సాక్షి, విశాఖ: ఆంధ్ర యూనివర్సిటీలో బుధవారం యూనివర్సిటీ వీసీల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు గవర్నర్ నరసింహన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ ఏపీలోని అధ్యాపకులు, విద్యార్థుల కోసం బయెమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు. అదే విధంగా విద్యాలయాల్లో ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యారంగంలో విశ్వవిద్యాలయాల విజన్, ర్యాంకులు మెరుగు పరుచుకోవడానికి అనుసరిస్తున్న విధానాలు, బయోమెట్రిక్ విధానం అమలు- ప్రగతి, అనుబంధ కళాశాలల వెబ్‌సైట్‌లను వర్సిటీ వెబ్ సైట్‌లతో అనుసంధానించడం, ప్రాజెక్టులు, నిధులు సాధించే విధానాలు, నూతన విశ్వ విద్యాలయాలకు అందించిన క్యాపిటల్ ఫండ్‌ను ఖర్చు చేస్తున్న విధానం, స్కిల్ డెవలప్‌మెంట్, ప్లేస్‌మెంట్ విధానం తదితర విషయాలను ఈ సదస్సులో చర్చించారు. ఈ సదస్సుకు 16 యూనివర్సిటీల వీసీలతో పాటు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదిత్యనాధ్‌దాస్, మండలి చైర్మన్ చైర్మన్ విజయనంద్, వైస్ చైర్మన్ వల్లీకుమారిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment