నడిచి.. నడిచి.. నడక మరిచాడు.. | A man in India has been promoting world peace for 25 years | Sakshi
Sakshi News home page

నడిచి.. నడిచి.. నడక మరిచాడు..

Published Fri, Jun 6 2014 12:32 AM | Last Updated on Sat, Sep 2 2017 8:21 AM

నడిచి.. నడిచి.. నడక మరిచాడు..

నడిచి.. నడిచి.. నడక మరిచాడు..

చిత్రంలోని వ్యక్తి పేరు మణి మణిథన్. తమిళనాడులోని తిరుపత్తూర్‌లో ఉంటాడు. ఫొటో చూసి చెప్పండి. ఇతడేం చేస్తున్నాడో.. వెనక్కి తిరిగిచూస్తున్నాడు అంటారు అంతేగా.. కానీ.. ఆయన వెనక్కి తిరిగి చూడటం లేదు.. వెనక్కి నడుస్తున్నాడు. అదీ 25 ఏళ్లుగా..!! ఎందుకోసం అంటే.. ప్రపంచ శాంతి కోసమని చెబుతాడు. అప్పట్లో దేశంలో జరిగిన పలు హింసాత్మక సం ఘటనలతో కదిలిపోయిన మణి.. 1989 నుంచి ఇలా వెనక్కి నడవటం మొదలుపెట్టాడు.
 
 ఇలా ఓ సారి నగ్నంగా.. చెన్నై వరకూ నడిచాడు. ఢిల్లీకి డ్రెస్ వేసుకుని.. పోయి వచ్చాడు. ఇదంతా అలా ఉంచితే.. వెనక్కి నడిచి.. నడిచి.. ఇప్పుడు ముం దుకు నడవడమెలాగన్న సంగతిని మరచిపోయాడట! మా మూలుగా నడవాలని ప్రయత్నించినప్పు డు.. చిన్న పిల్లల్లా తప్పటడుగులు వేస్తున్నాడట. ఇంతకీ.. ఈ వెనకడుగు మానే సి.. ముందడుగు ఎప్పుడు వేస్తావని అడిగితే.. ప్రపంచ శాంతి సాధించినప్పుడే అని మణి చెబుతున్నాడు. అదెప్పుడొస్తుం దో.. మణి మళ్లీ మామూలుగా ఎప్పుడు నడుస్తాడో.. వేచి చూద్దాం మరి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement