ష్మీమాధవి
శాంతిదూత: ఆరేళ్ల కిందట అనుకోని రోడ్డు ప్రమాదం. ‘ఎక్కువ సేపు నిలబడడం కూడా కుదరదు’అన్నారు డాక్టర్లు. ఇక ఉద్యోగానికేమెళ్తుంది అనుకున్నారు. ఆమె సంకల్పం, పట్టుదల ముందు అడ్డంకులన్నీ మోకరిల్లాయి. ఆమె మళ్లీ నిలబడటమే కాదు పరుగులు తీసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ‘శాంతిదళం’కి ఎంపికయ్యింది. ఆ ఆత్మవిశ్వాసం పేరు లక్ష్మీమాధవి. ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. వచ్చేనెల ప్రపంచశాంతికోసం పనిచేసేందుకు వెళ్తున్న ఆ పోలీస్ స్టోరీ... ఐక్యరాజ్యసమితి ‘శాంతి దళం’ పేరిట ఏటా అన్నిదేశాల నుంచి పోలీసులను ఎంపిక చేస్తుంటుంది. ఈసారి మన దేశం నుంచి 157 మంది ఎంపికయ్యారు. అందులో తొమ్మిది మంది మహిళలు. దక్షిణ భారతదేశంనుంచి ఒకే ఒక్క మహిళ ఇన్స్పెక్టర్ లక్ష్మీమాధవి. ‘డిపార్టుమెంట్లోకి వచ్చిన కొత్తలో ఎ.ఆర్ శ్రీనివాస్ అనే పోలీసుఅధికారి బోస్నియా దేశం వెళ్లారు. మన దగ్గర చిన్నస్థాయిలో పనిచేసే పోలీసుకు విదేశాల్లో అవకాశమెలా వస్తుంది? అనిపించింది. వెంటనే వివరాలు కనుక్కుంటే తెలిసింది ‘శాంతి దళం’ గురించి. ఎనిమిదేళ్లు పనిచేసిన ఏ పోలీసు అధికారి అయినా అప్లై చేసుకోవచ్చు. పరీక్షలన్నింటిలో నెగ్గితే ఏదో ఒక దేశానికి పంపించి ఏడాదిపాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు’ అని శాంతిదళం గురించి వివరించారామె. సైప్రస్ దేశానికి... వచ్చేనెల 16న తల్లిదండ్రులతో సైప్రస్ దేశానికి బయలుదేరనున్నారు లక్ష్మీమాధవి. ‘పోలీసు వృత్తిలో ఆడా మగా ఏముంటుంది. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అమ్మానాన్నలను కూడా తీసుకెళుతున్నాను. నాన్న సీతారామయ్య విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. నేను, తమ్ముడు. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టం. 2002లో ఎస్ఐగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి సీఐ దాకా ఎదిగాను. ఈ మధ్యనే సేవా మెడల్ కూడా వచ్చింది. ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినా.. నాకు ప్రమాదం జరిగినపుడు డిపార్ట్మెంట్ నా వెన్నుతట్టిన తీరు ముందు అన్నీ బలాదూరే’ అని ఆ విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు లక్ష్మీ మాధవి. పునర్జన్మ... ఆరేళ్ల కిందట శ్రీనగర్ కాలనీలో ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వర్తిస్తుండగా రాంగ్రూట్లో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లక్ష్మీమాధవిని గుద్దింది. తలకు, వెన్నెముకకు బలమైన గాయాలయ్యాయి. వారం రోజులు కోమా. ఏడాదిపాటు మంచంమీద నుంచి కదలలేకపోయింది. తర్వాత ఓపికంతా కూడదీసుకుని పట్టుదలగా అడుగు తీసి అడుగు వేస్తున్న సమయంలో ‘ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో ఎప్పుడూ పరిగెత్తకూడదు, ఎక్కువసేపు నిలబడకూడదు, బరువులు ఎత్తకూడదు, డ్రైవింగ్ చేయకూడదు’ అన్నారు డాక్టర్లు. అది విన్న తల్లిదండ్రులు భోరుమన్నారు. కానీ మాధవి అధైర్య పడలేదు. ‘అందరూ పునర్జన్మ అన్నారు. నేను మరోసారి పోలీసు ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకున్నట్టు భావించాను. అంతే శ్రమించాను. మళ్లీ ఉద్యోగంలోకి చేరతానని డీజీపీగారిని కలిస్తే ‘వెల్కమ్’ అన్నారు. నూతనోత్సాహంతో పనిచేశాను. జరిగిన ప్రమాదాన్ని నన్ను నేను నిరూపించుకోవడానికో అవకాశంగా భావించా. 2012లో శాంతిదళానికి అప్లై చేశా. వారు నిర్వహించిన పరీక్షల్లో అన్నిటికన్నా కఠినమైనది డ్రైవింగ్ టెస్ట్. ఇరుకు సందులో జీపులను పార్కు చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ డ్రైవ్ చేయ డం, ఆ టెస్ట్‌లో నాకు నూటి కి నూరు మార్కులు పడ్డాయి’ అని సంతోషంగా చెప్పారు. నచ్చితే...అక్కడే శాంతిదళంలో సేవలు నచ్చితే మరికొన్నేళ్లపాటు అక్కడే విధుల్లో కొనసాగిస్తారు అధికారులు. ‘ఇప్పటివరకు దేశం దాటింది లేదు. సైప్రస్ గురించి కొన్ని వివరాలు నెట్లో తెలుసుకున్నా. ఎందుకైనా మంచిదని తినే వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. అక్కడ విధుల్లో మన ఆయుధాలనే వినియోగించాలి. ఆ దేశ పోలీసువ్యవస్థతో మమేకమై ప్రపంచశాంతికి మా వంతు సేవ చేయడమే ‘శాంతి దళం’ లక్ష్యం. మా లక్ష్యం కూడాను’ అని ముగించారు లక్ష్మీమాధవి. చిన్నవయసులోనే పొరుగుదేశాలకు సేవలందించడానికి వెళుతున్న మన ఇంటి లక్ష్మికి మనం కూడా ఆల్‌దిబెస్ట్ చెబుదాం. - భువనేశ్వరి.. ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
నడిచి.. నడిచి.. నడక మరిచాడు..
చిత్రంలోని వ్యక్తి పేరు మణి మణిథన్. తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ఉంటాడు. ఫొటో చూసి చెప్పండి. ఇతడేం చేస్తున్నాడో.. వెనక్కి తిరిగిచూస్తున్నాడు అంటారు అంతేగా.. కానీ.. ఆయన వెనక్కి తిరిగి చూడటం లేదు.. వెనక్కి నడుస్తున్నాడు. అదీ 25 ఏళ్లుగా..!! ఎందుకోసం అంటే.. ప్రపంచ శాంతి కోసమని చెబుతాడు. అప్పట్లో దేశంలో జరిగిన పలు హింసాత్మక సం ఘటనలతో కదిలిపోయిన మణి.. 1989 నుంచి ఇలా వెనక్కి నడవటం మొదలుపెట్టాడు. ఇలా ఓ సారి నగ్నంగా.. చెన్నై వరకూ నడిచాడు. ఢిల్లీకి డ్రెస్ వేసుకుని.. పోయి వచ్చాడు. ఇదంతా అలా ఉంచితే.. వెనక్కి నడిచి.. నడిచి.. ఇప్పుడు ముం దుకు నడవడమెలాగన్న సంగతిని మరచిపోయాడట! మా మూలుగా నడవాలని ప్రయత్నించినప్పు డు.. చిన్న పిల్లల్లా తప్పటడుగులు వేస్తున్నాడట. ఇంతకీ.. ఈ వెనకడుగు మానే సి.. ముందడుగు ఎప్పుడు వేస్తావని అడిగితే.. ప్రపంచ శాంతి సాధించినప్పుడే అని మణి చెబుతున్నాడు. అదెప్పుడొస్తుం దో.. మణి మళ్లీ మామూలుగా ఎప్పుడు నడుస్తాడో.. వేచి చూద్దాం మరి.. -
ఆహార భద్రతతో ప్రపంచ శాంతి: స్వామినాథన్
వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తిరుపతి, న్యూస్‌లైన్: మానవాళి శ్రేయస్సుకు ఆహారభద్రత అవసరమని, ఆహార భద్రతతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతోందని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, గ్రీన్ రివల్యూషన్ పితామహులు ఎంఎస్.స్వామినాథన్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీ య సంస్కృత విద్యాపీఠంలో బుధవారం మాడభూషి అనంతశయనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్, సొసైటీ ఫర్ హంగర్ ఎలిమినేషన్ సంస్థలు సదస్సు నిర్వహిం చాయి. సదస్సులో స్వామినాథన్ మాట్లాడుతూ ఆకలిని నిర్మూలిస్తేనే ప్రపంచశాంతి లభిస్తుందన్నారు. మనుషులు ఆకలితో అలమటిస్తుంటే శాంతిని తీసుకు రాలేమని చెప్పారు. 2013లో అమలులోకి వచ్చిన ఆహార భద్రత బిల్లు ఆకలి నిర్మూలనకు దోహదపడుతుందని చెప్పారు. 1943లో బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైన కరువు సంభవించిందని, అప్పటి నుంచి ఆహార భద్రత బిల్లు కోసం ప్రయత్నిస్తే 2013కు సాధ్యపడిందన్నారు. ఆహారం పొందడం ప్రతి ఒక్కరికీ హక్కుగా లభించడం ఆనందదాయకమని చెప్పారు. ఆహార భద్రతకు నష్టం వాటిల్లకుండా ఉండాలంటే నీటి వృథాను అరికట్టి ప్రతి నీటి చుక్కను జాగ్రత్తగా కాపాడుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి 2025 లోపల ప్రపంచంలో ఆకలి సమస్య లేకుండా చూడాలనే లక్ష్యం పెట్టుకుందని, ఈ లక్ష్యం మనదేశంలో ఏ మేరకు అమలవుతుందో వేచి చూడాల్సిందేనన్నారు. అనంతరం సొసైటీ ఫర్ హంగర్ ఎలిమినేషన్ సంస్థ అధ్యక్షుడు వి.రాజగోపాల్ రచించిన ‘హంగర్ ఫుడ్ సెక్యూరిటీ, సోషియో ఎకనామిక్ సినారియో’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. విద్యాపీఠం వీసీ హరేకృష్ణ శతపతి మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ చేసిన సేవలు భవిష్యత్ తరాలకు ఆదర్శమని చెప్పారు. శాసన సభ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న స్వామినాథన్ స్వామినాథన్ బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం అన్ని విధాలా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అవినీతిలేని సమాజం, సామాన్య జీవితం, ఆధ్మాత్మిక విలువలతో కూడిన జీవనమే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలన్నారు. అలాంటి మార్గంలో దేశం నడిచేలా చూడాలని వేంకటేశ్వర స్వామిని కోరుకున్నానని చెప్పారు. -
మనోగళం: ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు!
ఇతరుల్లో మీకు నచ్చేది/నచ్చనిది? నచ్చేది ప్లీజింగ్ పర్సనాలిటీ. నచ్చనిది అహంభావం. మీలో మీకు నచ్చేది? నాలోని ప్రేమతత్వం, మానవత్వం. నేను ప్రపంచాన్ని ప్రేమిస్తాను... మనస్ఫూర్తిగా! మీలో మీకు నచ్చనిది? కాస్త త్వరగా విసిగిపోతాను. కష్టపడి ఓ యాభై శాతం తగ్గించుకున్నాను. పూర్తిగా మారడానికి ట్రై చేస్తున్నాను. మీ ఊతపదం? నచ్చినవాళ్లందరినీ ‘బంగారం’ అంటుంటాను. మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి/ఎందుకు? మా అమ్మ. నిజమైన ఆత్మానందం ఎదుటివారికి సాయపడటంలోనే ఉంటుందని ఆవిడే చెప్పింది నాకు. ఎందుకిలా చేశానా అని మీరు బాధపడేది ఏదైనా ఉందా? లేదు. నేను వేసే ప్రతి అడుగూ భగవత్ప్రేరణతోనే పడుతుందని నమ్ముతాను. కాబట్టి చేసిన దానికి ఎప్పుడూ చింతించను. అత్యంత సంతోషపడిన సందర్భం? 2000వ సంవత్సరం, జూలై 30. నా కూతురు సంస్కృతి పుట్టిన రోజు. తనని నేను తొలిసారి చూసిన రోజు. నా జీవితంలో ఆ రోజు కలిగినంత ఆనందం మరెప్పుడూ కలగలేదు. అత్యంత బాధ కలిగించిన సందర్భం? సత్య సాయిబాబా మరణం. ఆ రోజు నేను పడిన బాధ వర్ణనాతీతం. ఆకలి విలువ తెలిసిన క్షణం? భారతీయ విద్యాభవన్‌లో పని చేస్తున్నప్పుడు ఓసారి (1986) నా ఫుడ్ కూపన్స్ అయిపోయాయి. మళ్లీ తీసుకోవాలంటే జీతం రావాలి. అంతవరకూ భోజనం పెట్టమని క్యాంటీన్ వాడిని అడగడానికి మనసు రాలేదు. దాంతో రెండు రోజుల పాటు నీళ్లు మాత్రమే తాగాను. అప్పుడు తెలిసింది ఆకలి బాధ ఎలా ఉంటుందో! ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉందా? ఉంటే ఎవరికి? ఎవరినైనా బాధపెట్టానని గ్రహిస్తే వెంటనే క్షమాపణ చెప్పేస్తాను. ఒకవేళ గ్రహించలేకపోయి ఎవరికైనా చెప్పకుండా ఉంటే... ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇప్పుడే చెప్పేస్తున్నాను. నన్ను క్షమించండి. మీ గురించి ఎవరికీ తెలియని ఓ విషయం? నేను పాటలు పాడతానని అందరికీ తెలుసు కదా! కానీ నేను డ్యాన్స్ కూడా చేస్తాను. ఇంట్లో నా చిట్టితల్లి సంస్కృతి, నేను పాటలు వింటూ డ్యాన్స్ చేస్తుంటాం! మిమ్మల్ని భయపెట్టే విషయం ఏమైనా ఉందా? మోసం అంటే భయం. మోసం చేసేవాళ్లంటే ఇంకా భయం. ఎలాంటి సమయాల్లో అబద్ధాలాడతారు? జీతం కోసం ఆడతాను తప్ప జీవితం కోసం ఆడను. వృత్తిపరంగా కొన్నిసార్లు చెప్పక తప్పదు. దానివల్ల ఎవరికీ నష్టం ఉండదు. కానీ వ్యక్తిగతంగా చెప్పే అబద్ధాలు అవతలివారికి హాని కలిగిస్తాయి. అందుకే అలాంటివి చెప్పను. ఎలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెడుతుంటారు? సేవా కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చుపెడతాను. తర్వాత నా భార్య సురేఖ కోసం, నా కూతురి కోసం ఖర్చు పెడతాను. ఎప్పుడైనా ఏదైనా షాప్‌కి వెళ్తే వాళ్లిద్దరికీ పది, పదిహేను జతల బట్టలు ఒకేసారి కొనేస్తుంటాను! మీరు నమ్మే సిద్ధాంతం...? మనుషుల మెచ్చుకోలు కోసం కాకుండా భగవంతుని మెచ్చుకోలు కోసం బతకాలి. ఎప్పటికైనా చేసి తీరాలనుకునేది? ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలన్నది నేనేనాడో ఏర్పరచుకున్న లక్ష్యం. ఇన్నాళ్లూ అదే చేశాను. ఇప్పుడూ అదే చేస్తున్నాను. ఇక ముందు కూడా ఆ దిశగానే కృషి చేస్తాను. దేవుడు కనిపిస్తే ఏ వరం అడుగుతారు? అందరికీ సమదర్శన దృష్టి ఇవ్వమని అడుగుతాను. అది వచ్చిననాడు ఈ ప్రపంచమే మారిపోతుంది. నదికి సమదర్శన దృష్టి ఉంది. చెట్టుకు కూడా ఉంది. కానీ హార్దిక సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోయాక మనిషికి ‘సమదర్శన దృష్టి’ పోయి ‘తన దర్శన దృషి’్ట వచ్చింది. మీ జీవితంలో ఒకే ఒక్క రోజు మిగిలివుందని తెలిస్తే... ఆ రోజును ఎలా గడుపుతారు? నా భార్యాబిడ్డలతో కలిసి భగవంతుడిని ధ్యానం చేస్తూ గడిపేస్తాను. మరణానికి భయపడతారా? చావుకు భయపడుతూ... ప్రతిరోజూ చస్తూ బతకడం నాకు నచ్చదు. మరణం రాక తప్పదు. ఎప్పుడొస్తుందో తెలియని దానికోసం భయపడటం అనవసరం. అందరికీ ఎలా గుర్తుండిపోవాలనుకుంటారు? గజల్ శ్రీనివాస్ ఒక కారణంతో పుట్టాడు, దానికోసమే జీవించాడు అని అంతా అనుకోవాలి. మళ్లీ జన్మంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటారు? మళ్లీ జన్మ అంటే ఈ జన్మకు సీక్వెల్ కదా! అందుకే నేను గజల్ శ్రీనివాస్ 2గా పుట్టాలని కోరుకుంటాను. - సమీర నేలపూడి