ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం | Russia-Ukraine War: US President Joe Biden and Chinese leader Xi Jinping discussed the war in Ukraine | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతికి ఉమ్మడి సహకారం

Published Sat, Mar 19 2022 5:00 AM | Last Updated on Sat, Mar 19 2022 5:00 AM

Russia-Ukraine War: US President Joe Biden and Chinese leader Xi Jinping discussed the war in Ukraine - Sakshi

బీజింగ్‌: ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం మనం కోరుకోని సంక్షోభం అని చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ అన్నారు. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, ఇందుకోసం ఉమ్మడిగా సహకారం అందిద్దామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు సూచించారు. ఇరువురు నేతలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో శాంతి సామరస్యం, స్థిరత్వం కనిపించడం లేదని అన్నారు. దేశాలు ఏవైనా సరే యుద్ధ రంగంలో కలుసుకొనే పరిస్థితి రాకూడదని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement