
వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వేంకట రామమూర్తిగారి జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహితీ విభాగం, తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. 2021 ఆగస్టు 28, 29లలో రెండు రోజులపాటు ఘనంగా ఈ వేడుకలు జరుగనున్నాయని తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్లో కేబినేట్ మంత్రిగా పని చేస్తున్న తెలుగు సంతతికి చెందిన డాక్టర్ శశి పిల్లలమర్రి (పంజా) ముఖ్య అతిధి హాజరుకానున్నట్టు ఆయన వెల్లడించారు.
పుస్తకావిష్కరణ
తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు పశ్చిమ బెంగాల్‌లో డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సేవలందిస్తున్న మరో తెలుగు తేజం బొప్పూడి నాగ రమేశ్ ప్రత్యేక అతిధిగా ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి విశిష్ఠ అతిధిగా పాల్గొనబోతున్నట్టు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తనికెళ్ల భరణి రచించిన ఎందరో మహానుభావులు గ్రంథం ఆంగ్ల అనువాదాన్ని డాక్టర్ పంజా ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటి, ఢిల్లీ క్రీడా విశ్వవిద్యాలయం ఉపకులపతి కరణం మల్లేశ్వరిలు ముఖ్య అతిధులుగా పాల్గొంటున్నారు. ఆగష్టు 28, 29 రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం రాత్రి 8:30 లకు ప్రారంభం అవుతుందని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment