వర్జీనియా: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 2022 జులై లో వాషింగ్టన్ డీసీలో నిర్వహించబోయే 17వ కాన్ఫరెన్స్ కమిటీ ప్రారంభ సమావేశం వర్జీనియాలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆటా కాన్ఫరెన్స్ బృందం 2022 జూలై 1 నుంచి 3 వరకు జరగనున్న ఆటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ నిర్వహాణ గురించి చర్చించారు. ఈ వేడుకులకు సంబంధించి 200 మంది వాలంటీర్లతో 80 కమిటీ లను ఏర్పాటు చేశామని ఆటా ప్రతినిధులు తెలిపారు.
ఈ సమావేశాన్ని ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ అడ్వైజరీ చైర్ జయంత్ చల్లా, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు, కోఆర్డినేటర్ కిరణ్ పాశ్య, కాన్ఫరెన్స్ డైరెక్టర్ కేకే రెడ్డి, కో-కన్వీనర్ సాయి సుదిని, కో-ఆర్డినేటర్ రవి చల్లా, కో-డైరెక్టర్ రవి బొజ్జా మరియు స్థానిక కోఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు నిర్వహించారు. ఈ కమిటీ ఫ్రారంభ సమావేశానికి ఆటా బోర్ద్ సభ్యులు న్యూజెర్సి రాష్ట్రం నుంచి రవి గూడురు, శరత్ వేముల షికాగొ నగరం నుంచి సీనియర్ ఆటా సభ్యులు చల్మ బండారు, మహేందెర్ ముస్కుల పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) అధ్యక్షురాలు సుధ కొండపు గారు మాట్లాడుతూ.. ఆటా మహోత్సవ వేడుకలకు క్యాట్స్ సహ ఆతిధ్య సంస్థ గా వ్యవహరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్ కమిటీ కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు హనిమి వేమిరెడ్డి, ప్రవీణ్ దాసరి, కౌశిక్ సామ, రవి చల్లా, హర్ష బారెంకబాయి మరియు లోహిత్ రెడ్దిలు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment